హైదరాబాద్ : అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డి కిడ్నాప్‌కు యత్నించి, కాల్పులకు పాల్పడిన నిందితుడు ఓబులేసును... పో్లీసులు శనివారం మధ్యాహ్నం నాంపల్లి కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. అతడిని ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఉంచారు.
మరికొద్దిసేపట్లో ఓబులేసును వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియాకు తరలించనున్నారు. అనంతరం కోర్టులో హాజరు పరచనున్నారు. మరోవైపు ఓబులేసును తిరిగి పోలీసు కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అతడి వెనకాల మరెవరైనా ఉన్నారా అనే విషయంపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు.