Banjara Hills police
-
పబ్‌ను డ్యాన్స్ ఫ్లోర్గా మార్చిన యజమానుల రిమాండ్
బంజారాహిల్స్: అడ్డదారుల్లో డబ్బులు సంపాదించేందుకు పబ్‌ను డ్యాన్స్ ఫ్లోర్గా మార్చి అశ్లీల నృత్యాలను ప్రోత్సహిస్తున్న పబ్ యజమానులను బంజారాహిల్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్ నెం. 3లోని టేల్స్ ఓవర్ ద స్పిరిట్ (టాస్) పబ్‌లో గత కొంతకాలంగా యువతులను ఎరగా వేసి యువకులతో భారీగా మద్యం తాగిస్తూ వారు మద్యం మత్తులో ఉండగా ఇష్టానుసారంగా బిల్లులు వేసి వసూలు చేస్తున్నట్లు సమాచారం అందడంతో టాస్‌్కఫోర్స్ పోలీసులు రెండు రోజుల క్రితం ఈ పబ్‌పై దాడులు చేసి అర్ధనగ్న నృత్యాలు చేస్తూ యువకులకు ఎరవేస్తున్న 47 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు 95 మంది యువకులను అదుపులోకి తీసుకుని నోటీసులు ఇచ్చి పంపించారు. పబ్ యజమానులు బింగి బలరాం గౌడ్, బింగి శ్రీనివాస్‌గౌడ్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరితో పాటు డీజే ప్లేయర్ ఆసిఫ్, నలుగురు బౌన్సర్లు, మేనేజర్, బార్టెండర్లను కూడా అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్న 42 మంది యువతుల్లో 10 మంది తరచూ పట్టుబడుతుండటంతో వారిని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా పబ్‌ను డ్యాన్స్ఫ్లోర్గా మార్చి నిబంధనలు అతిక్రమించిన యజమానులు బింగి బలరాంగౌడ్, శ్రీనివాస్‌గౌడ్‌లను అరెస్ట్ చేయడమే కాకుండా పబ్‌ను సీజ్ చేయాలని ఆర్డీవోకు లేఖ రాశారు. లైసెన్స్‌ను రద్దు చేయాలని కూడా ఎక్సైజ్ అధికారులకు లేఖ రాసినట్లు పోలీసులు తెలిపారు. -
బంజారాహిహిల్స్: బోర్ వేస్తే రంగు నీళ్లు వస్తున్నాయ్!
హైదరాబాద్: బంజారాహిహిల్స్ రోడ్ నెం. 14లోని నూర్నగర్తో పాటు చుట్టూ ఉన్న నందినగర్, వేంకటేశ్వరనగర్, గురుబ్రహ్మనగర్, ఇబ్రహీంనగర్ బస్తీవాసులతో పాటు సమీపంలోని ఇన్‌కంట్యాక్స్ క్వార్టర్స్, ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్స్‌లో భూగర్భజలాలు కలుషితం అవుతున్నాయి. నూర్‌నగర్‌లో ఇష్టానుసారంగా పా ర్కింగ్ స్థలాలు, మెట్ల కింద స్థలాలు కూడా ఇటీవల అద్దెలకిస్తూ దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటి కోసం వినియోగిస్తున్న రసాయనాలతో భూగర్భ జలాలను కలుషితం అవుతున్నాయి. బోర్లతో పాటు మంచినీటి పైప్లైన్లు కూడా ఈ డయింగ్‌లో వాడుతున్న రసాయనాలతో కలుషితం అవుతూ స్థానికులు అనారోగ్యం బారిన పడుతున్నారు. పెద్ద ఎత్తున ఫిర్యా దులు వస్తుండటంతో స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులకు నీళ్లు ఎలా కలుషితం అవుతున్నా యో చూపించారు. ఇక్కడి వ్యాపారాలు రసాయనాలు కలిసిన నీళ్లను బోర్లలో పోసిన దృశ్యాలు చూసిన అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ నీటి కలుషితంపై స్థానికులంతా కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేశారు. ప్రతిరోజూ కలుషిత నీటిపై స్థానికు లు, వ్యాపారులకు మధ్య, గొడవలు సాధారణం అ య్యాయి. కొంత మంది వ్యాపారులు డయింగ్ తర్వా త వచ్చే నీళ్లను రోడ్లు, డ్రెనేనేజీ పైప్లైన్లలో పోస్తున్నారు. ఫలితంగా రసాయన వాయువులు స్థానికులకు మరో సమస్యగా మారాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించాలని బస్తీవాసులు కోరుతున్నారు. -
కుటుంబంలో స్పర్ధలతోనే అలీఖాన్ ఆత్మహత్య?
హైదరాబాద్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వియ్యంకుడు మజారుద్దీన్ అలీఖాన్(60) ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సోమవారం మధ్యాహ్నం బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఎమ్మెల్యే కాలనీలో తన నివాసంలో రివాల్వర్‌తో కాల్చుకొని ఆయన మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆత్మహత్యకు గల కారణాలపై కుటుంబ సభ్యులతో పాటు ఆ ఇంట్లో పని చేస్తున్న సిబ్బందిని విచారిస్తున్నారు. మజారుద్దీన్కు రెండు లైసెన్స్డ్ తుపాకులు ఉండగా వీటిని గత డిసెంబర్లో బంజారాహిల్స్‌లోని గన్ అఫైర్స్‌లో డిపాజిట్ చేశారు. అయితే ఇందులో ఒక పిస్టల్‌ను తిరిగి వారం క్రితమే రిలీజ్ చేసుకొని ఇంటికి తెచ్చుకున్నట్లుగా తెలుస్తోంది. భార్యతో ఇంటి వివాదం..: ప్రస్తుతం ఉన్న ఇల్లు ఆయన భార్య అఫియా రషీద్ అలీఖాన్ పేరు మీద ఉండగా ఈ ఇంట్లో తాను మాత్రమే ఉంటానని భర్తతో పాటు కొడుకు, కోడలును బయటికి పంపించాలంటూ ఆమె సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. నెలన్నర క్రితం తీర్పు కాపీతో బంజారాహిల్స్ పోలీసుల బందోబస్తు మధ్య ఆమె ఇంట్లోకి వెళ్ళారు. కానీ ఇంట్లో ఉన్న వాళ్లెవరూ బయటకు వెళ్లలేదు. ఇక ఇంట్లోకి వెళ్ళిన ఒకటి, రెండు రోజులకే గొడవలు తీవ్రమై ఆమె కత్తితో చెయ్యి కూడా కోసుకున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ ఇంటి వివాదంతో పాటు భార్యా భర్తల మధ్య తరచూ మనస్ఫర్థలు వచ్చేవని, కుమారుడు పూర్తిగా తండ్రికి మద్దతుగా ఉండే వాడని చెబుతున్నారు. ఒక రౌండ్ కాల్పులు... మజారుద్దీన్ తన పిస్టల్‌తో ఒక రౌండ్ కాల్పులు జరుపుకున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. బుల్లెట్ కుడివైపు కణతి నుంచి ఎడమ వైపు మీదుగా బయటపడి ఆ గదిలోనే క్లూస్ టీమ్‌కు లభించింది. పోలీసుల దర్యాప్తునకు కుటుంబ సభ్యులు అంతగా సహకరించడం లేదని తెలుస్తోంది. మృతుడి సోదరుడు జహీరుద్దీన్ అలీఖాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు. -
హై వ్యాల్యూమ్‌తో డీజే.. బంజారాహిల్స్‌లో రెండు పబ్‌లపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్‌కు అడ్డంకులు కలిగించడమే కాకుండా హై వ్యాల్యూమ్‌తో డీజే ఏర్పాటు చేసి శబ్ధ కాలుష్యానికి పాల్పడిన రెండు పబ్‌లపై బంజారాహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు. వివరాలివీ... బంజారాహిల్స్ రోడ్ నెం. 14లో కేబీఆర్ పార్కు ముందు రియోట్ పబ్, చీర్స్ పబ్ ఒకే భవనంలో కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి 1.10 గంటల సమయంలో స్థానిక పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా ఈ రెండు పబ్‌ల నుంచి నిబంధనలకు విరుద్ధంగా డీజే సౌండ్ వినిపిస్తుండటంతో తనిఖీలు చేపట్టారు. గడువు ముగిసిన తర్వాత కూడా డీజే ఏర్పాటు చేయడమే కాకుండా ప్రధాన రోడ్డుపై పెద్ద ఎత్తున వాహనాలు పార్కింగ్ చేసి రోడ్డుపై కస్టమర్లు న్యూసెన్స్ చేస్తుండటంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో భాగంగానే రియోట్ పబ్ యజమాని కన్హయ్య కుమార్‌సింగ్, చీర్స్ పబ్ యజమాని తానిశెట్టి రాములపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బంజారాహిల్స్: ఖరీదైన కార్లే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు
స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు హై ఎండ్ కార్ల భరతం పట్టారు. ఈ రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పది వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ దర్జాగా తిరుగుతున్న ఖరీదైన కార్లు పెద్ద ఎత్తున పట్టుబడ్డాయి. సాక్షి, బంజారాహిల్స్: బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్టడీ సర్కిల్, తాజ్ మహల్ హోటల్, టీవీ చౌరస్తా, కళింగ కల్చరల్ సెంటర్ చౌరస్తా, తాజ్‌కృష్ణ ఎదురుగా బంజారాహిల్స్, ఎస్సార్‌నగర్, సైఫాబాద్, నారాయణగూడ, చిక్కడపల్లి ట్రాపిక్ పోలీస్ స్టేషన్లకు చెందిన ఎస్ఐలు బృందాలుగా ఏర్పడి తనఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా డ్రైవింగ్ లైసెన్సు లేకుండా నడుపుతున్న ఓ వ్యక్తి కారును సీజ్ చేశారు. ► నంబర్ ప్లేటు లేకుండా తిరుగుతున్న నాలుగు కార్లను సీజ్ చేశారు. ఈ అయిదు కార్లపై ఛార్జిషీటు దాఖలు చేయనున్నారు. ►బ్లాక్ ఫిల్మ్‌లతో తిరుగుతున్న 35 మంది కారు యజమానులకు ఒకొక్కరికి రూ. 700లు చొప్పున జరిమానా విధించారు. ఇర్రెగ్యులర్, ఇన్‌ప్రాపర్ నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న 32 మంది వాహనదారులకు రూ. 200ల చొప్పున జరిమానా విధించారు. ►ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న 39 మంది వాహనదారులకు రూ. 200ల చొప్పున జరిమానా విధించారు. రిజిస్ట్రేషన్ లేకుండా తిరుగుతున్న మూడు కారు యజమానులకు రూ. 2000ల ప్రకారం జరిమానా విధించారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. ► జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, నీరూస్ జంక్షన్, రోడ్ నంబర్ 45, ఫిలింనగర్, రోడ్ నంబర్ 36 కళాంజలి వద్ద జూబ్లీహిల్స్ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ముత్తు, మారేడుపల్లి, మహంకాళి, గోపాలపురం ట్రాఫిక్ పోలీసు స్టేషన్ల నుంచి అయిదు చోట్ల స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ► బ్లాక్ ఫిల్మ్‌లతో తిరుగుతున్న 48 టాప్ మోడల్ కార్ల యజమానులకు రూ. 700ల ప్రకారం జరిమానా విధించారు. ► ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న 13 వాహనాలపై జరిమానా విధించారు. ► ఇంప్రాపర్, ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్లతో ప్రయాణిస్తున్న 45 కార్లకు రూ. 200ల వంతున జరిమానా విధించారు. నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న 2 వాహనాలపై చార్జిషీట్ దాఖలు చేయనున్నారు. సర్వీసు రోడ్డులో పార్కింగ్ చేసిన ఒక వాహనంపై జరిమానా విధించారు. ► ఇద్దరు వాహనదారులపై 41(ఐ) సీపీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమించి పాదచారులకు ఇబ్బంది కల్గిస్తున్న ఒక వాహనదారుడిపై కేసు నమోదైంది. అక్రమ పార్కింగ్ చేసిన ఇద్దరు వాహనదారులకు జరిమానా విధించారు. -
