నిర్మాత సి.కల్యాణ్‌ తనయుడికి నోటీసులు | Notices to son of producer C kalyan | Sakshi
Sakshi News home page

నిర్మాత సి.కల్యాణ్‌ తనయుడికి నోటీసులు

Published Sat, Mar 25 2017 8:48 AM | Last Updated on Tue, Oct 2 2018 2:40 PM

నిర్మాత సి.కల్యాణ్‌ తనయుడికి నోటీసులు - Sakshi

నిర్మాత సి.కల్యాణ్‌ తనయుడికి నోటీసులు

హైదరాబాద్‌: ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో సభ్యుడి పర్సును తస్కరించి.. క్రెడిట్, డెబిట్‌ కార్డుల ద్వారా తన అకౌంట్‌లోకి డబ్బును మార్చుకున్న ఘటనలో ప్రముఖ సినీ నిర్మాత సి.కల్యాణ్‌ తనయుడు వరుణ్‌కుమార్‌కు బంజారాహిల్స్‌ పోలీసులు.. స్టేషన్‌కు రావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 22న బంజారాహిల్స్‌ రోడ్‌ నం.12లోని ఎమ్మెల్యే కాలనీలో ఉండే వ్యాపారి బిక్కిన శ్రీనివాస్‌ తన కుమారుడితో కలసి ఎఫ్‌ఎన్‌సీసీలో స్విమ్మింగ్‌ చేయడానికి వచ్చాడు. పర్సును పక్కన పెట్టి స్విమ్మింగ్‌ చేసి వచ్చేసరికి అది మాయమైంది.

అందులో ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంకులకు చెందిన డెబిట్, క్రెడిట్‌ కార్డులుండగా, గంట వ్యవధిలోనే ఆయన అకౌంట్‌లో నుంచి రూ.2.12 లక్షలు ఆన్‌లైన్‌ లావాదేవీలు జరిగాయి. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజీలు, బ్యాంకు అకౌంట్లు తనిఖీ చేసిన పోలీసులు దీనికి కారకుడు వరుణ్‌కుమార్‌ అని గుర్తించారు. దీంతో వరుణ్‌పై చీటింగ్‌ కేసు నమోదు చేసి... స్టేషన్‌కు వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా డీఐ వెంకటేశ్వర్‌రెడ్డి నోటీసులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement