Ali Khan
-
ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇరువురి చేత మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ హాజరయ్యారు.పెద్దల సభకు ఉద్యమ సారథికోదండరాం సార్‌గా సుపరిచితుడైన ముద్దసాని కోదండరాం స్వగ్రామం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నెన్నెల మండలం జోగాపూర్. 1955 సెప్టెంబర్ 5న ముద్దసాని వెంకటమ్మ, ఎం.జనార్దన్ రెడ్డి దంపతులకు జన్మించారు. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో డిగ్రీ , ఓయూలో పీజీ (పొలిటికల్ సైన్స్), జేఎన్‌యూలో ఎంఫిల్ పూర్తి చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ కోసం చేరగా.. 1981లో ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఉద్యోగం రావడంతో పీహెచ్డీ మధ్యలో ఆపేశారు. ఆదివాసీల సమస్యలపై దివంగత హక్కుల నేత బాలగోపాల్, ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్‌రావుతో కలిసి పని చేశారు.ఓయూలో ప్రొఫెసర్‌గా సుదీర్ఘ కాలం పనిచేసిన కోదండరాం..దివంగత ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సహా అనేక మంది ప్రముఖ తెలంగాణవాదులతోనూ కలిసి పనిచేశారు. ఉద్యమ సమయంలో రాజకీయ జేఏసీ చైర్మన్‌గా అన్ని పార్టీలను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏకం చేయడంలో క్రియాశీలంగా పని చేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటి బీఆర్ఎస్ విధానాలతో విభేదించారు. ప్రజాస్వామిక తెలంగాణ పేరిట 2018 మార్చి 31వ తేదీన తెలంగాణ జన సమితిని ఏర్పాటు చేశారు. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీజేఎస్ కాంగ్రెస్‌తో కలిసి పని చేసింది. అదే క్రమంలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌తో జత కట్టారు. దీనితో పాటు ఉద్యమ నేపథ్యం, ప్రొఫెసర్‌గా ఆయన అందించిన సేవలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. జర్నలిజంలో విశేష కృషి జర్నలిజంలో విశేష సేవలందించిన ఆమేర్ అలీఖాన్ (సియాసత్ ఉర్దూ దినపత్రిక రెసిడెంట్ ఎడిటర్ జాహెద్ అలీఖాన్ కుమారుడు) ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీసీఏ, తరువాత సుల్తాన్–ఉల్–ఉలూమ్ కాలేజీ ఆఫ్ బిజినెస్ అడ్మిని్రస్టేషన్ నుంచి ఎంబీఏ చేశారు. ప్రస్తుతం సియాసత్‌లో న్యూస్ ఎడిటర్‌గా ఉన్న ఆయన..ప్రతిక కర్ణాటక రాష్ట్రానికి విస్తరించేందుకు విశేష కృషి చేశారు. పలు అంతర్జాతీయ ఈవెంట్లను కవర్ చేయడానికి ప్రధానమంత్రి, రాష్ట్రపతిల వెంట విదేశీ పర్యటనలకు వెళ్లారు.మైనారిటీల్లో విద్య, నైపుణ్యాన్ని వృద్ధి చేయడానికి, నిరుద్యోగుల కోసం కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచితంగా శిక్షణ ఇప్పించేవారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సియాసత్ ప్రస్తుతం ఖతర్ దేశానికి కూడా విస్తరించింది. 1973 అక్టోబర్ 18న హైదరాబాద్‌లో జన్మించిన అమేర్ అలీ ఖాన్‌కు ఉర్దూతో పాటు ఇంగ్లి‹Ù, హిందీ, అరబిక్, తెలుగు భాషలు తెలుసు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. -
నిమ్స్‌ను సందర్శించిన నిజాం మనవడు
సాక్షి, సిటీబ్యూరో: నిజాం మనవడు నవాబ్ నజీఫ్ అలీ ఖాన్ శుక్రవారం నిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. పిల్లల గుండె శస్త్ర చికిత్సల శిబిరాన్ని విజయవంతం చేసినందుకు నిమ్స్ డైరెక్టర్ బీరప్పను అభినందించారు. యూకే నుంచి వచ్చిన కార్డియోథెరపిక్ వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. పేద రోగులు, సమాజానికి ప్రయో జనం చేకూరేలా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ విభాగం ఇంచార్జ్, ఆర్ఎంఓ డాక్టర్ సల్మాన్ పాల్గొన్నారు. -
గద్దర్ అంతిమ యాత్ర విషాదం.. అశ్రునయనాల మధ్య అలీఖాన్ అంత్యక్రియలు
నాంపల్లి (హైదరాబాద్): సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ అంత్యక్రియలు దారుస్సలాం రోడ్డులోని ఆఖరిత్ మంజిల్‌లో జనసందోహం నడుమ జరిగాయి. సోమవారం గద్దర్ అంతిమ యాత్రలో జరిగిన తొక్కిసలాటలో అస్వస్థతకు గురై, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆయన తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన పార్థివదేహాన్ని సోమవారం రాత్రి ఆసుపత్రి నుంచి లక్డీకాపూల్‌లోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు. మంగళవారం ఉదయం 5.30 గంటలకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని మసీదుకు తరలించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పార్థివదేహాన్ని అభిమానులు, బంధువుల సందర్శనార్థం అక్కడే కాసేపు ఉంచారు. అనంతరం దారుస్సలాంలోని ఆఖరిత్ మంజిల్ శ్మశాన వాటికకు తీసుకెళ్లి అశ్రునయనాల నడుమ అంత్యక్రియలు పూర్తి చేశారు. అంతిమ యాత్రకు భారీ స్థాయిలో ఆయన అభిమానులు, జర్నలిస్టులు, రాజకీయ నేతలు, పౌర, విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు, మేధావులు, కవులు, కళాకారులు హాజరయ్యారు. జహీరుద్దీన్ అలీఖాన్ కడచూపు కోసం తరలివచ్చిన వందలాది మందితో దారుస్సలాం రోడ్డు పూర్తిగా కిక్కిరిసిపోయింది. ప్రముఖుల పరామర్శ... లక్డీకాపూల్‌లోని జహీరుద్దీన్ అలీఖాన్ నివాసానికి చేరుకున్న పలువురు ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. పరామర్శించిన వారిలో రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కి, ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, ఎమ్మెల్యే సీతక్క, డీజీపీ అంజనీకుమార్, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ప్రముఖ విద్యావేత్త వేదకుమార్, సీనియర్ జర్నలిస్టులు పల్లె రవికుమార్, విరాహత్ అలీ, షబ్నమ్ హాస్మి, అయూబ్ ఖాన్, మాజీ ఎమ్మెల్సీ అమీన్వుల్లా హసన్ జాఫ్రి ఉన్నారు. అలీఖాన్ కుటుంబ సభ్యులకు డీజీపీ పరామర్శ సాక్షి, హైదరాబాద్: అస్వస్థతకు గురై సోమవారం సా యంత్రం మృతిచెందిన ఉర్దూ దినపత్రిక సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ కుటుంబ సభ్యులను డీజీపీ అంజనీ కుమార్ పరామర్శించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఉదయం లక్డీకాపూల్‌లోని అలీ ఖాన్ నివాసానికి వెళ్లారు. అక్కడ జహీరుద్దీన్ అలీఖాన్ కుటుంబ సభ్యులను డీజీపీ పరామర్శించి ఓదార్చారు. -
వన్డే క్రికెట్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు
ICC Qualifier Play Off USA VS Jersey: వన్డే క్రికెట్లో ఏడో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదయ్యాయి. ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2023 క్వాలిఫయర్ ప్లే ఆఫ్స్‌లో భాగంగా జెర్సీతో జరిగిన మ్యాచ్‌లో యూఎస్ఏ బౌలర్ అలీ ఖాన్ 9.4 ఓవర్లలో 32 పరుగులిచ్చి ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇవి ఏడో అత్యుత్తమ గణాంకాలుగా రికార్డయ్యాయి. Fresh from collecting the seventh best ODI figures of all time, this dynamic fast bowler now looms as the key player for USA as they try and book a place at this year's @cricketworldcup 💪https://t.co/pK9kLjJ5L4 — ICC (@ICC) April 5, 2023 ఈ జాబితాలో శ్రీలంక పేస్ దిగ్గజం చమింద వాస్ (8/19) అగ్రస్థానంలో ఉండగా.. షాహిద్ అఫ్రిది (7/12), గ్లెన్ మెక్‌గ్రాత్ (7/15), రషీద్ ఖాన్ (7/18), ఆండీ బిచెల్ (7/20), ముత్తయ్య మురళీథరన్ (7/30) వరుసగా 2 నుంచి 6 స్థానాల్లో ఉన్నారు. వీరి తర్వాత అలీ ఖాన్ (7/32) ఏడో స్థానాన్ని ఆక్రమించాడు. దిగ్గజ బౌలర్ల సరసన చేరే క్రమంలో అలీ ఖాన్.. టిమ్ సౌథీ (7/33), ట్రెంట్ బౌల్డ్ (7/34), వకార్ యూనిస్ (7/36) లాంటి స్టార్ పేసర్లను అధిగమించాడు. కుడి చేతి వాటం మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన 32 ఏళ్ల అలీ ఖాన్.. పాక్‌లో పుట్టి, యూఎస్ఏ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. ఇక జెర్సీతో జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. 2023 వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్‌ల్లో అత్యంత కీలమైన ఈ మ్యాచ్‌లో అలీ ఖాన్ విజృంభించడంతో యూఎస్ఏ 25 పరుగుల తేడాతో విజయం సాధించి, వరల్డ్‌కప్ క్వాలిఫయర్ రేస్‌లో ముందంజలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ.. నిర్ణీత ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ టేలర్ (79) అర్ధసెంచరీతో రాణించగా.. గజానంద్ సింగ్ (41) ఓ మోస్తరుగా రాణించాడు. జెర్సీ బౌలర్లలో బెంజమిన్ వార్డ్ 4, ఎలియట్ మైల్స్, జూలియస్ సుమేరౌర్ తలో 2, చార్లెస్ పెర్చార్డ్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం బరిలోకి దిగిన యూఎస్ఏ.. అలీ ఖాన్ (7/32) వీరలెవెల్లో విజృంభించడంతో జెర్సీ 47.4 ఓవర్లలో 206 పరుగులకే చాపచుట్టేసి ఓటమిపాలైంది. అలీ ఖాన్‌తో పాటు జస్దీప్ సింగ్ (1/43), నిసర్గ్ పటేల్ (2/42) బంతితో రాణించగా.. జెర్సీ ఇన్నింగ్స్‌లో అసా ట్రైబ్ (75) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ గెలుపుతో యూఎస్ఏ వరల్డ్‌కప్ క్వాలిఫయర్ రేసులో అగ్రస్థానంలో నిలువగా.. రెండు, మూడు స్థానాల్లో ఉన్న నమీబియా, యూఏఈ జట్లు కూడా వరల్డ్‌కప్ క్వాలిఫయర్‌కు దాదాపుగా అర్హత సాధించాయి. కెనడా, జెర్సీ, పపువా న్యూ గినియా జట్లు వరల్డ్‌కప్ క్వాలిఫయర్ రేసు నుంచి టెక్నికల్‌గా నిష్క్రమించాయి. ఈ పోటీల్లో ఇవాళ (ఏప్రిల్ 5) మరో రెండు మ్యాచ్‌లు జరుగుతున్నప్పటికీ, క్వాలిఫయర్ బెర్తులు ఖరారు కావడంతో అవి నామమాత్రంగానే జరుగనున్నాయి. -
కుటుంబంలో స్పర్ధలతోనే అలీఖాన్ ఆత్మహత్య?
హైదరాబాద్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వియ్యంకుడు మజారుద్దీన్ అలీఖాన్(60) ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సోమవారం మధ్యాహ్నం బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఎమ్మెల్యే కాలనీలో తన నివాసంలో రివాల్వర్‌తో కాల్చుకొని ఆయన మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆత్మహత్యకు గల కారణాలపై కుటుంబ సభ్యులతో పాటు ఆ ఇంట్లో పని చేస్తున్న సిబ్బందిని విచారిస్తున్నారు. మజారుద్దీన్కు రెండు లైసెన్స్డ్ తుపాకులు ఉండగా వీటిని గత డిసెంబర్లో బంజారాహిల్స్‌లోని గన్ అఫైర్స్‌లో డిపాజిట్ చేశారు. అయితే ఇందులో ఒక పిస్టల్‌ను తిరిగి వారం క్రితమే రిలీజ్ చేసుకొని ఇంటికి తెచ్చుకున్నట్లుగా తెలుస్తోంది. భార్యతో ఇంటి వివాదం..: ప్రస్తుతం ఉన్న ఇల్లు ఆయన భార్య అఫియా రషీద్ అలీఖాన్ పేరు మీద ఉండగా ఈ ఇంట్లో తాను మాత్రమే ఉంటానని భర్తతో పాటు కొడుకు, కోడలును బయటికి పంపించాలంటూ ఆమె సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. నెలన్నర క్రితం తీర్పు కాపీతో బంజారాహిల్స్ పోలీసుల బందోబస్తు మధ్య ఆమె ఇంట్లోకి వెళ్ళారు. కానీ ఇంట్లో ఉన్న వాళ్లెవరూ బయటకు వెళ్లలేదు. ఇక ఇంట్లోకి వెళ్ళిన ఒకటి, రెండు రోజులకే గొడవలు తీవ్రమై ఆమె కత్తితో చెయ్యి కూడా కోసుకున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ ఇంటి వివాదంతో పాటు భార్యా భర్తల మధ్య తరచూ మనస్ఫర్థలు వచ్చేవని, కుమారుడు పూర్తిగా తండ్రికి మద్దతుగా ఉండే వాడని చెబుతున్నారు. ఒక రౌండ్ కాల్పులు... మజారుద్దీన్ తన పిస్టల్‌తో ఒక రౌండ్ కాల్పులు జరుపుకున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. బుల్లెట్ కుడివైపు కణతి నుంచి ఎడమ వైపు మీదుగా బయటపడి ఆ గదిలోనే క్లూస్ టీమ్‌కు లభించింది. పోలీసుల దర్యాప్తునకు కుటుంబ సభ్యులు అంతగా సహకరించడం లేదని తెలుస్తోంది. మృతుడి సోదరుడు జహీరుద్దీన్ అలీఖాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు. -
ఆ యువకుడిగా జాబ్ వచ్చింది!
అహ్మదాబాద్: ముస్లిం అన్న కారణంగా ముంబైలోని ప్రైవేట్ కంపెనీ ఒకటి ఎంబీఏ చదివిన ఓ వ్యక్తికి ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించిన ఉదంతానికి ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడింది. తాజాగా ఆ యువకుడ్ని అహ్మదాబాద్ కు చెందిన అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. ఇటీవల జేషన్ అలీఖాన్ అనే యువకుడికి ముంబైలోని హరే కృష్ణ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. అనంతరం జేషన్ కు పెద్ద సంఖ్యలో ఆఫర్లు వచ్చాయి. తన మెయిల్ బాక్స్ పలు ఆఫర్లతో నిండిపోయిందని జేషన్ తెలిపాడు. దీనిపై పలు ఇంటర్యూలకు హాజరైన తాను ఆదానీ కంపెనీకు ఎంపికైనట్లు తెలిపాడు. ఇదిలాఉండగా తాము టాలెంట్ కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తామని.. తెగలు, కులాలు, మతాలకు కాదని అదానీ అధికార ప్రతినిది ఒకరు తెలిపారు. హేరే కృష్ణ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగం కోసం ఈనెల 19న జేషన్ అలీఖాన్(ఎంబీఏ గ్రాడ్యుయేట్) దరఖాస్తు చేసుకున్నారు. ఆ కంపెనీ వెబ్సైట్ నుంచి 15 నిమిషాలకే వచ్చిన సమాధానం చూసి ఖాన్ షాక్ తిన్నారు. ‘మేం ముస్లిమేతరులనే ఉద్యోగాల్లోకి తీసుకుంటాం. ముస్లింలను తీసుకోం. దరఖాస్తు చేసుకున్నందుకు థ్యాంక్స్’ అని కంపెనీ నుంచి సమాధానం వచ్చింది. దీన్ని ఖాన్ ఫేస్బుక్లో షేర్ చేయడంతో తీవ్ర చర్చ జరిగింది. దీనిపై జాతీయ మైనారిటీ కమిషన్‌తోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. మతపర వివక్షను సహించేది లేదని కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పష్టం చేశారు.అనంతరం ఆ కంపెనీ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ఖాన్‌కు మరో మెయిల్ పంపింది.మానవ వనరుల విభాగం(హెచ్ఆర్)లో ట్రెయినీ చేసిన తప్పిదం వల్ల ఇది జరిగిందంటూ సంజాయిషీ ఇచ్చుకుంది. -
ముస్లిం అనే కారణంతో జాబ్ నిరాకరించిన కంపెనీ
ముంబై: ముస్లిం అన్న కారణంగా ముంబైలోని ప్రైవేట్ కంపెనీ ఒకటి ఎంబీఏ చదివిన ఓ వ్యక్తికి ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించింది. దీనిపై జాతీయ మైనారిటీ కమిషన్‌తోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. మతపర వివక్షను సహించేది లేదని కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పష్టం చేశారు. ముంబైలోని హరే కృష్ణ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగం కోసం ఈనెల 19న జేషన్ అలీఖాన్(ఎంబీఏ గ్రాడ్యుయేట్) దరఖాస్తు చేసుకున్నారు. ఆ కంపెనీ వెబ్సైట్ నుంచి 15 నిమిషాలకే వచ్చిన సమాధానం చూసి ఖాన్ షాక్ తిన్నారు. ‘మేం ముస్లిమేతరులనే ఉద్యోగాల్లోకి తీసుకుంటాం. ముస్లింలను తీసుకోం. దరఖాస్తు చేసుకున్నందుకు థ్యాంక్స్’ అని కంపెనీ నుంచి సమాధానం వచ్చింది. దీన్ని ఖాన్ ఫేస్బుక్లో షేర్ చేయడంతో తీవ్ర చర్చ జరిగింది. ఓవైపు ‘మేకిన్ ఇండియా’ పేరుతో ప్రధాని విదేశాలన్నీ చుట్టివస్తుంటే.. ఇక్కడ మాత్రం కొన్ని కంపెనీలు మతం పేరుతో దరఖాస్తులను తిరస్కరిస్తున్నాయంటూ ఖాన్ మండిపడ్డారు. విమర్శలు రావడంతో కంపెనీ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ఖాన్‌కు మరో మెయిల్ పంపింది. ‘మానవ వనరుల విభాగం(హెచ్ఆర్)లో ట్రెయినీ చేసిన తప్పిదం వల్ల ఇది జరిగింది. నిర్ణయాధికారం లేకున్నా ఆ ట్రెయినీ ఈ మెయిల్ పంపారు. ఇక్కడి మా కంపెనీలో మొత్తం 61 మంది ఉద్యోగులున్నారు. వారిలో హెచ్ఆర్లో ఒకరు ముస్లిం కూడా ఉన్నారు’’ అని వివరించింది. ఈ ఉదంతంపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ దర్యాప్తునకు ఆదేశించారు. కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కొత్త సంవత్సరంలో బలమైన నిర్ణయం
‘‘ఈ ఏడాది నూతన దర్శకులతో సినిమాలు చేయాలనుకుంటున్నా. అలాగే ‘చమేలీ’, ‘దేవ్’లాంటి ప్రయోగాత్మక చిత్రాల్లో నటించాలనుకుంటున్నా. నాకు జోయా అక్తర్ సినిమాలంటే ఇష్టం. ఆమె దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని ఉంది. ఈ మధ్యకాలంలో హిందీలో విడుదలైన సినిమాలేవీ నేను చూడలేదు. అవన్నీ వరస పెట్టి చూడాలనుకుంటున్నా’’ అని కరీనా కపూర్ చెప్పారు. కొత్త సంవత్సరం సందర్భంగా కరీనా తీసుకున్న నిర్ణయాలివి. అలాగే, మరో బలమైన నిర్ణయం కూడా తీసుకున్నారామె. అదేంటంటే, ఇప్పటివరకు యాభై చిత్రాలకు పైగా చేసినా, కరీనా పూర్తి స్క్రిప్ట్ చదవలేదట. జస్ట్ అలా అలా పైపైన చదివేసేదాన్నని కరీనా పేర్కొన్నారు. అందుకే, ఇక నుంచి ప్రతి పేజీ చదివిన తర్వాతే ఆ కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలనుకుంటున్నారామె. కొత్త సంవత్సరం సందర్భంగా నిర్ణయాలు తీసుకోవడం మాత్రమే కాదు... ఎక్కడ జరుపుకోవాలో కూడా నిర్ణయించేసుకున్నారు కరీనా. ఈ బ్యూటీకి స్విట్జర్లాండ్ అంటే చాలా ఇష్టం. ఈసారి స్విస్‌లోనే తన భర్త సైఫ్‌తో కలిసి న్యూ ఇయర్‌ని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. స్విస్‌లోని స్టాడ్ అనే ప్లేస్ అంటే ఈ జంటకు చాలా ఇష్టం. స్టాడ్లో ప్రతి ఏడాదీ ఒకే హోటల్లో, ఒకే నంబర్ గదిలో ఈ జంట బస చేస్తుంటారు. ఈసారి కూడా అలానే చేయబోతున్నారు. భవిష్యత్తులో స్టాడ్లో ఓ ఇల్లు కూడా కొనుక్కోవాలనుకుంటున్నారు. కరీనాకు కొత్త సంవత్సరంలో ఓ కొత్త కాంట్రాక్ట్ దక్కింది. అత్యధిక పారితోషికంతో ఓ పాకిస్తానీ వాణిజ్య ప్రకటన కాంట్రాక్ట్ ఆమెను వరించింది. పాకిస్థాన్‌లో అత్యధికంగా అమ్ముడుపోయే క్యూ మొబైల్ ఫోన్‌కు ప్రచారకర్తగా కరీనా వ్యవహరించనున్నారు. ఈ విధంగా కరీనా పాపులార్టీ దేశం దాటి పక్క దేశాలకు కూడా వ్యాపించడం సైఫ్ అలీఖాన్‌కు ఎంతో సంబరాన్ని కలిగిస్తోంది.