తనను ప్రేమించాలంటూ మైనర్ వెంట పడుతున్న ఓ వ్యక్తిని బంజారా హిల్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితుడిపై 354 (ఏ) నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... నగరంలో బంజారా హిల్స్ ప్రాంతంలో మైనర్ సంతోషి తల్లితండ్రులతో కలసి నివసిస్తుంది. అయితే గత కొంత కాలంగా నిరంజన్ (21) అనే వ్యక్తి తనను ప్రేమించాలంటూ సంతోషి వెంటపడుతున్నాడు.
దాంతో నిరంజన్ విషయాన్నిఆ బాలిక తల్లిదండ్రులకు వెల్లడించింది. దాంతో వారు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిరంజన్పై కేసు నమోదు చేశారు. అతడి కోసం గాలించి నిందితుడిని అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్కు తరలించారు.