Umar
-
చందనను ట్రాప్ చేశారా? అలా చెయ్యమంది ఎవరు?
కరీంనగర్: ఇంట్లో నగలు, నగదు ఉన్న సమయంలోనే ప్రియుడితో కలిసి పరార్ కావాలన్న ఆలోచన చందనకు ఎవరు కల్పించారు? ఈ దిశలో ఆమెను ఎవరైనా గైడ్ చేశారా? ప్రేమ మోజులో ఆ యువతి వారి ట్రాప్‌లో పడిపోయిందా? ప్రియుడితో కలిసి వెళ్లకుండా అడ్డుకున్న అక్కను చివరకు హతమార్చే పరిస్థితికి దిగజారిందా? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గతనెల 29 వేకువజామున పట్టణంలోని భీమునిదుబ్బలో ప్రియుడు ఉమర్ షేక్‌తో కలిసి చందన తన అక్క దీప్తిని సినీఫక్కీలో హత్యచేసిన కేసులో వెలుగులోకి వస్తున్న కోణాలు ఆసక్తి రేపుతున్నాయి. నాలుగేళ్ల పరిచయం.. ► 2019లో చందన బీటెక్ చదవడం కోసం హైదరాబాద్ మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో చేరింది. ► తన కంటే ఒక ఏడాది సీనియర్ ఉమర్ షేక్ సుల్తాన్ డిటెయిన్ కావడంతో చందనకు పరిచయం అయ్యాడు. ► అప్పటినుంచి వీరి ప్రేమాయణం సాగుతున్నట్లు సమాచారం. ► హాస్టల్లో ఉంటూ చందన తరచూ ఉమర్ షేక్ సుల్తానా ఇంటికి వెళ్లివస్తుండేదని తెలిసింది. ► ఈక్రమంలో వీరి ప్రేమ వ్యవహారం కొన్నాళ్లకు దీప్తికి తెలిసింది. ► ఆ తర్వాత ఇంట్లోనూ అందరికీ తెలిసి గొడవలు జరిగినట్లు సమాచారం. ► దీంతో చందన తండ్రి శ్రీనివాస్‌రెడ్డి తన కూతుళ్లు దీప్తి, చందనకు వివాహాలు చేయాలని సన్నాహాలు ప్రారంభింంచారు. ► ఆయన ఆంధ్రాకు చెందిన వ్యక్తి కావడంతో అక్కడే సంబంధాలు చూస్తున్నారు. ► పెళ్లి చేసుకోవాలని ఇంట్లో పెరుగుతున్న ఒత్తిడి గురించి చందన తన ప్రియుడికి చెప్పినట్లు సమాచారం. ► అయితే, ‘మనకు జాబ్ లేదు.. ఎలాబతుకుతాం’ అని డబ్బు, నగలు తీసుకొచ్చేలా ఉమర్ షేక్.. చందన దృష్టి మళ్లించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రేమా.. గతనెల 28వ తేదీన ఉదయం హైదరాబాద్ నుంచి కోరుట్లకు బయలుదేరిన విషయాన్ని ఉమర్ షేక్ తన తల్లి ఆలియా, చెల్లె ఫాతిమాకు చెప్పినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే, ఆ యువకుడు, అతడి కుటుంబానికి చందనపై కేవలం ప్రేమ మాత్రమే ఉండి ఉంటే నగలు, డబ్బు అవసరం లేదని చెప్పి ఉండవచ్చు కదా? అనే సందేహాలు వేధిస్తున్నాయి. సోమవారం రాత్రి దీప్తి మద్యం మత్తులో ఉన్న సమయంలో చందన, ఉమర్ కలిసి నగలు, డబ్బు సర్దే పనిచేయకుండా చడీచప్పుడు కాకుండా పరారై ఉంటే.. దీప్తి హత్యకు ఆస్కారం ఉండేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమర్ షేక్ తల్లి గతంలో లెక్చరర్‌గా పనిచేసినట్లు సమాచారం. విద్యాధికులైన ఉమర్ షేక్ కుటుంబీకులు.. చందన, ఉమర్ కలిసి మంగళవారం నగలు, డబ్బులతో కారులో హైదరాబాద్ చేరుకోగానే.. ఇది తప్పని చెప్పి పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. అంతేకాకుండా అంతాకలిసి నగలు, డబ్బులతో తప్పించుకునే ప్రయత్నం చేయడం.. చందనను గుర్తుపట్టకుండా బుర్కా వేసి కారులో తీసుకెళ్లడం.. టోల్గేట్లకు చిక్కకుండా అడ్డదారుల్లో పయనించడం.. ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిందన్న అభిప్రాయాలకు ఊతమిస్తోంది. రిమాండ్‌కు నిందితులు.. దీప్తి హత్య, డబ్బులు, నగలు ఎత్తుకెళ్లిన కేసులో నిందితులు బంక చందన, ఆమె ప్రియుడు ఉమర్‌షేక్ సుల్తానా, ఇతడి తల్లి ఆలియా, చెల్లి ఫాతిమాతోపాటు బంధువు హఫీజ్‌ను ఆదివారం మధ్యాహ్నం జడ్జి వద్ద పోలీసులు హాజరుపరిచారు. జడ్జి ఆదేశాల మేరకు 14 రోజుల పాటు రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. నిందితులపై ఐపీసీ 302, 201, 120(బీ),380 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ఆయన వివరించారు. -
ప్రియుడితో కలసి అక్కను చంపి..
