రంభ బంగారు, వజ్రాల నగలను కాజేశారు.. | Heroine Rambha brother complaints to Banjara hills police station | Sakshi
Sakshi News home page

రంభ బంగారు, వజ్రాల నగలను కాజేశారు..

Published Sun, Feb 1 2015 8:56 AM | Last Updated on Sat, Sep 2 2017 8:38 PM

రంభ బంగారు, వజ్రాల నగలను కాజేశారు..

రంభ బంగారు, వజ్రాల నగలను కాజేశారు..

సోదరుడు శ్రీనివాస్ ఫిర్యాదు


బంజారాహిల్స్: సినీ నటి రంభ బంగారు, వజ్రాల నగలు ఆమె వదిన, అక్కలు కాజేశారని, ఈ మేరకు తాము చెన్నై విరువుంబాకం పోలీస్ స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశామని రంభ సోదరుడు వై.శ్రీనివాస్ తెలిపారు. శనివారం ఆయన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అతడి భార్య పల్లవి, ఆమె సోదరి శాంతిసింగ్‌చౌహాన్, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ రవికిరణ్ (పల్లవి సోదరుడు), ఆయన భార్య వాణిజ్య పన్నుల శాఖాధికారిణి సంయుక్త తదితరులు కలిసి రంభకు చెందిన నాలుగున్నర కోట్ల విలువైన ఆభరణాలు కాజేయడమే కాకండా గతంలో తనపై, తన కుటుంబ సభ్యులపై అకారణంగా వరకట్న వేధింపుల కేసు పెట్టారని ఆరోపించారు.
 
 తన కుమారుడిని ఏడాదిగా చూపించడం లేదని పశ్చిమ మండలం డీసీపీకి ఫిర్యాదు కూడా చేశానని, ఆ కేసు విషయమై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు వెల్లడించారు. మూడేళ్ల నుంచి రంభ కెనడాలో ఉందని ఇటీవల రెండు నెలలు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిందని తెలిపారు. గతంలో తాము ఇక్కడ లేని సమయంలో బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో తమపై కేసు పెట్టారని  పల్లవి,  శాంతిసింగ్ చౌహాన్, ఆమె సోదరుడు రవికిరణ్, సంయుక్తలపై చెన్నైలో తొలుత తామే ఫిర్యాదు చేశామని, కేసు నమోదైందని  తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement