కోర్టు ఆదేశాల మేరకే రంభపై కేసు: డీసీపీ | Court Directs for Rambha and her brother Booked | Sakshi
Sakshi News home page

కోర్టు ఆదేశాల మేరకే రంభపై కేసు: డీసీపీ

Published Wed, Jul 23 2014 4:17 PM | Last Updated on Fri, May 25 2018 12:56 PM

కోర్టు ఆదేశాల మేరకే రంభపై కేసు: డీసీపీ - Sakshi

కోర్టు ఆదేశాల మేరకే రంభపై కేసు: డీసీపీ

హైదరాబాద్: అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ నటి రంభ సోదరుడు శ్రీనివాస్ వెంకటేశ్వర్‌రావు భార్య పల్లవి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని వెస్ట్ జోన్‌ డీసీసీ సత్యనారాయణ తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు  రంభ, తల్లిదండ్రులు, శ్రీనివాసరావులపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు.

త్వరలోనే వారికి నోటీసులు పంపుతామని వెల్లడించారు. వారి వాంగ్మూలాన్ని తీసుకుంటామని చెప్పారు. కేసుపై అన్నివైపుల విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పల్లవి భర్త శ్రీనివాస్‌తో పాటు రంభ, అత్త ఉషారాణి, మామ వెంకటేశ్వర్రావుపై  బంజారాహిల్స్ పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement