సమస్యను వివరిస్తున్న నూర్‌నగర్ బస్తీవాసులు
హైదరాబాద్: బంజారాహిహిల్స్ రోడ్ నెం. 14లోని నూర్‌నగర్‌తో పాటు చుట్టూ ఉన్న నందినగర్, వేంకటేశ్వరనగర్, గురుబ్రహ్మనగర్, ఇబ్రహీంనగర్ బస్తీవాసులతో పాటు సమీపంలోని ఇన్‌కంట్యాక్స్ క్వార్టర్స్, ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్స్‌లో భూగర్భజలాలు కలుషితం అవుతున్నాయి. నూర్‌నగర్‌లో ఇష్టానుసారంగా పా ర్కింగ్ స్థలాలు, మెట్ల కింద స్థలాలు కూడా ఇటీవల అద్దెలకిస్తూ దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు.
వీటి కోసం వినియోగిస్తున్న రసాయనాలతో భూగర్భ జలాలను కలుషితం అవుతున్నాయి. బోర్లతో పాటు మంచినీటి పైప్‌లైన్లు కూడా ఈ డయింగ్‌లో వాడుతున్న రసాయనాలతో కలుషితం అవుతూ స్థానికులు అనారోగ్యం బారిన పడుతున్నారు. పెద్ద ఎత్తున ఫిర్యా దులు వస్తుండటంతో స్థానికులు జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసులకు నీళ్లు ఎలా కలుషితం అవుతున్నా యో చూపించారు. ఇక్కడి వ్యాపారాలు రసాయనాలు కలిసిన నీళ్లను బోర్లలో పోసిన దృశ్యాలు చూసిన అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక్కడ నీటి కలుషితంపై స్థానికులంతా కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేశారు. ప్రతిరోజూ కలుషిత నీటిపై స్థానికు లు, వ్యాపారులకు మధ్య, గొడవలు సాధారణం అ య్యాయి. కొంత మంది వ్యాపారులు డయింగ్ తర్వా త వచ్చే నీళ్లను రోడ్లు, డ్రెనేనేజీ పైప్‌లైన్లలో పోస్తున్నారు. ఫలితంగా రసాయన వాయువులు స్థానికులకు మరో సమస్యగా మారాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించాలని బస్తీవాసులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment