Black-mail
-
వేరే పెళ్లి చేసుకో... నేను కోరినప్పుడల్లా రా...!
యువతికి ప్రేమికుడి హుకుం బంజారాహిల్స్: ‘‘మీ తల్లిదండ్రులు చూసిన యువకుడిని పెళ్లి చేసుకో.. ఆ తర్వాత నేను రమ్మనప్పుడల్లా నాదగ్గరకు రావాలి. లేకపోతే నాతో కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు బయటపెడతా’’.. అంటూ యువతిని ఓ యువకుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అతడిని బంజారాహిల్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పోలీసులు, బాధితురాలి కథనంప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నెం. 7లో నివసించే యువతి(19) బ్యూటీషియన్. కొంత కాలంగా బంజారాహిల్స్ రోడ్‌నెం.10కి చెందిన డ్రైవర్ బాబా(24)ను ప్రేమిస్తోంది. ఈ క్రమంలో రెండుసార్లు అబార్షన్ కూడా చేయించాడు. తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో తనను పెళ్లి చేసుకోవాలని సదరు యువతి బాబాను కోరింది. ఆమెతో పెళ్లికి నిరాకరించిన బాబా.. ‘మీ తల్లిదండ్రులు చూసిన వరుడిని పెళ్లి చేసుకో.. అయితే, నేను రమ్మనప్పుడల్లా మాత్రం నాదగ్గరకు రావాలి’ అని అన్నాడు. కాదంటే... నాతో ఉన్నప్పుడు నీకు తెలియకుండా తీసిన వీడియోలు, ఫొటోలు బయటపెడతానని బెదిరించాడు. ఆందోళన చెందిన బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితున్ని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సెల్ పోయిందా? మీ పని గోవిందా!
అన్నానగర్: స్మార్ట్ ఫోన్ల వెల్లువలో యువత ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలు ముందూవెనుకా చూడకుండా కొట్టుకొనిపోతున్నారు. అదేదో సినిమాలో హీరో మహేష్ బాబు చెప్పినట్లుగానే ఈ శతాబ్దపు అతి చెత్త ఆవిష్కరణల్లో సెల్‌ఫోన్ వినియోగం ఒకటిగా మారుతోంది. సోషల్ నెట్ వర్కింగ్ పిచ్చిలోపడి అమ్మాయిలు తాము దిగిన అన్ని ఫోటోలను, ముఖ్యమైన కుటుంబ సభ్యుల ఈ-మెయిల్ ఐడీలను, వ్యక్తిగత సమాచారాన్నిస్మార్ట్ ఫోన్ల ద్వారా సోషల్ మీడియాల్లో పోస్టు చేయడం అంత క్షేమకరం కాదని నగర సైబర్ క్రైం విభాగం హెచ్చరిస్తోంది. మీ టైం బాగాలేక మీ సెల్‌ఫోన్ పోయిందంటే ఇక మీ వ్యక్తిగత జీవితం అంతా గోవిందే అంటున్నారు సైబర్ క్రైం నిపుణులు. మీరు పోగొట్టుకున్న ఫోన్ ఏ అపరిచితునికైనా దొరికిందంటే.. ఆ చిన్న సాధనంతో సదరు వ్యక్తి మీ జీవితంలోనేకాక కుటుంబ సభ్యుల జీవితాల్లో సైతం కలకలం సృష్టించే ప్రమాదం ఉంది. మీ ఫోన్లో ఉన్న డేటా, ఫోటోలు ఆధారంగా సదరు వ్యక్తులు మిమ్మల్నిగానీ, మీ కుటుంబ సభ్యులను కానీ బ్లాక్మెయిల్ చేయడం, మీ కుటంబ ప్రతిష్టను దిగజార్చేలా మీ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం, డబ్బు కోసం మిమ్మల్ని పదే పదే పీడించడం జరగవచ్చు. ఇక మీ నాన్న సెల్ నంబరు వద్ద డాడీ అని, మామయ్యల నంబర్ల వద్ద అంకుల్ అని గానీ పేరును ఫీడ్ చెయ్యకండి. కేవలం వారి వారి పేర్లతో మాత్రమే నంబర్లను నమోదు చేయండి. స్మార్ట్ ఫోన్లలో మీ వ్యక్తిగత వివరాలు, ఫొటోలూ ఉంచడం ద్వారా మీ జీవితాన్ని మీరే బజారులో పెట్టుకున్నట్లని గుర్తించండి. టీనేజ్ యువతుల చేతుల్లోని స్మార్ట్‌ఫోన్ ఆటంబాంబు సృష్టించేటంత విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఈ విషయాన్ని మీ ఇంట్లోని టీనేజ్ అమ్మాయికు వివరంగా అర్థమయ్యేలా విడమర్చి చెప్పండి. పోయిన ఫోన్ల లాక్‌ను సులువుగా ఛేదించే అక్రమహ్యకర్లు నగరంలో ఎక్కువయ్యారని సైబర్ క్రైం విభాగం హెచ్చరించింది. కనుక వీలైనంత వరకూ సెల్ఫోన్లను మర్చిపోకుండా మీ బ్యాగుల్లో ఉంచండి. చేతిలో పట్టుకుని తిరిగితే, దాన్ని ఎక్కడైనా పెట్టి మర్చిపోయే ప్రమాదముంది. గడచిన రెండేళ్ల వ్యవధిలో సోషల్ నెట్వర్కుల్లో ఉంచిన 40 వేల మంది టీనేజ్ యువతల ఫోటోలను అగంతకులు వారు మానసికంగా మరణించే విధంగా మార్ఫింగ్ చేస్తారని అధికారులు హెచ్చరిస్తున్నారు. -
వైద్యుడితో స్వలింగ సంపర్కం
మొబైల్లో చిత్రీకరించి నిందితులు బ్లాక్ మెయిల్ బెంగళూరు : స్వలింగ సంపర్కంతో పరిచయం పెంచుకుని వైద్యుడిని బ్లాక్మెయిల్ చేసిన ఏడుగురు యువకులను బెంగళూరు సీసీబీ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారు తెలిపిన వివరాల మేరకు.. ఓ వైద్యుడు, తన భార్యాపిల్లలతో కలిసి తిలక్‌నగర్‌లో నివాసముంటున్నాడు. టాటా స్కై డిష్ యాంటెనాలు ఏర్పాటు చేసే ఆవులహళ్లి నివాసి సుహాన్(20) ఓ సారి ఆ డాక్టర్ ఇంటికి వెళ్లాడు. సిగరెట్లు మానడానికి తగిన మందులు ఇస్తానని నమ్మించిన ఆ వైద్యుడు సుహాన్‌ను నగ్నంగా మార్చి స్వలింగ సంపర్కానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికీ చెప్పరాదంటూ ఆ వైద్యుడు సుహాన్‌కు వేలాది రూపాయలు ఇచ్చి పంపాడు. అయితే విషయాన్ని తన స్నేహితులు మధు, వికాస్, దివాకర్‌కు సుహాన్ చెప్పాడు. రెండు నెలల క్రితం వీరంతా డాక్టర్ ఇంటికి వెళ్లి అతని కోర్కె తీర్చి డబ్బు తీసుకొచ్చారు. అలా నిరంతరం వారు డాక్టర్ ఇంటికి వారు వెళ్లేవారు. ఒకసారి సుహాన్, వికాస్ ఆ వైద్యుడితో స్వలింగ సంపర్కానికి పాల్పడ్డారు. దాన్ని వైద్యుడికి తెలీకుండా మొబైల్లో చిత్రీకరించారు. అనంతరం వైద్యుడ్ని కలిసి ఆ క్లిప్పింగులు చూపారు. తమకు రూ. ఐదు లక్షలు ఇవ్వాలని, లేకుంటే క్లిప్పింగులను విడుదల చేస్తామని బెదిరించారు. దీంతో భయపడ్డ ఆ వైద్యుడు వారికి రూ. 5 లక్షలు ఇచ్చాడు. నెల క్రితం తమ స్నేహితులైన నితీష్, మహేష్, విశ్వలను ఆ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. వారంత సీసీబీ పోలీసులు, మీడియా ప్రతినిధులు అంటూ భయపెట్టి రూ. 11 లక్షలు వసూలు చేసుకున్నారు. ఎలాంటి సంపాదన లేని తన కుమారుడు విలాసవంతంగా తిరుగాడుతుండడంతో అనుమానం వచ్చిన ఓ నిందితుడి తండ్రి తనకు తెలిసిన సీసీబీ కానిస్టేబుల్‌కు విషయాన్ని చెప్పాడు. దీంతో పోలీసులు నిఘా వేశారు. అసలు విషయం బయటపడడంతో నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. ఆరు లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో నలుగురు ఎంబీఎ, బికాం విద్యాభ్యాసం చేస్తున్నారు. వీరిపై తిలక్ నగర పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్యుడిపై చర్యలు తీసుకునే విషయమై న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్లు నేర విభాగం డీసీపీ అభిషేక్ గోయల్ తెలిపారు.