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ అరెస్ట్‌కు సంఘీభావం తెలిపేందుకు వెళ్లగా.. అక్కడ ఎమ్మెల్యేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఓయూలో రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తోంది. గేట్లు ఎక్కి ఓయూ ఆడ్మినిస్ట్రేషన్ భవనాన్ని ధ్వంసం చేశారు. అద్దాలు పగలగొట్టి లోపలికి వెళ్లిన నాయకులు వీసీ వైఖరికి నిరసనగా గాజులు, చీరలు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఓయూ ముట్టడికి యత్నించిన ఎన్ఎస్యూఐ నాయకులను అరెస్ట్ చేశారు. దీనిపై జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రాహూల్ ఓయూ పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేశారని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ కష్టం అంత ఆవిరి అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మానియాలో చదివిన వారు చాలా మంది ఎమ్యెల్యేలు అయ్యారని, ఒక్కరు కూడా కేసీఆర్‌ను యూనివర్సిటీకి ఎందుకు తీసుకుపోలేదని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీని ఓయూకి తీసుకెళ్తామని, ఈ అంశంపై సోమవారం 3 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీ వరకు వెళ్లి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. ‘వీసి గారు ఇది ముగింపు కాదు. సందర్శన మాత్రమే. ఓ ఎంపీగా చూడటానికి వస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ విశిష్టతను తెలుసుకునేందుకు వస్తే అడ్డుకునేందుకు ఎవరు మీరు? ఉమ్మడి రాష్ట్రంలో లేని జీఓలు ఎలా తీస్తారు. కృతజ్ఞత లేని రాష్ట్రంగా తెలంగాణ ఎందుకు చేస్తున్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ ప్రజలు అవమానాలకు గురి కావాలా. రాహుల్‌తో ముగ్గురు ఎంపీలు, ఆరుగురు ప్రజా ప్రతినిధులం ఉస్మానియాలో సందర్శిస్తాం. ఈ నెల 7న ఎట్టిపరిస్థితిలో రాహుల్ గాంధీని ఉస్మానియాకు తీసుకెళ్దాం.’ అని జగ్గారెడ్డి తెలిపారు. చదవండి: రోజుకు 10 నిమిషాలు నవ్వితే.. ఎన్ని కేలరీల కొవ్వు కరుగుతుందో తెలుసా! -
బంజారాహిల్స్‌లో పని మనిషి అరెస్టు
బంజారాహిల్స్: నమ్మకంగా పని చేస్తున్నట్లు నటించి ఇంటి యజమాని కళ్లుగప్పి బంగారు ఆభరణాలు తస్కరించిన ఘట నలో నిందితురాలిని బంజారాహిల్స్ క్రైం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్ రోడ్ నెం.14 లోని ఇన్కమ్ ట్యాక్స్ క్వార్టర్స్ అపార్ట్‌మెంట్స్‌లో నివసించే ఉదయ్‌భాస్కర్ అనే అధికారి ఇంట్లో అదే ప్రాంతానికి చెందిన సరోజ అనే మహిళ కొంత కాలంగా పని చేస్తోంది. ఈ నెల 15వ తేదీన ఆ ఇంట్లో బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలపై ఆమె కన్ను పడింది. యజమాని లేని సమయంలో తొమ్మి ది తులాల బంగారు ఆభరణాలు తస్కరించి ఆ రోజు నుంచి పనికి రావడం మానేసింది. విషయం తెలుసుకున్న ఉదయ్‌భాస్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన క్రైం పోలీసులు అనుమానితురాలు సరోజను తమదైన శైలిలో విచారించడంతో దొంగిలించిన సొమ్ము గురించి ఒప్పుకుంది. బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితురాలిని రిమాండ్‌కు తరలించారు. క్రైం ఎస్ఐ భరత్ భూషణ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: నా కోరిక తీర్చు.. లేదంటే నీ కొడుకు, భర్తను అంతం చేస్తా హైదరాబాద్‌లో దారుణం: సోదరిపై అత్యాచారం -
మాజీ ఎమ్మెల్యే ‘వరద’ కుమారుడు, అల్లుడిపై కేసు
ప్రొద్దుటూరు/హైదరాబాద్: ఒక డిగ్రీ కళాశాల స్థల వివాదానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కుమారుడు కొండారెడ్డి, అల్లుడు రామచంద్రారెడ్డితోపాటు మరో 15 మందిపై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో మహిళల విద్య కోసం 1977లో స్థానిక అగస్తేశ్వర స్వామి ఆలయానికి చెందిన 18.18 ఎకరాల భూమిని దేవరశెట్టి ఆదిలక్షుమ్మ మహిళా డిగ్రీ కళాశాలకు కేటాయించారు. నిబంధనల ప్రకారం.. ఈ భూమిని అమ్మకూడదు. అయితే కళాశాల నిర్వాహకులు ఇందులోని 11 ఎకరాలను అమ్మేందుకు మాజీ ముఖ్యమంత్రి సోదరుడొకరు చక్రం తిప్పారు. ఇందులో భాగంగా 2012 మార్చి 30న ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. ఈ స్థలం విలువ ప్రస్తుతం ఎకరా రూ.15 కోట్లకుపైగా ఉంది. ఇందులో రెండున్నర ఎకరాల స్థలం మిట్టా శివ గణేశ్‌కు ఉంది. ఇది వివాదంలో ఉండటంతో ఆయన ఇటీవల రామచంద్రారెడ్డిని సంప్రదించాడు. వివాదాన్ని పరిష్కరిస్తే ఎకరం స్థలాన్ని ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే మొత్తం రెండున్నర ఎకరాలు తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని కొండారెడ్డి, రామచంద్రారెడ్డితోపాటు వారి గన్మెన్లు, అనుచరులు హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఉంటున్న మిట్టా శివగణేశ్‌పై మంగళవారం దాడి చేశారు. చంపేస్తామని బెదిరించి బలవంతంగా సంతకాలు తీసుకున్నారు. ఈ మేరకు శివగణేశ్ వారిపై ఫిర్యాదు చేయడంతో హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. కాగా, ఈ కళాశాల స్థలం అమ్మకంపై స్థానికులు కూడా కోర్టులో కేసు వేశారు. -
డీఎస్పీ వీడు పక్కా 420
-
హైదరాబాద్‌లో కిడ్నీ రాకెట్ నిర్వాహకుడి అరెస్టు
-
కిడ్నీ పేరుతో రూ.34 లక్షల టోకరా.. దాంతో
సాక్షి, జూబ్లీహిల్: అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ను బంజారాహిల్స్ పోలీసులు ఛేదించి నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం నిర్వహించి మీడియా సమావేశంలో వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు పట్టణానికి చెందిన దోగిపర్తి షణ్ముఖ పవన్ శ్రీనివాస్ (25) గతంలో ఎయిర్‌క్రాఫ్ట్ మెయిన్టెనెన్స్ ఇంజినీర్‌గా పని చేశాడు. తర్వాత షేర్మార్కెట్లో పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. అప్పుల పాలైన శ్రీనివాస్ ఫేస్బుక్ ద్వారా కొందరు వ్యక్తులతో పరిచయం చేసుకొని 2013లో శ్రీలంకలోని కొలంబోలో ఒక ఆసుపత్రిలో తన కిడ్నీని రూ. 5 లక్షలకు అమ్ముకొని అప్పులు తీర్చాడు. మరింత డబ్బు సంపాదించాలనే దురాశతో తానే కిడ్నీ వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్న శ్రీనివాస్ సదరు రాకెట్‌తో పరిచయం పెంచుకున్నాడు. బాధితులను, కిడ్నీ డోనర్స్‌ను కొలంబో తీసుకెళ్లి ఇప్పటివరకు ఏడుగురికి కిడ్నీ ఆపరేషన్లు చేయించాడు. మరో 23 ముగ్గురిని కిడ్నీ ఇప్పిస్తానని డబ్బు తీసుకొని మోసం చేశాడు. ఇతని ద్వారా శ్రీలంకలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న వ్యక్తి హైదరాబాద్‌లో చనిపోయాడు. 2016లో అరెస్టు... దీంతో 2016లో శ్రీలంక పోలీసులు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. 15 నెలలు జైలులో ఉండి విడుదలై ఇండియాకు వచ్చి తిరిగి వ్యాపారం ప్రారంభించాడు. కిడ్నీలు అవసరమైన పేషంట్లకు ఇంటర్నెట్ ద్వారా వలవేసేవాడు. వారికి విదేశాల్లో మెరుగైన వైద్యం చేయిస్తానని, కిడ్నీలు దానం చేయిస్తానని నమ్మబలికేవాడు . ఈ క్రమంలో నగరంలోని శ్రీనగర్‌కాలనీకి చిందిన నాగరాజు (55) రెండు కిడ్నీలు చెడిపోవడంతో అతడిని భార్య బిజ్జల భారతి బంజారాహిల్స్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఇంటర్నెట్ సహా ఇతర మార్గాల ద్వారా బాధితుల గురించి తెలుసుకున్న శ్రీనివాస్.. నాగరాజు భార్య భారతికి మాయమాటలు చెప్పి నమ్మించాడు. నాగరాజుకు టర్కీలో మెరుగైన వైద్యం చేయిస్తానని, కిడ్నీలను ఇచ్చే దాతలను ఏర్పాటు చేయిస్తానని, అందుకు రూ. 34 లక్షల ఖర్చు అవుతుందన్నాడు. భారతి కుటుంబం ముందస్తుగా శ్రీనివాస్‌కు వివిధ బ్యాంకు అకౌంట్ల ద్వారా రూ. 24 లక్షలు ట్రాన్స్ఫర్ చేసింది. డాలర్లుగా మార్చడంతో పాటు ఇతర ఖర్చుల కోసం రూ. 10 లక్షల నగదుగా ఇవ్వాలని కోరాడు. ఒప్పందం ప్రకారం సృజన్ అనే వ్వక్తి భారతి ఇంటికి వచ్చి నగదు, నాగరాజు, కుటుంబసభ్యుల పాస్‌పోర్ట్‌లను తీసుకెళ్లాడు. టర్కీలోని ఆస్పత్రిలో వైద్యం, విమాన టికెట్లు, హోటల్ ఖర్చులు, దాతకు, డాక్టర్లకు చెల్లించాల్సిన మొత్తం తాను చూసుకుంటానని నమ్మబలికాడు. ఆ తర్వాత కనిపించకుండాపోయాడు. ఫోన్లో కూడా అందుబాటులోకి రాలేదు. రూ. 30 నుంచి 50 లక్షలకు ఒప్పందం... దీంతో తాము మోసపోయామని అనుమానం వచ్చిన భారతి గతేడాది జూన్ 14న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇంటర్నెట్ ద్వారా బాధితుల గూర్చి తెలుసుకునే శ్రీనివాస్ వారి బలహీతలను సొమ్ము చేసునేవాడు. శ్రీలంకలోని వెస్ట్రన్, నవలోక్, హేమాస్, లంక ఆసుపత్రి సహా టర్కీలోని పలు ఆసుపత్రుల్లో కిడ్నీ మార్పిడి చేయిస్తానని, రూ.30 నుంచి 50లక్షలకు ఒప్పందం చేసుకునేవాడు. ఇందులో కేవలం రూ.5 లక్షలలోపు మాత్రమే దాతకు, డాక్టర్లకు, ఏజెంట్లకు పంచి మిగతాది కాజేసేవాడు. భారతి కుటుంబం నుంచి తీసుకున్న సొమ్ము మొత్తం శ్రీలంకలోని కాసినోల్లో ఖర్చుచేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు శనివారం నిందితుడు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. ఇతడిపై విజయవాడలో ఇప్పటికే రెండు కేసులు, నగరంలోని సీసీఎస్‌లో మరో కేసు ఉన్నాయి. బాధితుల పాస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకున్నారు. 406,420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించిన బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్.రావు, ఇన్స్పెక్టర్ కళింగరావు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రవికుమార్‌లను డీసీపీ అభినందించారు. -
కోడెల ఫోన్ నుంచి ఆ టైమ్‌లో చివరి కాల్..
సాక్షి, హైదరాబాద్: టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అనుమానాస్పద మృతి కేసులో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కోడెల ఆత్మహత్యకు గత కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఇప్పటికే పలు కీలక ఆధారాలను సేకరించారు. కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డ వైరును స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం 8:30కి కోడెల ఫోన్ నుండి చివరి కాల్ వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. గత రెండు రోజులుగా కోడెల ఎవరెవరికి ఫోన్ చేశారు, ఎవరి నుంచి ఆయనకు కాల్స్ వచ్చాయనేదానిపై దృష్టి సారించారు. కోడెల నివాసంలో వేలిముద్రలను క్లూస్ టీమ్ సేకరించింది. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత కేసులో పురోగతి వచ్చేఅవకాశముందని పోలీసులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల స్టేట్ మెంట్ లిఖితపూర్వకంగా నమోదు చేశామని, అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కోడెల పర్సనల్ మొబైల్ మిస్సింగ్ కోడెల శివప్రసాదరావు వ్యక్తిగత మొబైల్ కనిపించకుండా పోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోడెల కూతురు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఆమె ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 174 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కోడెల చివరగా 24 నిమిషాలు ఫోన్ మాట్లాడినట్లు కాల్‌డేటా ఆధారంగా పోలీసులు గుర్తించారు. నిన్న సాయంత్రం 5 గంటలకు కోడెల సెల్‌ఫోన్ స్విచాఫ్ అయినట్లు కనుగొన్నారు. ఫోన్‌ను ఎవరైనా దొంగిలించారా, దాచిపెట్టారా అనేది దర్యాప్తులో తేలనుంది. కాగా, కోడెల శివప్రసాదరావు భౌతికకాయానికి గుంటూరు జిల్లా నరసరావుపేటలో రేపు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఆదేశించారు. కోడెల శివప్రసాదరావు పార్థీవ దేహాన్ని హైదరాబాద్ నుంచి ఈ మధ్యాహ్నం గుంటూరుకు తీసుకొచ్చారు. మరోవైపు కోడెల కుమారుడు శివరామ్ విదేశాల నుంచి గుంటూరు చేరుకున్నారు. సంబంధిత వార్తలు... మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య కొడుకే వేధించాడు: కోడెల బంధువు కోడెల మృతిపై బాబు రాజకీయం! ఆది నుంచి వివాదాలే! కోడెల మృతిని రాజకీయం చేయవద్దు అధికార లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు -
పోలీసులు అరెస్ట్ చేస్తారని.. గోడ దూకి పారిపోయా
సాక్షి, హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. బంజారాహిల్స్ పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి రావడంతో గోడ దూకి పారిపోయానని, పోలీసులు అరెస్టు చేయకుండా తనకు ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలన్న రవిప్రకాశ్ అభ్యర్థనను తోసిపుచ్చింది. పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం రవిప్రకాశ్ దాఖలు చేసుకున్న మూడు పిటిషన్లను కొట్టేసింది. రవిప్రకాశ్ విషయంలో సీఆర్పీసీ సెక్షన్ 41–ఏ ప్రకారం నడుచుకోవాలని పోలీసులకు స్పష్టం చేసింది. ఇప్పటికే పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 41–ఏ కింద నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ముందస్తు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ. రాజశేఖర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏబీసీపీఎల్ కార్పొరేషన్ యాజమాన్యం మార్పిడి, వాటాల బదిలీ తదితర అంశాలపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో కేసులు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని పోలీసులు పట్టించుకోకుండా తనపై కేసులు నమోదు చేశారని, ఈ కేసుల నమోదు వెనుక దురుద్దేశాలున్నాయని, అందువల్ల తనకు ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రవిప్రకాశ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి విచారణ జరిపారు. కేసుల నమోదు వెనుక దురుద్దేశాలున్నాయి... ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది దల్జీత్‌సింగ్ అహ్లువాలియా వాదనలు వినిపిస్తూ రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేసి తీరాలన్న ఉద్దేశంతో పోలీసులు ఉన్నారని తెలిపారు. అందుకే ఒకే అంశానికి సంబంధించి మూడు వేర్వేరు కేసులు నమోదు చేశారన్నారు. పిటిషనర్ కొన్ని డాక్యుమెంట్లను ఫోర్జరీ చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారని, వాస్తవానికి ఆ డాక్యుమెంట్లు గతేడాది ఏప్రిల్ 18న జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)కు సమర్పించారని తెలిపారు. దాదాపు ఏడాది తరువాత పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ఎన్సీఎల్టీ ముందు విచారణలో ఉన్న వ్యవహారంలో కేసు నమోదు చేయడం దురుద్దేశాలతో కూడుకున్నదని వివరించారు. దురు ద్దేశాలతో కేసు నమోదు చేసినప్పుడు, ముందస్తు బెయిల్ మంజూరు చేయవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందని తెలిపారు. ఈ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సి.ప్రతాప్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ పిటిషనర్‌కు ఇప్పటికే సీఆర్సీపీ సెక్షన్ 41–ఏ, సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేసినా రవిప్రకాశ్ స్పందించలేదన్నారు. ముందు ఆయనను పోలీసుల ముందు హాజరై విచారణకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. అందుకే అప్పుడు గోడ దూకి పారిపోయారు... ఈ సమయంలో అహ్లువాలియా స్పందిస్తూ ఇటీవల టీవీ9 స్టూడియాలోకి వచ్చిన పోలీసులు రవిప్రకాశ్ అరెస్ట్‌కు ప్రయత్నించడంతో ఆయన గోడ దూకి పారిపోయారని తెలిపారు. ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్ల గురించి పోలీసులు కేసు పెట్టారని, అవి ఫోర్జరీవో కావో తేల్చాల్సింది ఎన్సీఎల్టీ తప్ప పోలీసులు కాదని వివరించారు. ఉద్దేశపూర్వకంగా పోలీసులు ఈ వాస్తవాలను తొక్కిపెట్టారని తెలిపారు. ఇదే సమయంలో రవిప్రకాశ్ ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదన్నారు. అందువల్ల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని, ఏ షరతులు విధించినా కట్టుబడి ఉంటామన్నారు. బయట ఉండి సాక్షులను ప్రభావితం చేస్తున్నారు... అయితే ఈ వాదనను ప్రతాప్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. కావాలంటే కేసును 15 రోజులకు వాయిదా వేయవచ్చునని, ఈలోగా పిటిషనర్‌ను పోలీసులు ముందు హాజరై విచారణకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వొచ్చునన్నారు. రవిప్రకాశ్ బయట ఉండి సాక్షులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నారని, ఎటువంటి వాంగ్మూలాలు ఇవ్వొద్దని ఒత్తిడి చేస్తున్నారని, ఇందుకు వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారని ఆయన కోర్టుకు నివేదించారు. తామేమీ రవిప్రకాశ్ విషయంలో కఠిన చర్యలేవీ తీసుకోబోమన్నారు. దీనికి అహ్లువాలియా స్పందిస్తూ, ఆ 15 రోజుల వరకైనా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ముందు విచారణకు వస్తే ఆ తరువాత బెయిల్ గురించి ఆలోచించవచ్చునని ప్రతాప్‌రెడ్డి చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ముందస్తు బెయిల్ కోసం రవిప్రకాశ్ దాఖలు చేసిన మూడు పిటిషన్లను కొట్టేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రవిప్రకాశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. పారిపోయి విలువల గురించి లెక్చర్! టీవీ9 వాటాల వివాదంలో ఫోర్జరీ, డేటా చౌర్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్... సమాజం, విలువలంటూ మరోసారి ఉపదేశమిచ్చారు. కేసులకు భయపడి తెలంగాణ వదిలి పారిపోయిన ఆయన.. పోలీసులపై, ఈ వివాదంపై వార్తలు రాస్తున్న జర్నలిస్టులపై అక్కసు వెళ్లగక్కారు. తనపై వస్తున్న ఆరోపణలు, నమోదైన కేసుల నేపథ్యం గురించి బుధవారం రవిప్రకాశ్ మీడియాకు మరో వీడియోను విడుదల చేశారు. తనకు, కొత్త యాజమాన్యానికి ఎక్కడ విభేదాలు వచ్చాయి? అవి ఎలా మొదలయ్యాయి? అంటూ వీడియోలో సుదీర్ఘ వివరణ ఇచ్చుకున్నారు. తనకు, సిటీనటుడు శివాజీ మధ్య తలెత్తిన వాటాల వివాదం ఎన్సీఎల్టీ పరిధిలో ఉండగా పోలీసులు కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. ఈ విషయంలో తెలంగాణ పోలీసులది అజ్ఞానమని అక్కసువెళ్లగక్కారు. కొన్ని మీడియా సంస్థలు తనను ఉగ్రవాదితో పోలుస్తూ పారిపోయానంటూ వార్తలు రాయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మీడియాకు పాఠాలు కూడా చెప్పారు. వీడియో సాంతం.. విలువలు, సమాజహితం అంటూ పదేపదే వల్లె వేసిన రవిప్రకాశ్... ఇంతకీ తానెందుకు పారిపోయానన్నది మాత్రం చెప్పలేదు. కోర్టులపై, చట్టాలపై విజ్ఞత ప్రదర్శిస్తూనే పోలీసులను ఎందుకు తప్పుబడుతున్నదీ మాత్రం చెప్పలేకపోయారు. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు.. మధ్యలో మీడియా మీద పడటం, వార్తల విషయంలో హితబోధ చేస్తూ అక్కసును బయటపెట్టుకున్నారు. వీడియోను పరిశీలిస్తున్న పోలీసులు.. రవిప్రకాశ్ వీడియో బయటకు రాగానే సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వీడి యోను ఎక్కడ షూట్ చేశారు, ఎప్పుడు అప్లోడ్ చేశారో గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటికే సిమ్‌కార్డులు, ఫోన్లు మారుస్తూ పోలీసులకు తన జాడ చిక్కకుండా జాగ్రత్త పడుతున్న రవిప్రకాశ్‌కు ఈ వీడియో తీయడంలో ఎవరైనా సాయం చేశారా? అతని ఫోన్ నుంచే అప్లోడ్ చేశారా? అనే విషయాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ విషయంలో ఇప్పటికే వారు పురోగతి సాధించినట్లు సమాచారం. -
సినీ పాటల రచయిత కులశేఖర్ అరెస్ట్
హైదరాబాద్: దేవాలయాల్లో పూజారుల కళ్లుగప్పి శఠగోపాలు, వారి సెల్ఫోన్లు, డబ్బు లు చోరీచేస్తున్న ప్రముఖ సినీ గేయరచయిత కులశేఖర్‌ను బంజారాహిల్స్ క్రైం పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. విశాఖపట్నానికి చెందిన తిరుమల పల్లెర్లమూడి కులశేఖర్(47) కొన్నేళ్లుగా హైదరాబాద్‌లోని మోతీనగర్‌లో నివాసముంటూ పలు సినిమాలకు పాటలు రాశాడు. సంతోషం, ఘర్షణ, ప్రేమలేఖ, ఫ్యామిలీ సర్కస్, చిత్రం, జయం, వసంతం, మృగరాజు, ఇంద్ర తదితర వంద సినిమాలకు పాటలు రాశాడు. కొంతకాలంగా అవకాశాలు రాకపోవడంతో బతుకుదెరువు కోసం చోరీలకు పాల్పడుతున్నాడు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2 లోని ఇందిరానగర్‌లో ఉన్న అమ్మవారి ఆలయంలో పూజారి బ్యాగ్ చోరీకి గురవ్వగా, పోలీసులు నిఘా వేసి సీసీ కెమెరా ఫుటేజీలు, కదలికల ఆధారంగా కులశేఖర్‌ను విచారించడంతో గుట్టురట్టయింది. గతంలో గుడిలో చోరీ చేసిన కేసులో 6 నెలల జైలు శిక్ష అనుభవించినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుడి నుంచి రూ.50 వేల విలువ చేసే పది సెల్ఫోన్లు, రూ.40 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. వందకు పైగా సినిమాలకు కులశేఖర్ పాటలు రాశాడు. కొన్నేళ్లుగా చిత్ర పరిశ్రమకు దూరమై చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. కుటుంబ సభ్యులకు కూడా దూరమయ్యాడు. 2016లో కాకినాడలోని ఆంజనేయస్వామి దేవాలయంలో శఠగోపం చోరీ చేశాడు. ఆ కేసుకు సంబంధించి రాజమండ్రి జైలులో ఆరు నెలలపాటు జైలుశిక్షను అనుభవించాడు. ఓ సినిమాలో కులశేఖర్ రాసిన పాట పూజారులను కించపరిచేలా ఉందని ఆ సామాజికవర్గం అతన్ని దూరం పెట్టింది. బ్రాహ్మణుల మీద కులశేఖర్ ద్వేషాన్ని పెంచుకుని పూజారులను, ఆలయాలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నాడు. -
బయటకొచ్చిన ‘కత్తి’.. రాముడిపై మళ్లీ పోస్ట్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ బయటికొచ్చారు. గత రాత్రి(సోమవారం) బంజారాహిల్స్ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అర్థరాత్రి విచారణ కోసం స్టేషన్‌కి తీసుకెళ్లిన పోలీసులు.. ఆయన్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే కేసుకు సంబంధించిన వివరాలు చెప్పటంతో.. వివరణ కోరుతూ ఇప్పుడు నోటీస్ ఇచ్చారని, దర్యాప్తుకు సహకరించమని కోరారని కత్తి మహేష్ తెలిపారు. ఇకపైన మిగతా విషయాలు చూడాలి అంటూ ఫేస్బుక్లో ఆయన ఓ పోస్ట్ చేశారు. అయితే అంతటితో ఆగకుండా మరో పోస్టుతో ఆయన దుమారం రేపారు. ‘శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అనువదించిన రామాయంలోని యుద్ధకాండలోని కొంత భాగాన్ని’ ఆయన పోస్ట్ చేశారు. తాను ఎవరి మనోభావాలను దెబ్బతీయలేదని తన వ్యాఖ్యలను మహేష్ సమర్థించుకుంటున్న విషయం తెలిసిందే. (ఇంతకీ కత్తి ఏమన్నాడంటే...) -
అదృశ్యమైన ముగ్గురు చిన్నారుల ఆచూకీ లభ్యం
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన ఇద్దరు బాలికలు, ఓ బాలుడి ఆచూకీ లభ్యమైంది. ముంబయి సమీపంలోని కళ్యాణ్ పట్టణంలో చిన్నారులను గుర్తించినట్లు బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించారు. అనుమానాస్పద స్థితిలో కనిపించిన చిన్నారులను ఓ స్వచ్ఛంద సంస్థ చేరదీసి వారిని అక్కున చేర్చుకుంది. స్వచ్ఛంద సంస్థ సిబ్బంది బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సహా చిన్నారుల కుటుంబ సభ్యులు కళ్యాణ్ బయల్దేరి వెళ్లినట్లు సమాచారం. అసలు విషయం ఏంటంటే.. ఇంటి నుంచి వెళ్లిపోతున్నామంటూ ఇద్దరు బాలికలు, ఓ బాలుడు లేఖ రాసిపెట్టి అదృశ్యం కావడం నగరంలోని టోలీచౌకీలో కలకలం రేపింది. 'అమ్మా.. నాన్నా మీకు భారం కాము.. మీకు దూరంగా వెళ్లిపోతున్నాం.. అందరూ పిల్లల లాగే మేము ఉంటాం..' అంటూ ఈ ముగ్గురు ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఆపై ముంబయి వెళ్తున్నామంటూ ఫోన్ చేయడంతో కుటుంబసభ్యులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, వారు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టోలీచౌకీకి చెందిన కైఫ్ సబెరి (11), అస్మా సబెరి (12), హాఫ్సా సబెరి (15)ల అదృశ్యంపై విచారణ చేపట్టిన క్రమంలోనే ముంబయి నుంచి ఫోన్ చేసిన ఓ స్వచ్ఛంద సంస్థ ఈ ముగ్గురి సమాచారం అందించింది. వారికి నగరానికి తీసుకొచ్చేందుకు పోలీసులు, చిన్నారుల కుటుంబసభ్యులు కళ్యాణ్‌కు వెళ్లారు. -
‘ఎంపీ కుమార్తె’ను గుర్తించిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని సిటీ సెంటర్ మాల్లో 20 రోజుల క్రితం హల్చల్ చేసిన ‘ఎంపీ కుమార్తె’ను బంజారాహిల్స్ పోలీసులు గుర్తించారు. సిటీకి చెందిన ఓ వ్యాపారి కుమార్తె అయిన ఆమెకు ఆంధ్రప్రదేశ్ టీడీఎల్పీ కార్యాలయ కార్యదర్శితో దురుసుగా ప్రవర్తించిన కేసులో నోటీసులు జారీ చేశారు. గత నెల 22న టీడీఎల్పీ కార్యాలయ కార్యదర్శి సురేష్ దంపతులు బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని సిటీ సెంటర్ మాల్‌కు షాపింగ్ కోసం వచ్చారు. పని ముగించుకొని లిఫ్ట్‌లో కిందికి వచ్చిన వారిని ఎదురుగా వచ్చిన ఓ యువతి ఢీ కొట్టారు. తాను ఎంపీ కూతురునని... తమాషా చేస్తున్నావా..? ఖబడ్దార్...! అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారు నీవే అడ్డుగా వచ్చి ఢీ కొట్టి తిరిగి మమ్మల్నే తిడుతున్నావంటూ వారు ప్రశ్నిస్తుండగానే సదరు యువతి... సురేష్ అతని భార్యపై దాడి చేశారు. అక్కడున్న వారు వారిస్తున్నా వినకుండా వారి కారుకు సైతం అడ్డుపడి దాని అద్దాలు ధ్వంసం చేశారు. అడ్డుగా వచ్చిన మాల్ సెక్యూరిటీ గార్డులను తోసేశారు. ఈ ఉదంతంపై బాధితులు అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి వినియోగించిన ఫోర్డ్ కారు (టీఎస్ 10 ఈఎల్ 0777) నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె బాలం రాయ్‌కు చెందిన నగల వ్యాపారి కుశాల్ జయంతి లాల్ పర్మార్ కుమార్తె భవ్య పర్మార్(20)గా గుర్తించారు. అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసుకొని ఇటీవలే తిరిగి వచ్చారని, ఆ రోజు తన చిన్నమ్మ, చిన్నాన్నలతో కలిసి షాపింగ్‌కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అకారణంగా సురేష్ దంపతులతో దురుసుగా ప్రవర్తించడంతో పాటు దాడికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. భవ్య పర్మార్‌పై ఐపీసీ సెక్షన్ 323, 509, 341 కింద కేసు నమోదు చేశారు. సంజాయిషీ ఇవ్వాల్సిందిగా సీఆర్పీసీలోని సెక్షన్ 41(ఏ) కింద నోటీసులు జారీ చేశారు. ఆమె స్పం దించే తీరును బట్టి చర్యలు తీసుకోనున్నారు. కేసు పూర్వా పరాల నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. -
‘నన్ను తప్ప ఎవరిని చేసుకున్నా చంపేస్తా’
హైదరాబాద్: ‘నన్ను కాదని ఇంకెవరినీ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు.. ఇంకెవరితోనూ నీ పెళ్లి కానివ్వను... ఒక వేళ వేరే ఎవరినైనా పెళ్లి చేసుకున్నావో వాడితో పాటు నిన్నూ యాసిడ్ పోసి చంపేస్తా.. అంటూ బెదిరిస్తున్న యువకుడిపై బంజారాహిల్స్ పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. ఎస్ఐ గోవర్ధన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఫిలింనగర్‌లోని గౌతంనగర్‌లో నివసించే బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినిని కొంత కాలంగా బీదర్‌కు చెందిన సందీప్(25) ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తననే పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్నాడు. ఆవారాగా తిరిగే నీతో నాకు పెళ్ళేంటి అంటూ విద్యార్థిని అభ్యంతరం తెలుపగా సందీప్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఫేస్బుక్లో అసభ్య పోస్టింగ్‌లు చేస్తూ ఆమె పరువు ప్రతిష్టలను భంగపరుస్తున్నాడు. పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటుంటే అబ్బాయి వద్దకు వెళ్లి ఆమెతో తనకున్న సంబంధాలపై అసత్యప్రచారం చేయసాగాడు. మూడు రోజుల క్రితం బీదర్‌కు చెందిన ఓ యువకుడితో పెళ్ళి నిశ్చయంకాగా సందీప్ ఆ యువకుడి ఇంటికి వెళ్లి తనకు యువతితో స్నేహం ఉందంటూ ప్రచారంచేసి పెళ్లి చెడగొట్టాడు. ఎన్ని సంబంధాలు వస్తున్నా వాటిని చెడగొట్టడమే కాకుండా ఫోన్ చేస్తూ, ఫేస్బుక్లో, వాట్సాప్‌లో ఆమెను ఇబ్బందులు చేయసాగాడు. దీంతో బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా సందీప్‌పై నిర్భయ కేసు నమోదు చేసి దర్తాప్తు చేపట్టారు. -
నిర్మాత సి.కల్యాణ్ తనయుడికి నోటీసులు
హైదరాబాద్: ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో సభ్యుడి పర్సును తస్కరించి.. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా తన అకౌంట్లోకి డబ్బును మార్చుకున్న ఘటనలో ప్రముఖ సినీ నిర్మాత సి.కల్యాణ్ తనయుడు వరుణ్‌కుమార్‌కు బంజారాహిల్స్ పోలీసులు.. స్టేషన్‌కు రావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 22న బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఎమ్మెల్యే కాలనీలో ఉండే వ్యాపారి బిక్కిన శ్రీనివాస్ తన కుమారుడితో కలసి ఎఫ్ఎన్సీసీలో స్విమ్మింగ్ చేయడానికి వచ్చాడు. పర్సును పక్కన పెట్టి స్విమ్మింగ్ చేసి వచ్చేసరికి అది మాయమైంది. అందులో ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులకు చెందిన డెబిట్, క్రెడిట్ కార్డులుండగా, గంట వ్యవధిలోనే ఆయన అకౌంట్లో నుంచి రూ.2.12 లక్షలు ఆన్లైన్ లావాదేవీలు జరిగాయి. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజీలు, బ్యాంకు అకౌంట్లు తనిఖీ చేసిన పోలీసులు దీనికి కారకుడు వరుణ్‌కుమార్ అని గుర్తించారు. దీంతో వరుణ్‌పై చీటింగ్ కేసు నమోదు చేసి... స్టేషన్‌కు వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా డీఐ వెంకటేశ్వర్‌రెడ్డి నోటీసులు జారీ చేశారు. -
ఇంకా పరారీలోనే సినీ దర్శకుడు
హైదరాబాద్: పాత నోట్ల (రద్దయిన పెద్ద నోట్లు) మార్పిడి కేసులో ప్రధాన నిందితుడు, సినీ దర్శకుడు కిట్టు అలియాస్ నల్లూరి రామకృష్ణ ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఆయన కోసం బంజారాహిల్స్ పోలీసుల గాలింపు కొనసాగుతూనే ఉంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లోని కమలాపురి కాలనీలో సినిమా కార్యాలయం తెరిచి ఆ ముసుగులో పాత నోట్ల దందాను కొనసాగిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు 13న రాత్రి పోలీసులు దాడులు చేపట్టారు. ఆ సమయంలో కిట్టు పోలీసుల నుంచి తప్పించుకోగా అక్కడున్న సినీ కార్యాలయం సిబ్బందిని, పాత నోట్లు మార్పిడి కోసం వచ్చినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఏడుగురిని 14న అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడిగా ఉన్న కిట్టు కోసం గాలిస్తూనే ఆయనకు చెందిన కారును సినిమా కార్యాలయం వద్ద సీజ్ చేశారు. ఆయన ఇంటి వద్ద పోలీసులను నిఘాలో ఉంచారు. ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉందని సెల్‌టవర్ సిగ్నల్స్‌ను క్యాచ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో కిట్టు ప్రధాన నిందితుడని ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు. మరోవైపు డైరెక్టర్ కిట్టు ముందస్తు బెయిల్‌కు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో కోర్టు వద్ద పోలీసులు నిఘా పెంచారు. -
పరారీలో సినీ డైరెక్టర్ కిట్టు
బంజారాహిల్స్ : పాత నోట్ల మార్పిడి కేసులో ప్రధాన నిందితుడు, సినీ దర్శకుడు కిట్టు అలియాస్ నల్లూరి రామకృష్ణ కోసం బంజారాహిల్స్ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. మూడు బృందాలు అతని కోసం గాలిస్తున్నాయి. కమలాపురి కాలనీలో సినిమా కార్యాలయం ముసుగులో గత నెల రోజులుగా పాత నోట్ల దందాను కొనసాగిస్తున్న కిట్టు ఆదివారం రాత్రి నోట్ల మార్పిడి చేస్తుండగా పోలీసులు దాడులు నిర్వహించారు. అయితే కిట్టు తప్పించుకోగా అతడి ఆఫీసు సిబ్బందిని, పాత నోట్లు మార్పిడి కోసం వచ్చినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఏడుగురిని సోమవారం అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు కిట్టు కారును సీజ్ చేశారు. సదరు కారుకు ‘ప్రెస్’ స్టిక్కర్ అంటించి ఉండటం పోలీసులను విస్మయానికి గురి చేసింది. ఈ కారులోనే పాత నోట్ల మార్పిడి జరిగినట్లు సమాచారం. ఆదివారం రాత్రి పలువురు వ్యక్తులు సుమారు రూ. 5 కోట్లు పాత నోట్లు మార్చుకునేందుకు మార్చుకునేందుకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే కిట్టు కొత్త నోట్లు వస్తున్నాయంటూ వారిని గంటల తరబడి అక్కడే కూర్చుండబెట్టి ముంబయికి చెందిన బిలాల్ షుక్రు అనే వ్యక్తితో తుపాకీ చూపించి భయబ్రాంతులకు గురి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ‘కేటుగాడు’ సినిమాకు దర్శకత్వం వహించిన కిట్టు మరో సినిమా తీసేందుకే కమీషన్ పద్ధతిలో పాత నోట్ల దందాను కొనసాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రముఖ నిర్మాత తనయుడితో ఇతడికి సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఈ కేసులో సినీ పరిశ్రమకు చెందినవారి పాత్ర ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్ని నోట్లు మార్చారు, కొత్త కరెన్సీ ఎక్కడి నుంచి వస్తున్నదన్నదానిపై కిట్టు కార్యాలయం సిబ్బందిని ఆరా తీస్తున్నారు. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లను తనిఖీ చేస్తున్నారు. సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. అయితే కిట్టు సెల్‌ఫోన్ స్విచాఫ్ చేసి ఉండటంతో అతడి ఇంటి వద్ద పోలీసులను ఏర్పాటు చేశారు. -
నటి రంభకు సమన్లు
హైదరాబాద్: వరకట్న వేధింపుల కేసులో కోర్టుకు హాజరుకాని సినీ నటి రంభకు హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీసులు తక్షణం న్యాయస్థానానికి హాజరు కావాలంటూ సమన్లు జారీ చేశారు. ప్రస్తుతం ఆమె పద్మాలయ స్టూడియోలో జరుగుతున్న ఓ టీవీ చానెల్ డ్యాన్స్షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మంగళవారం రాత్రి 8 గంటలకు షో జరుగుతున్న ప్రాంతంలో ఆమెకు సమన్లు అందజేశారు. సినీ నటి రంభ సోదరుడు శ్రీనివాసరావు వివాహం 1999లో బంజారాహిల్స్ రోడ్ నం.2లో నివసించే పల్లవితో జరిగింది. 2014 నుంచి అత్తింటి వారి వేధింపులు ప్రారంభం కావడంతో.. పల్లవి అదే ఏడాది నాంపల్లిలోని మూడవ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో భర్త, అత్త మామలు, ఆడపడుచుపై పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు ఆదేశం మేరకు 2014 జూలై 21న బంజారాహిల్స్ పోలీసులు రంభతోపాటు భర్త, అత్తమామలపై ఐపీసీ 498(ఏ) కింద కేసు నమోదు చేశారు. అయితే అమెరికాలో ఉంటున్న రంభకు సమన్లు జారీ చేయడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా వీలు కాలేదు. అయితే ఇటీవల ఓ షో నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలుసుకున్న పోలీసులు కోర్టుకు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేశారు. -
ఏపీ మంత్రిని మోసం చేసిన మహిళ అరెస్ట్
హైదరాబాద్: తాను రిటైర్డ్ ఐఏఎస్ కుమార్తెనంటూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మంత్రి ఇంటి నుంచి నగదు తీసుకెళ్లిన మాయ లేడీని గురువారం బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా మంగళగిరి మన్యవారి వీధికి చెందిన పి.విజయలక్ష్మి(66) 2014 డిసెంబర్లో తన పేరు సుజాతారావుగా చెప్పుకొని బంజారాహిల్స్ రోడ్ నెం.12లో అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకష్ణ ఇంటికి వెళ్లింది. తాను రిటైర్డ్ ఐఏఎస్ కేఎల్‌రావు కుమార్తె అని మంత్రి పీఎస్వో వాసుతో చెప్పింది. మంత్రి కోసం వచ్చానని అతన్ని నమ్మించి రూ.7 వేలు తీసుకుని అక్కడ నుంచి జారుకుంది. తర్వాత అనుమానం రావడంతో వాసు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న విజయలక్ష్మి బుధవారం విజయవాడలో చిక్కింది. గురువారం ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వివరించారు. -
బైక్ రేసింగ్‌లపై పోలీసుల స్పెషల్ డ్రైవ్
బైక్ రేసింగ్‌లపై జూబ్లీహిల్స్ పోలీసులు, బంజారాహిల్స్ పోలీసులు ఏకకాలంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి ఒంటిగంట నుంచి ఆదివారం తెల్లవారుజామున 4 గంటల వరకు జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ సామల వెంకట్‌రెడ్డి నేతృత్వంలో రెండు ప్లటూన్ల పోలీసు బలగాలు, 20 మంది పోలీసులు పది పికెట్లు ఏర్పాటు చేసి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుతో పాటు కేబీఆర్ పార్కు వరకు బైక్ రేసింగ్‌లపై దాడులు నిర్వహించారు. జూబ్లీహిల్స్ పోలీసులు అదుపు తప్పిన వేగంతో దూసుకుపోతున్న 35 స్పోర్ట్స్బైక్లను స్వాధీనం చేసుకున్నారు. 50 మంది యువకులపై కేసులు నమోదు చేశారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన యువకులందరికీ ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. వీరంతా పబ్‌లలో, కాఫీ షాప్‌లలో మద్యం సేవించి బయటకు వచ్చి నిర్మానుష్యమైన రోడ్లమీద పందెం కాస్తూ బైక్‌లపై దూసుకుపోతున్నట్లు పోలీసులు తెలిపారు. -
అర్ధరాత్రి బైక్ రేసింగ్‌లు... పోలీసుల దాడులు
హైదరాబాద్ : అర్ధరాత్రి బైక్ రేసింగ్‌లకు పాల్పడుతున్న యువకులకు బంజారాహిల్స్ పోలీసులు చెక్ పెట్టారు. శనివారం అర్ధరాత్రి పలువురు యువకులు జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్ ప్రాంతంలో రేసింగ్‌లు నిర్వహిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు దాడులకు దిగారు. 25 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం 25 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. ఆ తర్వాత వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. సదరు యువకులు తల్లిదండ్రులను స్టేషన్‌కి పిలిపించి... వారి... సమక్షంలో యువకులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. -
‘మీ వాళ్లు రూ.2వేలు లంచం తీసుకున్నారు’
హైదరాబాద్: ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా పోలీసు శాఖ ఇటీవలే కొన్ని కొత్త విధానాలను ప్రవేశపెట్టింది. ప్రతిరోజూ కమిషనరేట్ అధికారులు అన్ని పోలీస్ స్టేషన్లకు ఫోన్లు చేస్తూ ఫిర్యాదుదారులు, బాధితులు, కేసుల్లో ఉన్నవారితో మాట్లాడుతుంటారు. ఆయా పోలీస్స్టేషన్లలో లభించిన సేవలపై ఆరా తీస్తుంటారు. పోలీసుల నుంచి స్పందన ఎలా ఉందని అడుగుతుంటారు. ఈ క్రమంలో బాధితులు రకరకాలుగా స్పందిస్తూ ఉంటారు. అయితే బుధవారం ఉదయం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బైక్ బాధితుడికి 'ఫీడ్ బ్యాక్' సిబ్బంది ఫోన్ చేయగా.. 'దొంగతనం కేసులో రికవరీ అయిన బైక్‌ను ఇవ్వడానికి మీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నా దగ్గర రూ.2 వేలు లంచం తీసుకున్నారు' అని నిజం వెల్లడించి కంగుతినిపించాడు. ఇదీ అసలు కథ.. ఇటీవల మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులకు ఓ దొంగ చిక్కాడు. విచారణలో అతడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ చోరీకి పాల్పడినట్లు తేలింది. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దొరికిన బైక్ ను తిరిగి ఇచ్చేందుకు ఫిర్యాదుదారు దగ్గర నుంచి పోలీసులు రూ.2 వేలు లంచం తీసుకున్నారు. ఈ విషయాన్ని బాధితుడే వెల్లడించాడు. అవినీతి రహిత ఠాణాలను తీర్చిదిద్దాలని యత్నిస్తున్న సమయంలో ఈ రకమైన ఫీడ్‌బ్యాక్ అందటం పై పోలీస్ శాఖలో చర్చనీయాంశమైంది. -
భార్య ప్రియుడి దాడి: భర్త మృతి
హైదరాబాద్: భార్య ప్రియుడు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ భర్త చికిత్సపొందుతూ మృతి చెందాడు. బంజారాహిల్స్ ఎస్ఐ కృష్ణయ్య కథనం ప్రకారం.. జాఫర్ (30) తన భార్యాబిడ్డలతో హకీంపేట కుంట ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరింటికి సమీపంలో ఉండే జగన్(35) జాఫర్ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కాగా ఈనెల 11న జాఫర్.. అతని భార్య మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. 100కు ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చి సమస్యను పరిష్కరించారు. తిరిగి 13వ తేదీ రాత్రి మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. ఆ సమయంలో జాఫర్ మద్యం మత్తులో ఉన్నాడు. జాఫర్ భార్య జగన్‌కు విషయం చెప్పి రావాలని కోరింది. అప్పటికే జగన్ మద్యం తాగి ఉన్న అతను వచ్చాడు. జాఫర్.. జగన్‌ల మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. కోపంతో ఊగిపోయిన జగన్.. జాఫర్‌ను పట్టుకొని పక్కనే ఉన్న బీరువాకు కొట్టాడు. జాఫర్ మెడకు బలమైన దెబ్బ తగలడంతో పాటు నరాలు దెబ్బతిన్నాయి. వెన్నుపూస ప్రాంతంలో తీవ్ర గాయమైంది. 13, 14 తేదీల్లో ఇంట్లోనే ఉన్న జాఫర్ పరిస్థితి విషమించింది. మాట పడిపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే జాఫర్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న జాఫర్ పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి మృతి చెందాడు. దీంతో పోలీసులు ఐపీసీ 304 కింద కేసు నమోదు చేసి జగన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
డ్రగ్స్‌కు బానిసై...
బంజారాహిల్స్ : ట్రయల్ పేరుతో షోరూం నిర్వాహకులను బురిడీ కొట్టించి హార్లీ డేవిడ్సన్ బైక్‌తో ఉడాయించిన తొర్లపాటి కిరణ్ గత కొంత కాలం నుంచి డ్రగ్స్‌కు అలవాటుపడినట్లు అతని తండ్రి ప్రకాశ్ పోలీసుల విచారణలో వెల్లడించారు. హైదరాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయంలో ఎస్ఎస్సీ వరకు చదివిన కిరణ్ ఐఐటీలో జాతీయ స్థాయిలో మూడవ ర్యాంకు సాధించిన ఉత్తమ విద్యార్థిగా గుర్తింపు పొందాడని అలాంటి వాడు ఇటీవల డ్రగ్స్‌కు అలవాటుపడి జీతం సరిపోక అడ్డదారులు తొక్కుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. గత కొంత కాలంగా కిరణ్ ప్రవర్తనలో మార్పులు గమనిస్తున్నామని అయితే దొంగతనం చేసే స్థాయిలో ఉంటుందని తాము ఊహించలేకపోయామని ఆయన కన్నీరుమున్నీరయ్యారు. తమ పరువు ప్రతిష్టలు గంగలో కలిశాయని ముఖం చూపించుకోలేకపోతున్నామని విలపించారు. * 6 లక్షల విలువైన బైక్‌తో ఉడాయించిన కిరణ్‌ను ముంబైలో బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే బైక్‌ను అమ్మే ప్రయత్నం చేస్తుండగానే పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో కిరణ్ పథకం బెడిసికొట్టింది. ఐఐటీ చదివి ముంబైలోని ఓఎన్జీసీలో రూ. 1.50 లక్షల జీతంతో పని చేస్తున్న కిరణ్‌కు ప్రతి నెలా మత్తు పదార్థాలకే రూ. 1.50 లక్ష దాకా ఖర్చవుతున్నాయని పోలీసుల విచారణలో తెలిసింది. ఈ బైక్‌ను అమ్మి ఇందులో పట్టుబడకపోతే వచ్చే నెలలో మరో చోరీకి పథకం వేసినట్లు కూడా పోలీసులు గుర్తిం్చరు. గతంలో కిరణ్ ఇలాంటి దొంగతనాలు చేశాడా అనే విషయం అతను ఇక్కడికి వచ్చాక తెలుస్తుందని పోలీసులు పేర్కొన్నారు. -
న్యాయవాది మోసం చేశాడంటూ కానిస్టేబుల్ ఫిర్యాదు
బంజారాహిల్స్ (హైదరాబాద్): వెంటనే బెయిల్ ఇప్పిస్తానని ఓ న్యాయవాది మోసం చేశాడని ఓ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రెండు నెలల క్రితం అరుదైన రంగురాయి విక్రయం కేసులో నగరానికి చెందిన కానిస్టేబుల్ రాజుతోపాటు మరో నలుగురు కానిస్టేబుళ్లు అరెస్ట్ అయ్యారు. ఓయూ పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు. శ్రీనగర్‌కాలనీ గణపతి కాంప్లెక్స్ పమీపంలో నివసించే ఓ న్యాయవాది వీరికి తెల్లవారే బెయిలు ఇప్పిస్తానని రూ.20 వేలు అడ్వాన్స్‌గా తీసుకొన్నాడు. వారం దాటినా బెయిలు రాకపోవడంతో నిందితులు మరో న్యాయవాది సాయంతో బెయిలు పొందారు. తమను మోసగించిన న్యాయవాదిపై కేసు నమోదు చేయాలని కోరుతూ బుధవారం బంజారాహిల్స్ పోలీసులను ఓ కానిస్టేబుల్ ఆశ్రయించాడు. పోలీసులు ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు చేపట్టారు. -
ఘరానా మోసగాడు అరెస్ట్
బంజారాహిల్స్: తాను ఓ పరిశ్రమను స్థాపిస్తున్నానంటూ బోగస్ కార్యాలయాన్ని తెరిచి పలువురిని పెద్ద మొత్తంలో నిండా ముంచిన రాజస్తాన్‌కు చెందిన వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జైపూర్‌కు చెందిన నాసిర్ రాజ్‌పుత్ మూడు నెలల క్రితం బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని కౌశిక్ సొసైటీలో కార్యాలయాన్ని, ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఈ బోగస్ సంస్థను ప్రారంభించేందుకు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీని ఆహ్వానించడమే కాకుండా కరపత్రాలు కూడా ముద్రించారు. కార్యాలయంలో అద్దెకు ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు సమకూర్చుకున్నాడు. తన సంస్థలో ఉద్యోగాల కోసం 22 మంది నిరుద్యోగుల నుంచి సెక్యూరిటీ డిపాజిట్‌గా లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. మూడు నెలలుగా కార్యాలయం, ఇంటి యజమానులకు అద్దె కూడా చెల్లించలేదు. తనకు రూ. 40 కోట్లు సిటీ బ్యాంకు నుంచి రావాల్సి ఉందని.. బ్యాంకు డిపాజిట్ ఉంటే వెంటనే వస్తుందని చెప్పి.. ఓ ఐసీఐసీఐ బ్యాంకు ఉద్యోగిని నమ్మించి రూ.15 లక్షలు వసూలు చేశాడు. ఇలా రూ.1 కోటి దాకా దండుకొని మూడు రోజుల క్రితం ఉడాయించాడు. దీంతో ప్రత్యేక పోలీసు బృందం బీహార్‌లోని రాంచిలో నిందితుడు రాజ్‌పుత్‌ను వలపన్ని పట్టుకుని నగరానికి తీసుకొచ్చింది. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 406, 420, 471 కింద కేసులు నమోదు చేశారు. -
మంత్రి పోచారం డ్రైవర్‌పై బౌన్సర్ల దాడి
బంజారాహిల్స్: ఫిలింనగర్ రోడ్ నెం. 1లోని ఓ ఇంటి ముందు సహచరుల కోసం ఎదురు చూస్తూ నిలబడ్డ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి డ్రైవర్ నాగరాజుపై నలుగురు బౌన్సర్లు అకారణంగా దాడి చేసి గాయపరిచారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు బౌన్సర్లను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం నాగరాజు తన సహచరుల కోసం ఫిలింనగర్‌లోని ఓ ఇంటి ముందు వేచి చూస్తున్నాడు. అక్కడే ఉన్న బౌన్సర్లు ఇక్కడ ఎందుకు నిలబడ్డావని నాగరాజును ప్రశ్నించారు. నా స్నేహితుల కోసం చూస్తున్నానని రోడ్డు పక్కనే నిలబడ్డాను కదా అని అన్నాడు. దీంతో రెచ్చిపోయిన బౌన్సర్లు దాడికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బౌన్సర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరు ఎవరికి సంబంధించిన వారన్నదానిపై ఆరా తీస్తున్నారు. -
ఇద్దరు ‘చంద్రుల’ దిష్టిబొమ్మలు దహనం
హైదరాబాద్: ఇద్దరు ‘చంద్రుల’దిష్టిబొమ్మల దహనం ఒకేసారి జరగడంతో బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అటు టీఆర్ఎస్, ఇటు టీడీపీ కార్యకర్తలు ఏకకాలంలో పోటా పోటీగా ఈ కార్యక్రమం నిర్వహించడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ముందు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న టీడీపీ తెలుగు మహిళలను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించి గంట తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసిన విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ మహిళా నాయకురాలు పి. విజయారెడ్డి కొద్దిసేపటికే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసేందుకు రంగం సిద్ధం చేశారు. విషయం తెలుసుకుని అప్పుడే స్టేషన్ నుంచి బయటకు వస్తున్న తెలుగు మహిళా నాయకురాలు శోభా హైమావతి తన అనుచరగణంతో కలసి నేరుగా ట్రస్ట్ భవన్ వద్దకు వచ్చారు. అదే సమయంలో టీఆర్ఎస్ మహిళలు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేస్తున్నారు. ఓ వైపు టీడీపీ, ఇంకోవైపు టీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేస్తుండటంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఖబడ్దార్ అంటూ టీడీపీ కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలపై చెప్పులు విసిరారు. కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలకు చెప్పులు తగిలాయి. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినా పరిస్థితి కొద్దిసేపటి దాకా అదుపులోకి రాలేదు. అదే సమయంలో తెలుగు మహిళ లు నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఇంకోవైపు టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పోలీసు వలయాన్ని ఛేదించుకొని ట్రస్ట్‌భవన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా గంట పాటు ఇక్కడ హై డ్రామా చోటు చేసుకుంది. చివరకు పోలీసులు అప్రమత్తమై టీఆర్ఎస్ కార్యకర్తలను అక్కడి నుంచి దూరంగా పంపివేయడంతో గొడవ సద్దుమణిగింది. -
అడిగిన ఫీజు ఇవ్వలేదని... నరాలు తీశాడు
బంజారాహిల్స్(హైదరాబాద్): వ్యాధి చికిత్స కోసం అడిగినంత ఫీజు చెల్లించలేదనే కారణంతో తన వ్యాధి నయం కాకుండా చేశారని ఓ రిటైర్డు పోలీసు అధికారి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ తేజస్వినగర్ కాలనీ నివాసి, చిక్కడపల్లి ట్రాఫిక్ రిటైర్డ్ ఎస్సై వి.రమేష్(58) జనవరి 7వ తేదీన రెండు కాళ్లలో వెరికోస్ వీన్స్(నరాల సంబంధిత వ్యాధి)తో బాధపడుతూ జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. మరుసటి రోజు ఆ ఆస్పత్రి వైద్యుడు చంద్రశేఖర్ ఆయన గదికి వచ్చి ఆ వ్యాధికి ఆర్ఎఫ్ఏ థెరపీ చేయాల్సి ఉంటుందని, రూ.10 వేలు ఫీజు అని చెప్పాడు. అయితే తన వద్ద రూ.5వేలు మాత్రమే ఉన్నాయని చెప్పడంతో పాటు ఆ డబ్బు ఇచ్చారు. అయితే అడిగినంత మొత్తం ఇవ్వనందుకు తన కాళ్లలోని రెండు నరాలను ఉద్దేశపూర్వకంగా తొలగించాడని బాధితుడు ఆరోపించారు. ఇటీవల తన వ్యాధి నయం కాకపోకవటంతో మరో వైద్యుడిని సంప్రదించగా కాలిలో రెండు నరాలు తొలగించినట్లు తెలిసిందని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను మోసం చేయడంతో పాటు నిర్లక్ష్యంతో చికిత్స చేసిన డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు సదరు వైద్యునిపై ఐపీసీ సెక్షన్ 420,336ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
సినీ నటి రంభ నగలు చోరీ!
-
రంభ బంగారు, వజ్రాల నగలను కాజేశారు..
సోదరుడు శ్రీనివాస్ ఫిర్యాదు బంజారాహిల్స్: సినీ నటి రంభ బంగారు, వజ్రాల నగలు ఆమె వదిన, అక్కలు కాజేశారని, ఈ మేరకు తాము చెన్నై విరువుంబాకం పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేశామని రంభ సోదరుడు వై.శ్రీనివాస్ తెలిపారు. శనివారం ఆయన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అతడి భార్య పల్లవి, ఆమె సోదరి శాంతిసింగ్‌చౌహాన్, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ రవికిరణ్ (పల్లవి సోదరుడు), ఆయన భార్య వాణిజ్య పన్నుల శాఖాధికారిణి సంయుక్త తదితరులు కలిసి రంభకు చెందిన నాలుగున్నర కోట్ల విలువైన ఆభరణాలు కాజేయడమే కాకండా గతంలో తనపై, తన కుటుంబ సభ్యులపై అకారణంగా వరకట్న వేధింపుల కేసు పెట్టారని ఆరోపించారు. తన కుమారుడిని ఏడాదిగా చూపించడం లేదని పశ్చిమ మండలం డీసీపీకి ఫిర్యాదు కూడా చేశానని, ఆ కేసు విషయమై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు వెల్లడించారు. మూడేళ్ల నుంచి రంభ కెనడాలో ఉందని ఇటీవల రెండు నెలలు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిందని తెలిపారు. గతంలో తాము ఇక్కడ లేని సమయంలో బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో తమపై కేసు పెట్టారని పల్లవి, శాంతిసింగ్ చౌహాన్, ఆమె సోదరుడు రవికిరణ్, సంయుక్తలపై చెన్నైలో తొలుత తామే ఫిర్యాదు చేశామని, కేసు నమోదైందని తెలిపారు. -
ఈవ్‌టీజర్ పోలీసులకు అప్పగింత
బంజారాహిల్స్: షాపింగ్ మాల్లో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న ఓ యువకుడిని స్థానికులు పట్టుకొని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ఓల్డ్‌సిటీకి చెందిన ఇద్దరు యువతులు సిటీ సెంటర్ మాల్లో షాపింగ్ చేస్తుండగా ఏడుగురు యువకులు వారిని అనుసరిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని బాధిత యువతులు అక్కడ ఉన్న సెక్యూరిటీకి ఫిర్యాదు చేశారు. సెక్యూరిటీ సిబ్బందితో పాటు వ్యాపారులు ఆ యువకులను పట్టుకోవడానికి ప్రయత్నించగా ఆరుగురు పరారీ కాగా.. ఉమర్ అనే యువకుడు దొరికాడు. అతడిని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఉమర్‌పై ఈవ్‌టీజింగ్ కేసు నమోదు చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. -
ఓబులేసును కర్నూలు తీసుకెళ్లిన పోలీసులు
హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామిక వేత్త నిత్యానందరెడ్డిపై కాల్పులు జరిపి పోలీసు కస్టడీలో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ ఓబులేసును బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం కర్నూలు తీసుకెళ్లారు. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ, ఎస్ఐ.సంతోషం నిందితుడు ఓబులేసును కర్నూలుకు తీసుకె ళ్లి ఆరోజు జరిగిన సంఘటనపై ఆరా తీశారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయన్న దానిపై దర్యా ప్తు చేస్తున్నారు. ఓబులేసు ఇంట్లో పలు రకాల ఆయుధాల తూటాలు దొరికిన నేపథ్యంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 17 మందిపై కేసు నమోదు
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లో శనివారం అర్థరాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తాగి వాహనం నడుపుతున్న 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసులు నమోదు చేశారు. వారి వద్ద నుంచి నుంచి 10 కార్లు, 6 బైకులు, ఆటో స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. వీరందరికి కౌన్సిలింగ్ నిర్వహించి.. కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. -
సల్మాన్, సైఫ్‌లపై కేసు
హైదరాబాద్: ఒక మతానికి చెందిన ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా దుస్తులు ధరిం చారని ఫిర్యాదు మేరకు బాలీవుడ్ నటలు సల్మాన్‌ఖాన్, సైఫ్ అలీఖాన్లపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయిం ది. ముంబైలో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో ఈ ఇద్దరు నటులు ఒక మతం మనోభావాలు దెబ్బతీసేలా దుస్తులు ధరించారని, వీరిపై కేసు నమోదు చేయాల్సిందిగా మొఘల్‌పురాకు చెందిన ఫసియుద్దీన్ కోర్టును అభ్యర్ధించాడు. ఈ మేరకు మూడవ అడిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సల్మాన్‌ఖాన్, సైఫ్ అలీఖాన్లపై ఐపీసీ సెక్షన్ 295(ఏ) కింద కేసు నమోదు చేయాల్సిందిగా బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించారు. పోలీసులు ఈ ఇద్దరు నటులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వేరే పెళ్లి చేసుకో... నేను కోరినప్పుడల్లా రా...!
యువతికి ప్రేమికుడి హుకుం బంజారాహిల్స్: ‘‘మీ తల్లిదండ్రులు చూసిన యువకుడిని పెళ్లి చేసుకో.. ఆ తర్వాత నేను రమ్మనప్పుడల్లా నాదగ్గరకు రావాలి. లేకపోతే నాతో కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు బయటపెడతా’’.. అంటూ యువతిని ఓ యువకుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అతడిని బంజారాహిల్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పోలీసులు, బాధితురాలి కథనంప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నెం. 7లో నివసించే యువతి(19) బ్యూటీషియన్. కొంత కాలంగా బంజారాహిల్స్ రోడ్‌నెం.10కి చెందిన డ్రైవర్ బాబా(24)ను ప్రేమిస్తోంది. ఈ క్రమంలో రెండుసార్లు అబార్షన్ కూడా చేయించాడు. తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో తనను పెళ్లి చేసుకోవాలని సదరు యువతి బాబాను కోరింది. ఆమెతో పెళ్లికి నిరాకరించిన బాబా.. ‘మీ తల్లిదండ్రులు చూసిన వరుడిని పెళ్లి చేసుకో.. అయితే, నేను రమ్మనప్పుడల్లా మాత్రం నాదగ్గరకు రావాలి’ అని అన్నాడు. కాదంటే... నాతో ఉన్నప్పుడు నీకు తెలియకుండా తీసిన వీడియోలు, ఫొటోలు బయటపెడతానని బెదిరించాడు. ఆందోళన చెందిన బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితున్ని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బండ్ల గణేష్‌కు నోటీసులు
హైదరాబాద్: చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు బంజారాహిల్స్ పోలీసులు బుధవారం నోటీసు జారీ చేశారు. విచారణకు హాజరు కావాల్సిందిగా అందులో సూచించారు. రెండు రోజుల క్రితం గుంటూరుకు చెందిన విత్తనాల వ్యాపారి ధర్మచరణ్ తులసి బంజారాహిల్స్ పోలీసులకు నిర్మాత బండ్ల గణేష్ రూ.80 లక్షలు చీటింగ్ చేశాడంటూ ఫిర్యాదు చేయడం విదితమే. ఫిర్యాదు అనంతరం కూడా తనను ముంబై మాఫియాతో చంపిస్తానని బెదిరిస్తున్నాడంటూ ధర్మచరణ్ మరోమారు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు గణేష్‌పై చీటింగ్, బెదిరింపు కేసులు నమోదు చేసి, నోటీసు జారీ చేశారు. -
చీటింగ్ కేసులో బండ్ల గణేష్‌కు నోటీసులు
హైదరాబాద్ : చీటింగ్ కేసులో సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు బుధవారం బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సినిమా హక్కుల విషయమై బండ్ల గణేశ్ తనను మోసం చేశారని ఫైనాన్సియర్ ధర్మచరణ్ తులసీ మొన్న హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు గణేశ్‌పై చీటింగ్ కేసు నమోదైంది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆయనను పోలీసులు ఆదేశించారు. స్పందించకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చిరించారు. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన గబ్బర్‌సింగ్ సినిమా ఆంధ్రా ఏరియా హక్కుల కోసం గుంటూరుకు చెందిన ఫైనాన్సియర్ ధర్మచరణ్ తులసీ 2011లో రూ.80 లక్షలను ఆ సినిమా నిర్మాత గణేశ్‌కు చెల్లించాడు. ఈ మేరకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం సినిమా హక్కులు ధర్మచరణ్‌కు కాకుండా మరొకరికి గణేశ్ విక్రయించి వారి వద్ద కూడా డబ్బులు తీసుకున్నాడు. ఒప్పందాన్ని ఉల్లంఘించి సినిమా రైట్స్‌ను మరొకరికి విక్రయించినందున తన డబ్బులు తిరిగివ్వాలని బాధిత ఫైనాన్సియర్ ఎన్నిసార్లు అడిగినా గణేశ్ స్పందించలేదు. పైగా ఫైనాన్సియర్‌ను చంపుతానని బెదిరిస్తున్నాడు. ఈ మేరకు పోలీసులు గణేశ్‌పై ఐపీసీ సెక్షన్ 420, 406, 506 కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న గణేశ్ ఆచూకీ కోసం ప్రత్యేక పోలీస్ బృందం గాలింపు చేపట్టిన విషయం తెలిసిందే. -
సినీ నిర్మాత బండ్ల గణేశ్‌పై చీటింగ్ కేసు
హైదరాబాద్: సినిమా హక్కుల విషయమై సినీ నిర్మాత బండ్ల గణేశ్ తనను మోసం చేశారని ఓ ఫైనాన్సియర్ సోమవారం హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గణేశ్‌పై చీటింగ్ కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ పి.మురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... పవన్ కల్యాణ్ హీరోగా నటించిన గబ్బర్‌సింగ్ సినిమా ఆంధ్రా ఏరియా హక్కుల కోసం గుంటూరుకు చెందిన ఫైనాన్సియర్ ధర్మచరణ్ తులసీ 2011లో రూ.80 లక్షలను ఆ సినిమా నిర్మాత గణేశ్‌కు చెల్లించాడు. ఈ మేరకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం సినిమా హక్కులు ధర్మచరణ్‌కు కాకుండా మరొకరికి గణేశ్ విక్రయించి వారి వద్ద కూడా డబ్బులు తీసుకున్నాడు. ఒప్పందాన్ని ఉల్లంఘించి సినిమా రైట్స్‌ను మరొకరికి విక్రయించినందున తన డబ్బులు తిరిగివ్వాలని బాధిత ఫైనాన్సియర్ ఎన్నిసార్లు అడిగినా గణేశ్ స్పందించలేదు. పైగా ఫైనాన్సియర్‌ను చంపుతానని బెదిరిస్తున్నాడు. ఈ మేరకు పోలీసులు గణేశ్‌పై ఐపీసీ సెక్షన్ 420, 406, 506 కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న గణేశ్ ఆచూకీ కోసం ప్రత్యేక పోలీస్ బృందం గాలింపు చేపట్టింది. -
రేవంత్ రెడ్డిపై కేసు నమోదు
హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. రేవంత్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మెడికల్ కాలేజీ వ్యవహారంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌తోపాటు మరికొంత మందికి ముడుపులు అందాయని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది కె.గోవర్థన్ రెడ్డి నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దాంతో రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని బంజారాహిల్స్ పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశించింది. -
కోర్టు ఆదేశాల మేరకే రంభపై కేసు: డీసీపీ
-
కోర్టు ఆదేశాల మేరకే రంభపై కేసు: డీసీపీ
హైదరాబాద్: అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ నటి రంభ సోదరుడు శ్రీనివాస్ వెంకటేశ్వర్రావు భార్య పల్లవి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని వెస్ట్ జోన్ డీసీసీ సత్యనారాయణ తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు రంభ, తల్లిదండ్రులు, శ్రీనివాసరావులపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. త్వరలోనే వారికి నోటీసులు పంపుతామని వెల్లడించారు. వారి వాంగ్మూలాన్ని తీసుకుంటామని చెప్పారు. కేసుపై అన్నివైపుల విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పల్లవి భర్త శ్రీనివాస్‌తో పాటు రంభ, అత్త ఉషారాణి, మామ వెంకటేశ్వర్రావుపై బంజారాహిల్స్ పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
'పబ్లిసిటీ కోసమే నాపై, రంభపై ఆరోపణలు'
చెన్నై : పబ్లిసిటీ కోసమే తన భార్య పల్లవి ఆరోపణలు చేస్తోందని సినీనటి రంభ సోదరుడు శ్రీనివాస్ వెంకటేశ్వర్రావు అన్నారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ రంభపై ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని అన్నారు. పల్లవి కుటుంబ సభ్యులే వెనకుండి ఆమెను ఆడిస్తున్నారని శ్రీనివాస్ ఆరోపించారు. కాగా కొంతకాలంగా భర్త శ్రీనివాస్‌తో పాటు ఆడపడుచు రంభ, అత్త ఉషారాణి, మామ వెంకటేశ్వర్రావు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ బంజారాహిల్స్ నివాసి పల్లవి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దర్యాప్తు చేసిన పోలీసులు రంభతో పాటు ఆమె భర్త శ్రీనివాస్, అత్తా మామలపై ఐపీసీ సెక్షన్ 498(ఎ) కింద కేసు నమోదు చేశారు. -
సినీనటి రంభపై వరకట్న వేధింపుల కేసు
హైదరాబాద్: సినీనటి రంభపై బంజారాహిల్స్ పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నం. 5లో నివసించే పల్లవి 1999లో చెన్నైలో నివసిస్తున్న నటి రంభ సోదరుడు శ్రీనివాస్ వెంకటేశ్వర్రావును వివాహం చేసుకుంది. ఆ సందర్భంగా తగినన్ని కట్న కానుకలు, లాంఛనాలు పూర్తి చేశారు. కొంతకాలంగా ఆమెను శ్రీనివాస్‌తో పాటు రంభ, అత్త ఉషారాణి, మామ వెంకటేశ్వర్రావు అదనపు కట్నం కోసం వేధించసాగారు. వీరు నిర్మించిన సినిమాలకు నష్టాలు రావడంతో కుటుంబం ఆర్థికంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో డబ్బుల కోసం పల్లవిని వేధించడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో వేధింపులు భరించలేక బాధిత మహిళ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో వీరిపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. దర్యాప్తు చేసిన పోలీసులు రంభతో పాటు ఆమె భర్త శ్రీనివాస్, అత్తా మామలపై ఐపీసీ సెక్షన్ 498(ఎ) కింద కేసు నమోదు చేశారు. -
‘దానం’పై కేసుల్లో చార్జిషీట్లు వేయండి
పోలీసులకు హైకోర్టు ఆదేశం హైదరాబాద్: మాజీ మంత్రి దానం నాగేందర్‌పై నమోదైన కేసుల్లో దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్లు దాఖలు చేయాలని హైకోర్టు మంగళవారం బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించింది. ఇదే సమయంలో దానంపై కేసుల్లో పోలీసులు దర్యాప్తు సక్రమంగా చేయట్లేదంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణను ముగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు ఉత్తర్వులు జారీ చేశారు. దానంపై నమోదైన కేసుల దర్యాప్తులో పురోగతీ లేదని, ఈ కేసులో దర్యాప్తును కోర్టు పర్యవేక్షించాలని న్యాయవాది ఎ.తిరుపతివర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
మైనర్‌ను వేధిస్తున్న యువకుడు అరెస్ట్
తనను ప్రేమించాలంటూ మైనర్ వెంట పడుతున్న ఓ వ్యక్తిని బంజారా హిల్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితుడిపై 354 (ఏ) నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... నగరంలో బంజారా హిల్స్ ప్రాంతంలో మైనర్ సంతోషి తల్లితండ్రులతో కలసి నివసిస్తుంది. అయితే గత కొంత కాలంగా నిరంజన్ (21) అనే వ్యక్తి తనను ప్రేమించాలంటూ సంతోషి వెంటపడుతున్నాడు. దాంతో నిరంజన్ విషయాన్నిఆ బాలిక తల్లిదండ్రులకు వెల్లడించింది. దాంతో వారు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిరంజన్‌పై కేసు నమోదు చేశారు. అతడి కోసం గాలించి నిందితుడిని అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. -
తనిష్క్ చోరీ కేసులో కిరణ్ అనే వ్యక్తి లొంగుబాటు
హైదరాబాద్ : తనిష్క్ జ్యువెలర్స్ దుకాణంలో చోరీ కేసులో కిరణ్ అనే ఓ వ్యక్తి బంజారాహిల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తానే ఈ చోరీకి పాల్పడినట్లు ఆవ్యక్తి చెబుతున్నాడు. కిరణ్‌ను పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇందులో భాగంగా చోరీ జరిగిన రాత్రి విధుల్లో ఉన్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులు, సెక్యూరిటీ సంస్థకు చెందిన మరో వ్యక్తి, జ్యువెలర్స్‌కు చెందిన మరొకరి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మాజీ తాజా ఉద్యోగులకు సంబంధించి సమాచారం సేకరించటంతో పాటు మరికొన్ని అనుమానలను నివృత్తి చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. షోరూమ్‌కు చెందిన కొన్ని రికార్డుల్ని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా తనిష్క్ జ్యువెలర్స్‌లో చోరీకి గురైన మొత్తం రూ.5.97 కోట్ల సొత్తుగా యాజమాన్యం లెక్కలు తేల్చింది. సంస్థ జనరల్ మేనేజర్ మణికందన్ శనివారం ఇచ్చిన ఫిర్యాదులో ప్లెయిన్, గోల్డ్ ఆర్నమెంట్స్ 18 కిలోలు (విలువ సుమారు రూ.11కోట్లు), కలర్ స్టోన్స్, ముత్యాలు పొదిగిన ఆభరణాలు 12 కిలోలు (విలువ సుమారు రూ.12కోట్లు) దొంగతనానికి గరైనట్లు పేర్కొన్నారు. అయితే నిన్న ఉదయానికి పూర్తిస్థాయిలో లెక్కలు చూసిన నిర్వాహకులు రూ.4.6 కోట్ల విలువైన 15.56 కేజీల బంగారు నగలతో పాటు మరో రూ.కోటి విలువైన రాళ్లతో చేసిన 851 ఆభరణాల్ని చోరులు ఎత్తుకుపోయారని తేల్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.