కోరుట్ల/జగిత్యాల క్రైం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ బంక దీప్తి (24) హత్య కేసు మిస్టరీ వీడింది. చెల్లెలు చందన ప్రేమ పెళ్లిని దీప్తి వ్యతిరేకించడంతోనే హత్య జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీప్తి హత్య కేసులో సూత్రధా రి చందన (22), ఆమె ప్రియుడు ఉమర్ షేక్ సుల్తాన్ (25), అతడి తల్లి సయ్యద్ ఆలియా (47), చెల్లెలు ఫాతిమా (22), ఉమర్ మిత్రుడు హఫీజ్ (25)ను శనివారం అరెస్టు చేసినట్లు ఎస్పీ భాస్కర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇద్దరూ బీటెక్ చదివారు.. కోరుట్లకు చెందిన బంక శ్రీనివాస్‌రెడ్డి–మాధవి దంపతులకు ఇద్దరు కూతుళ్లు దీప్తి, చందన, కుమారుడు సాయి ఉన్నారు. పాతికేళ్ల క్రితం శ్రీనివాస్‌రెడ్డి ఉపా«ధి కోసం నెల్లూరు నుంచి కోరుట్లకు వలస వచ్చారు. ఇటుక బట్టీ వ్యాపారం చేస్తున్నారు. దీప్తిని బీటెక్ చదివించగా ఆమె పుణేకు చెందిన ఓ కంపెనీలో వర్క్‌ఫ్రం హోమ్ పద్ధతిన పనిచేస్తోంది. చందన 2019లో హైదరాబాద్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో చేరి ఇటీవల బీటెక్ పూర్తి చేసింది. తన సీనియర్, హైదరాబాద్‌కు చెందిన ఉమర్ షేక్ సుల్తాన్ ఒక ఏడాది డిటెయిన్ కావడంతో చందనకు క్లాస్మేట్ అయ్యాడు. ఈ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. నాలుగేళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. చందన ఇంట్లో ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఇద్దరు కూతుళ్ల వివాహం చేసేందుకు తండ్రి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 29న మధ్యాహ్నం దీప్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం... నగదు, బంగారంతో చందన పరారు కావడం కలకలం రేపింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పెళ్లికి అభ్యంతరం చెప్పినందుకే.. చందన ప్రేమ వ్యవహారం తెలిసి కుటుంబ సభ్యులు మతాంతర వివాహానికి తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ విషయాన్ని చందన తన ప్రియుడు ఉమర్ షేక్ దృష్టికి తీసుకెళ్లి ఎలాగైనా పెళ్లి చేసుకుందామని చెప్పింది. కానీ తనకు జాబ్ లేదని, డబ్బు లేదని, బతుకడం ఎలా అని ఉమర్ షేక్ బదులిచ్చాడు. దీంతో తన ఇంట్లో ఉన్న డబ్బు, నగలు తెస్తానని, ఆ తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పిన చందన.. తన అమ్మానాన్న ఇంట్లో లేనిసమయంలో కోరుట్లకు రావాలని ప్రియుడికి సూచించింది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు హైదరాబాద్‌లో బంధువుల గృహప్రవేశానికి వెళ్లగా చందన తన ప్లాన్ అమలు చేసింది. సూత్రధారి చందన.. తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడంతో సోమవారం ఉదయం 11 గంటలకు ఉమర్ షేక్ కారులో కోరుట్లకు చేరుకున్నాడు. సాయంత్రం మద్యం తాగుదామని చందన తన అక్కతో చెప్పింది. ప్రియుడితో వొడ్కా, బ్రీజర్ తెప్పించింది. మద్యం ఇచ్చి వెళ్లిన ఉమర్ షేక్ స్థానికంగానే ఉండిపోయాడు. రాత్రి చందన తన అక్క దీప్తికి వొడ్కా తాగించి, తాను బ్రీజర్ తాగింది. మత్తులో అక్క నిద్రపోయిందని నిర్ధారించుకున్న చందన.. రాత్రి 2 గంటల సమయంలో షేక్ ఉమర్‌కు వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చింది. ఉమర్ షేక్ వచ్చాక నగదు, బంగారం బ్యాగుల్లో సర్దుతున్న క్రమంలో దీప్తికి మెలకువ వచ్చి.. ‘ఏం చేస్తున్నారని’ చందనను నిలదీసింది. దీంతో చందన, ఆమె ప్రియుడు కలిసి దీప్తిని చున్నీతో కట్టేసి నోరు, ముక్కుకు ప్లాస్టర్ వేసి చంపి సోఫాలో పడేశారు. అనుమానం రాకుండా ఆ తర్వాత తొలగించారు. దీప్తి అతిగా మద్యం తాగి నిద్రలో చనిపోయినట్లు నమ్మించడం కోసం సినీఫక్కీలో సీన్ క్రియేట్ చేశారు. తర్వాత ఇద్దరూ కారులో హైదరాబాద్ పరారయ్యారు. వాయిస్ మెసేజ్‌తో దారిమళ్లింపు.. అక్కను చంపాక పరారైన చందన.. మర్నాడు హైదరాబా ద్‌లోని తన ప్రియుడు ఉమర్ షేక్ కలసి అతని తల్లి అలి యా, చెల్లి ఫాతిమా వద్దకు వెళ్లింది. వారంతా కలసి నగదు, డబ్బుతో నాగ్‌పూర్ వెళ్లాలనుకున్నారు. ఇంతలో చందన బుధవారం తన తమ్ముడు సాయికి ఫోన్లో వాయిస్ మెసేజ్ పంపించింది. అక్కను తాను చంపలేదని.. బాయ్‌ఫ్రెండ్‌తో రాత్రివేళ ఇంటికి రావాలని అక్క చెప్పిందని, తాను వద్దన్నా నని హత్య కేసును దారిమళ్లించే ప్రయత్నం చేసింది. నాగ్‌పూర్ వెళ్తుండగా.. చందన, ఉమర్‌షేక్ సెల్ఫోన్ల డేటా ఆధారంగా వారు హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు మూడు ప్రత్యేక బృందాలతో అక్కడకు వెళ్లారు. అయితే కారులో బురఖా వేసుకొని తప్పించుకొని తిరుగుతున్న చందనతోపాటు ప్రియుడు ఉమర్ షేక్, అతడి తల్లి అలియా, చెల్లి ఫాతిమా, బంధువు హఫీజ్‌ను నాగ్‌పూర్ వైపు పరారవుతుండగా శనివారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్–బాల్కొండ మార్గంలో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 1.20 లక్షల నగదు, సుమారు రూ.80 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన మెట్పల్లి డీఎస్పీ రవీందర్‌రెడ్డి, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు కిరణ్, చిరంజీవిని ఎస్పీ అభినందించారు. -
సేమ్ టు సేమ్.. లవ్‌లో పడ్డారు కదూ!
తాను పట్టుకున్న మంచానికి మూడే కాళ్లన్నట్టుగా ఉంది సోషల్ మీడియాలో కొందరి పరిస్థితి. ఎవరైనా ఇద్దరూ ఇంచుమించు ఒకేలా ఉన్న డ్రెస్ వేసుకుంటే వారి మధ్యలేదో ఉందంటూ లేనిపోనివి సృష్టించేస్తున్నారు. ప్రేమపక్షులు అంటూ ముద్రవేస్తున్నారు. తాజాగా హిందీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఉమర్ రియాజ్, హీరోయిన్ పరిణీతి చోప్రా లవ్‌లో పడ్డారంటూ నెట్టింట కొందరు పోస్టులు చేస్తున్నారు. ఇద్దరూ ఒకే టీషర్ట్స్ వేసుకున్నారని, ఇది ప్రేమలో ఉన్నామని అంగీకరించడమే కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అవునవును, ఇద్దరి టీషర్ట్స్ ఒకేలా ఉన్నాయి. ఇద్దరి మధ్య ఏదో ఉదంటూ మరికొందరు దానికి వంత పాడుతున్నారు. ఉమర్ ఫ్యాన్స్ ఓ అడుగు ముందుకు వేసి ఇద్దరి ఫొటోలను ఎడిటింగ్ చేసి మరీ పోస్ట్ చేస్తుండటం గమనార్హం. అయితే ఇదంతా కేవలం ఫన్ కోసం చేశారని తెలుస్తోంది. కాగా గతంలో ఉమర్ బిగ్‌బాస్ కంటెస్టెంట్ రష్మీ దేశాయ్‌తో లవ్‌లో ఉన్నాడంటూ రూమర్లు పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే! Exclusive & Confirm #UmarRiaz Dating #ParineetiChopra 😍😍❤️ 1. Umar Riaz & Parineeti Chopra Wear Same White T-Shirt ❤️ pic.twitter.com/JUyTiUasbi — 👑 LION UMAR RIAZ 👑 (@Ragib_08) April 15, 2022 2. #UmarRiaz & #ParineetiChopra Wear Same Black T-shirt ❤️ pic.twitter.com/RSd14MlXnx — 👑 LION UMAR RIAZ 👑 (@Ragib_08) April 15, 2022 8. #UmarRiaz & #ParineetiChopra Together At Jammu ❤️ pic.twitter.com/zX74Jf9szW — 👑 LION UMAR RIAZ 👑 (@Ragib_08) April 15, 2022 చదవండి: ప్రియురాలితో యాంకర్ వివాహం, నెట్టింట ఫొటోలు వైరల్ ట్విటర్ అకౌంట్ పేరు మార్చిన చిరంజీవి.. రామ్‌చరణ్ స్పెషల్ వీడియో వైరల్ -
కరోనా నుంచి కోలుకున్న పాక్ మాజీ క్రికెటర్ తౌఫిక్
కరాచీ: పాకిస్తాన్ మాజీ ఓపెనర్ తౌఫీక్ ఉమర్ ప్రాణాంతక కరోనా వైరస్ నుంచి కోలుకున్నాడు. రెండు వారాల క్రితం వైరస్ బారిన పడిన తాను ప్రస్తుతం పూర్తిస్థాయిలో కోలుకున్నానని 38 ఏళ్ల తౌఫీక్ శుక్రవారం తెలిపాడు. కోవిడ్–19 మహమ్మారిని తీవ్రంగా పరిగణించాలని, రోగ నిరోధక శక్తికి పెంపొందించుకునే మార్గాలపై శ్రద్ధ వహించాలని అతను ప్రజలకు సూచించాడు. ‘ప్రతీ ఒక్కరూ సామాజిక దూరం పాటించండి. పాజిటివ్‌గా తేలాక రెండు వారాల పాటు నేను ఒక గదికే పరిమితమయ్యా. ఇంట్లో పిల్లలకు, పెద్దవారికి దూరంగా ఉన్నా. ఒకవేళ ఎవరైనా కరోనా పాజిటివ్‌గా తేలితే కంగారు పడకుండా రోగనిరోధకత పెంచుకోవడంపై దృష్టి పెట్టండి’ అని ఉమర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం పాకిస్తాన్ జూనియర్ సెలక్షన్ కమిటీలో సభ్యుడైన ఉమర్.. 44 టెస్టులు, 22 వన్డేల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. -
పాలకులు ఎలా ఉండాలి?
