వేరే పెళ్లి చేసుకో... నేను కోరినప్పుడల్లా రా...! | else getting married ... I demand come...! | Sakshi
Sakshi News home page

వేరే పెళ్లి చేసుకో... నేను కోరినప్పుడల్లా రా...!

Published Mon, Oct 6 2014 1:27 AM | Last Updated on Wed, Aug 1 2018 2:29 PM

వేరే పెళ్లి చేసుకో... నేను కోరినప్పుడల్లా రా...! - Sakshi

వేరే పెళ్లి చేసుకో... నేను కోరినప్పుడల్లా రా...!

యువతికి ప్రేమికుడి హుకుం
బంజారాహిల్స్: ‘‘మీ తల్లిదండ్రులు చూసిన యువకుడిని పెళ్లి చేసుకో.. ఆ తర్వాత నేను రమ్మనప్పుడల్లా నాదగ్గరకు రావాలి.  లేకపోతే నాతో కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు బయటపెడతా’’.. అంటూ యువతిని ఓ యువకుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అతడిని బంజారాహిల్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పోలీసులు, బాధితురాలి కథనంప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నెం. 7లో నివసించే యువతి(19) బ్యూటీషియన్.

కొంత కాలంగా బంజారాహిల్స్ రోడ్‌నెం.10కి చెందిన డ్రైవర్ బాబా(24)ను ప్రేమిస్తోంది. ఈ క్రమంలో రెండుసార్లు అబార్షన్ కూడా చేయించాడు. తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో తనను పెళ్లి చేసుకోవాలని సదరు యువతి బాబాను కోరింది. ఆమెతో పెళ్లికి నిరాకరించిన బాబా.. ‘మీ తల్లిదండ్రులు చూసిన వరుడిని పెళ్లి చేసుకో.. అయితే, నేను రమ్మనప్పుడల్లా మాత్రం నాదగ్గరకు రావాలి’ అని అన్నాడు.   కాదంటే... నాతో ఉన్నప్పుడు నీకు తెలియకుండా తీసిన వీడియోలు, ఫొటోలు బయటపెడతానని బెదిరించాడు. ఆందోళన చెందిన బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితున్ని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement