సాక్షి, హైదరాబాద్: టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అనుమానాస్పద మృతి కేసులో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కోడెల ఆత్మహత్యకు గత కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఇప్పటికే పలు కీలక ఆధారాలను సేకరించారు. కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డ వైరును స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం 8:30కి కోడెల ఫోన్ నుండి చివరి కాల్ వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. గత రెండు రోజులుగా కోడెల ఎవరెవరికి ఫోన్ చేశారు, ఎవరి నుంచి ఆయనకు కాల్స్ వచ్చాయనేదానిపై దృష్టి సారించారు. కోడెల నివాసంలో వేలిముద్రలను క్లూస్ టీమ్ సేకరించింది. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత కేసులో పురోగతి వచ్చేఅవకాశముందని పోలీసులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల స్టేట్ మెంట్ లిఖితపూర్వకంగా నమోదు చేశామని, అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
కోడెల పర్సనల్ మొబైల్ మిస్సింగ్
కోడెల శివప్రసాదరావు వ్యక్తిగత మొబైల్ కనిపించకుండా పోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోడెల కూతురు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఆమె ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 174 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కోడెల చివరగా 24 నిమిషాలు ఫోన్ మాట్లాడినట్లు కాల్‌డేటా ఆధారంగా పోలీసులు గుర్తించారు. నిన్న సాయంత్రం 5 గంటలకు కోడెల సెల్‌ఫోన్ స్విచాఫ్ అయినట్లు కనుగొన్నారు. ఫోన్‌ను ఎవరైనా దొంగిలించారా, దాచిపెట్టారా అనేది దర్యాప్తులో తేలనుంది.
కాగా, కోడెల శివప్రసాదరావు భౌతికకాయానికి గుంటూరు జిల్లా నరసరావుపేటలో రేపు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఆదేశించారు. కోడెల శివప్రసాదరావు పార్థీవ దేహాన్ని హైదరాబాద్ నుంచి ఈ మధ్యాహ్నం గుంటూరుకు తీసుకొచ్చారు. మరోవైపు కోడెల కుమారుడు శివరామ్ విదేశాల నుంచి గుంటూరు చేరుకున్నారు.
సంబంధిత వార్తలు...
మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment