Actress Rambha Returns India With Family - Sakshi
Sakshi News home page

Rambha: ఆ పెళ్లి కోసం ఫ్యామిలీతో ఇండియాకు వచ్చేసిన రంభ

Published Mon, Aug 22 2022 7:57 PM | Last Updated on Mon, Aug 22 2022 8:22 PM

Actress Rambha Returns India With Family - Sakshi

అలనాటి హీరోయిన్‌ రంభ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ఒకప్పుడు తెలుగులో టాప్‌ హీరోయిన్‌గా దుమ్ము రేపిన ఆమె బాలీవుడ్‌, కోలీవుడ్‌, శాండిల్‌వుడ్‌, బెంగాలీ.. ఇలా పలు ఇండస్ట్రీలలో సైతం స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. దాదాపు టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలందరితోనూ నటించిన ఆమె 2010లో బిజినెస్‌మెన్‌ ఇంద్రకుమార్‌ పద్మనాథన్‌ను పెళ్లి చేసుకుని కెనడా వెళ్లిపోయింది.  ముగ్గురు పిల్లలతో అక్కడే సెటిలైపోయింది.

తాజాగా ఆమె ఓ పెళ్లి కోసం భారత్‌కు వచ్చింది. ఈ క్రమంలో తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అక్క కూతురు పెళ్లి కోసం ఇండియా వచ్చానంది. ఫ్యామిలీతో కలిసి తిరుపతి దర్శనం చేసుకున్నానంది. ప్రస్తుతానికి ఇంతకు మించి ఏమీ మాట్లాడలేనని చెప్పుకొచ్చింది రంభ.

చదవండి:  రౌడీ హీరోకు ఉంగరం తొడిగి ఏడ్చేసిన మహిళా అభిమాని, వీడియో వైరల్‌
విడాకుల తర్వాత ఒక్కటిగా కనిపించిన ధనుష్‌, ఐశ్వర్య.. ఫొటో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement