kbr parkt firing
-
ఓబులేసుకు డిసెంబర్ 5 వరకూ రిమాండ్
-
ఓబులేసుకు డిసెంబర్ 5 వరకూ రిమాండ్
హైదరాబాద్ : కేబీఆర్ పార్క్ వద్ద కాల్పుల ఘటన కేసులో నిందితుడు ఓబులేసును పోలీసులు శనివారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. విచారణ చేపట్టిన కోర్టు అతనికి డిసెంబర్ 5 వరకూ రిమాండ్ విధించింది. అనంతరం ఓబులేసును పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. మరోవైపు ఓబులేసును తమ కస్టడీకి ఇవ్వాలంటూ బంజారాహిల్స్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. -
ఓబులేసును కస్టడీకి కోరునున్న పోలీసులు
-
ఓబులేసును కస్టడీకి కోరనున్న పోలీసులు
హైదరాబాద్ : అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డి కిడ్నాప్‌కు యత్నించి, కాల్పులకు పాల్పడిన నిందితుడు ఓబులేసును... పో్లీసులు శనివారం మధ్యాహ్నం నాంపల్లి కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. అతడిని ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఉంచారు. మరికొద్దిసేపట్లో ఓబులేసును వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియాకు తరలించనున్నారు. అనంతరం కోర్టులో హాజరు పరచనున్నారు. మరోవైపు ఓబులేసును తిరిగి పోలీసు కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అతడి వెనకాల మరెవరైనా ఉన్నారా అనే విషయంపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. -
ఓబులేసు ఒక్కడినే అరెస్ట్ చేశాం: పోలీసులు
హైదరాబాద్ : అరబిందో ఫార్మ వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులకు పాల్పడిన నిందితుడు ఓబులేసును శుక్రవారం సాయంత్రం అయిదు గంటలకు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. ఓబులేసుని ఒక్కడినే అరెస్ట్ చేశామని, అతన్ని తప్ప ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని వారు స్పష్టం చేశారు. మరోవైపు ఓబులేసును పోలీసులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. గతంలో ఓ పారిశ్రామికవేత్తను ఓబులేసు అపహరించినా... వారు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవటంతో కిడ్నాప్ వ్యవహారం బయటకు రాలేదు.