సినీనటి రంభపై వరకట్న వేధింపుల కేసు | Dowry harassment case registered against actress Rambha in Hyderabad | Sakshi

సినీనటి రంభపై వరకట్న వేధింపుల కేసు

Published Wed, Jul 23 2014 2:20 AM | Last Updated on Fri, May 25 2018 12:56 PM

సినీనటి రంభపై  వరకట్న వేధింపుల కేసు - Sakshi

సినీనటి రంభపై వరకట్న వేధింపుల కేసు

హైదరాబాద్: సినీనటి రంభపై బంజారాహిల్స్ పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నం. 5లో నివసించే పల్లవి 1999లో చెన్నైలో నివసిస్తున్న నటి రంభ సోదరుడు శ్రీనివాస్ వెంకటేశ్వర్‌రావును వివాహం చేసుకుంది. ఆ సందర్భంగా తగినన్ని కట్న కానుకలు, లాంఛనాలు పూర్తి చేశారు. కొంతకాలంగా ఆమెను శ్రీనివాస్‌తో పాటు రంభ, అత్త ఉషారాణి, మామ వెంకటేశ్వర్రావు అదనపు కట్నం కోసం వేధించసాగారు.

వీరు నిర్మించిన సినిమాలకు నష్టాలు రావడంతో కుటుంబం ఆర్థికంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో డబ్బుల కోసం పల్లవిని వేధించడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో వేధింపులు భరించలేక బాధిత  మహిళ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో వీరిపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. దర్యాప్తు చేసిన పోలీసులు రంభతో పాటు ఆమె భర్త శ్రీనివాస్, అత్తా మామలపై ఐపీసీ సెక్షన్ 498(ఎ) కింద కేసు నమోదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement