'పబ్లిసిటీ కోసమే నాపై, రంభపై ఆరోపణలు' | Rambha, kin booked for dowry harassment: That is Publicity stunt, says Rambha brother srinivas | Sakshi
Sakshi News home page

'పబ్లిసిటీ కోసమే నాపై, రంభపై ఆరోపణలు'

Published Wed, Jul 23 2014 11:55 AM | Last Updated on Fri, May 25 2018 12:56 PM

'పబ్లిసిటీ కోసమే నాపై, రంభపై ఆరోపణలు' - Sakshi

'పబ్లిసిటీ కోసమే నాపై, రంభపై ఆరోపణలు'

చెన్నై : పబ్లిసిటీ కోసమే తన భార్య పల్లవి ఆరోపణలు చేస్తోందని సినీనటి రంభ సోదరుడు శ్రీనివాస్ వెంకటేశ్వర్‌రావు అన్నారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ రంభపై ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని అన్నారు. పల్లవి కుటుంబ సభ్యులే వెనకుండి ఆమెను ఆడిస్తున్నారని శ్రీనివాస్ ఆరోపించారు. కాగా కొంతకాలంగా భర్త శ్రీనివాస్‌తో పాటు ఆడపడుచు రంభ, అత్త ఉషారాణి, మామ వెంకటేశ్వర్రావు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ బంజారాహిల్స్ నివాసి పల్లవి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దర్యాప్తు చేసిన పోలీసులు రంభతో పాటు ఆమె భర్త శ్రీనివాస్, అత్తా మామలపై ఐపీసీ సెక్షన్ 498(ఎ) కింద కేసు నమోదు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement