రముఖ పారిశ్రామిక వేత్త నిత్యానందరెడ్డిపై కాల్పులు జరిపి పోలీసు కస్టడీలో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ ఓబులేసును బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం కర్నూలు తీసుకెళ్లారు.
హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామిక వేత్త నిత్యానందరెడ్డిపై కాల్పులు జరిపి పోలీసు కస్టడీలో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ ఓబులేసును బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం కర్నూలు తీసుకెళ్లారు. బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణ, ఎస్‌ఐ.సంతోషం నిందితుడు ఓబులేసును కర్నూలుకు తీసుకె ళ్లి ఆరోజు జరిగిన సంఘటనపై ఆరా తీశారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయన్న దానిపై దర్యా ప్తు చేస్తున్నారు. ఓబులేసు ఇంట్లో పలు రకాల ఆయుధాల తూటాలు దొరికిన నేపథ్యంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.