హజ్రత్ ఉమర్ గొప్పనాయకుడు. బాధ్యతాయుతమైన పాలకుడు. అన్నిటికీ మించి దైవభక్తి పరాయణుడు. ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవడం కోసం ఇతరులపై ఆధారపడకుండా, ఆయన స్వయంగా పర్యటించేవారు. అందులో భాగంగానే ఒకసారి మారువేషం ధరించి గస్తీకి బయలుదేరారు. కొన్ని ప్రాంతాలు పర్యటించిన తరువాత ఒక పూరిగుడిసె దగ్గర ఆగారు. ఆ గుడిసెలో ఒక వృద్ధురాలు నివాసం ఉంటోంది. మారువేషంలో ఉన్న హజ్రత్ ఉమర్ (ర)ఆమె దగ్గరికి వెళ్ళి క్షేమ సమాచారాలు విచారించారు. మీ పాలకుడు ఉమర్ పాలన ఎలా ఉందని ప్రశ్నించారు.దానికామె, ‘‘ఆ..ఏమి ఉమరో ఏమిటో నాయనా! దేవుడు ఆయనకు మేలుచేయడు.’ అన్నది.‘‘అయ్యయ్యో.. ఏంటి పెద్దమ్మా.. అంతమాట అనేశావు..అసలేం జరిగింది?’’ అని ఆరాతీశారు.‘‘ఏమీలేదు నాయనా.. నేనింత ముసలిదాన్నికదా...నన్నెప్పుడైనా పట్టించుకున్నాడా..?’’అని నిష్టురమాడింది.‘‘అమ్మా..! రాజు అంటే చాలా పనులుంటాయి కదమ్మా..! నువ్వెప్పుడైనా నీసమస్యను రాజుగారి దృష్టికి తీసుకెళ్ళావా?’ అన్నారు ఉమర్ .‘‘అదేంటి బాబూ అలా అంటావు? పాలకుడన్నవాడికి తన రాజ్యంలో ఎక్కడ ఏం జరుగుతోంది? ప్రజలు ఎలా ఉన్నారు. వారి కష్టసుఖాలేమిటి? అన్న విషయాలు తెలుసుకోవాలన్న బాధ్యత ఉండదా? పాలకుడంటే సేవకుడు కదా..? నేను వెళ్ళి దేహీ అని అడుక్కోవాలా? ప్రజల బాగోగులు చూడడం, వారి అవసరాలు తీర్చడం పాలకుడి బాధ్యత కాదా?’అని ప్రశ్నించింది.వృద్ధురాలి మాటల్లోని సత్యాన్ని అర్థం చేసుకున్న హజ్రత్ ఉమర్ కు దుఖంపొంగుకొచ్చింది. ‘ఈ వృద్ధురాలికున్నంత తెలివి కూడా నీకు లేదా ఉమర్! రేపు దైవానికి ఏం సమాధానం చెబుతావు?’ అంటూ తనను తాను ప్రశ్నించుకున్నారు ఉమర్ తరువాత ఆయన, ‘‘అయితే.. నీ విషయంలో ఉమర్ వల్ల జరిగిన నిర్లక్ష్యానికి ఎంతమూల్యం చెల్లించమంటావో చెప్పు. నేను ఆ మూల్యాన్ని నీకు చెల్లించి ఉమర్‌ను కాపాడాలనుకుంటున్నాను’’ అన్నారు.‘‘బాబూ.. ఈ ముసలిదాన్ని ఎందుకు ఆటపట్టిస్తావు? ఉమర్ నిర్లక్ష్యానికి నువ్వు మూల్యం చెల్లిస్తావా?.’అంటూ నవ్వింది వృద్ధురాలు. ‘‘లేదమ్మా.. నేను నిజమే చెబుతున్నాను’’ నమ్మబలికారు ఉమర్.‘‘సరే, అయితే.. ఇరవై ఐదు వరహాలు ఇవ్వు..’ అన్నది వృద్ధురాలు..అంతలో హజ్రత్ అలీ(ర), హజ్రత్ ఇబ్నెమస్ ఊద్ (ర)అటుగా వచ్చారు. వారు హజ్రత్ ఉమర్ గారిని చూస్తూనే, సలామాలేకుం ఉమర్ ఖలీఫా’’ ఈ మాట వింటూనే వృద్ధురాలికి ముచ్చెమటలు పట్టాయి. ఆమె ఆందోళనను గమనించిన హజ్రత్ ఉమర్ ‘‘అమ్మా.. ఆందోళన చెందకు.అల్లాహ్ కరుణించుగాక.. నువ్వు సత్యం మాట్లాడావు’’ అంటూ ఆప్యాయంగా అనునయించారు. ఒక సామ్రాజ్యానికి పాలకుడైనటువంటి హజ్రత్ ఉమర్(ర)ఎంత నిబద్దతతో, ఎంతబాధ్యతతో, ఎంత జవాబుదారీతనంతో ప్రజలతో వ్యవహరించారో చూడండి. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ఈవ్‌టీజర్ పోలీసులకు అప్పగింత
బంజారాహిల్స్: షాపింగ్ మాల్లో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న ఓ యువకుడిని స్థానికులు పట్టుకొని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ఓల్డ్‌సిటీకి చెందిన ఇద్దరు యువతులు సిటీ సెంటర్ మాల్లో షాపింగ్ చేస్తుండగా ఏడుగురు యువకులు వారిని అనుసరిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని బాధిత యువతులు అక్కడ ఉన్న సెక్యూరిటీకి ఫిర్యాదు చేశారు. సెక్యూరిటీ సిబ్బందితో పాటు వ్యాపారులు ఆ యువకులను పట్టుకోవడానికి ప్రయత్నించగా ఆరుగురు పరారీ కాగా.. ఉమర్ అనే యువకుడు దొరికాడు. అతడిని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఉమర్‌పై ఈవ్‌టీజింగ్ కేసు నమోదు చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.