హైదరాబాద్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వియ్యంకుడు మజారుద్దీన్ అలీఖాన్(60) ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సోమవారం మధ్యాహ్నం బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఎమ్మెల్యే కాలనీలో తన నివాసంలో రివాల్వర్‌తో కాల్చుకొని ఆయన మృతి చెందిన సంగతి తెలిసిందే.
ఆత్మహత్యకు గల కారణాలపై కుటుంబ సభ్యులతో పాటు ఆ ఇంట్లో పని చేస్తున్న సిబ్బందిని విచారిస్తున్నారు. మజారుద్దీన్‌కు రెండు లైసెన్స్‌డ్ తుపాకులు ఉండగా వీటిని గత డిసెంబర్‌లో బంజారాహిల్స్‌లోని గన్ అఫైర్స్‌లో డిపాజిట్ చేశారు. అయితే ఇందులో ఒక పిస్టల్‌ను తిరిగి వారం క్రితమే రిలీజ్ చేసుకొని ఇంటికి తెచ్చుకున్నట్లుగా తెలుస్తోంది.
భార్యతో ఇంటి వివాదం..: ప్రస్తుతం ఉన్న ఇల్లు ఆయన భార్య అఫియా రషీద్ అలీఖాన్ పేరు మీద ఉండగా ఈ ఇంట్లో తాను మాత్రమే ఉంటానని భర్తతో పాటు కొడుకు, కోడలును బయటికి పంపించాలంటూ ఆమె సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. నెలన్నర క్రితం తీర్పు కాపీతో బంజారాహిల్స్ పోలీసుల బందోబస్తు మధ్య ఆమె ఇంట్లోకి వెళ్ళారు. కానీ ఇంట్లో ఉన్న వాళ్లెవరూ బయటకు వెళ్లలేదు. ఇక ఇంట్లోకి వెళ్ళిన ఒకటి, రెండు రోజులకే గొడవలు తీవ్రమై ఆమె కత్తితో చెయ్యి కూడా కోసుకున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ ఇంటి వివాదంతో పాటు భార్యా భర్తల మధ్య తరచూ మనస్ఫర్థలు వచ్చేవని, కుమారుడు పూర్తిగా తండ్రికి మద్దతుగా ఉండే వాడని చెబుతున్నారు.
ఒక రౌండ్ కాల్పులు...
మజారుద్దీన్ తన పిస్టల్‌తో ఒక రౌండ్ కాల్పులు జరుపుకున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. బుల్లెట్ కుడివైపు కణతి నుంచి ఎడమ వైపు మీదుగా బయటపడి ఆ గదిలోనే క్లూస్ టీమ్‌కు లభించింది. పోలీసుల దర్యాప్తునకు కుటుంబ సభ్యులు అంతగా సహకరించడం లేదని తెలుస్తోంది. మృతుడి సోదరుడు జహీరుద్దీన్ అలీఖాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment