ఈవ్‌టీజర్ పోలీసులకు అప్పగింత | Eve teaser surrender to police | Sakshi
Sakshi News home page

ఈవ్‌టీజర్ పోలీసులకు అప్పగింత

Published Sat, Dec 27 2014 12:34 AM | Last Updated on Sat, Sep 2 2017 6:47 PM

Eve teaser surrender to police

బంజారాహిల్స్: షాపింగ్ మాల్‌లో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న ఓ యువకుడిని స్థానికులు పట్టుకొని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. మరో ఆరుగురు  పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ఓల్డ్‌సిటీకి చెందిన ఇద్దరు యువతులు సిటీ సెంటర్ మాల్‌లో షాపింగ్ చేస్తుండగా ఏడుగురు యువకులు వారిని అనుసరిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని బాధిత యువతులు అక్కడ ఉన్న సెక్యూరిటీకి ఫిర్యాదు చేశారు.

సెక్యూరిటీ సిబ్బందితో పాటు వ్యాపారులు ఆ యువకులను పట్టుకోవడానికి ప్రయత్నించగా ఆరుగురు పరారీ కాగా.. ఉమర్ అనే యువకుడు దొరికాడు. అతడిని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఉమర్‌పై ఈవ్‌టీజింగ్ కేసు నమోదు చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement