అరబిందో ఫార్మ వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులకు పాల్పడిన నిందితుడు ఓబులేసును శుక్రవారం సాయంత్రం అయిదు గంటలకు మీడియా ముందు...
హైదరాబాద్ : అరబిందో ఫార్మ వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులకు పాల్పడిన నిందితుడు ఓబులేసును శుక్రవారం సాయంత్రం అయిదు గంటలకు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. ఓబులేసుని ఒక్కడినే అరెస్ట్ చేశామని, అతన్ని తప్ప ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని వారు స్పష్టం చేశారు. మరోవైపు ఓబులేసును పోలీసులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. గతంలో ఓ పారిశ్రామికవేత్తను ఓబులేసు అపహరించినా... వారు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవటంతో కిడ్నాప్ వ్యవహారం బయటకు రాలేదు.