nityananda reddy
-
నిత్యానందరెడ్డి కిడ్నాప్ కేసులో నిందితుడికి జీవిత ఖైదు
-
నిత్యానందరెడ్డి కిడ్నాప్ కేసులో నిందితుడికి జీవిత ఖైదు
హైదరాబాద్ : అరబిందో ఫార్మా కంపెనీ వైస్ ఛైర్మన్ నిత్యానందరెడ్డి కిడ్నాప్ కేసుపై తుది తీర్పును నాంపల్లి కోర్టు గురువారం వెలువరించింది. ఈ కేసులో నిందితుడు కానిస్టేబుల్ ఓబులేశుకు జీవిత ఖైదు విధించింది. గతేడాది నవంబర్ 14వ తేదీన బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్‌లో ఉదయపు నడకను ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్లేందుకు కారు ఎక్కుతున్న నిత్యానందరెడ్డిపై ఆగంతకుడు ఏకే 47తో కాల్పులు జరిపాడు. ఆ వెంటనే తేరుకున్న నిత్యానందరెడ్డి తనవద్ద ఉన్న తుపాకీతో ఎదురు కాల్పులు జరిపారు. దీంతో ఆగంతకుడు ఏకే 47 వదిలి పరారైయ్యాడు. నిత్యానందరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వదిలిన ఏకే 47 తుపాకీ ఆధారంగా కేసు విచారణ ప్రారంభించారు. ఆ తుపాకీ గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఓబులేశుదని గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. దీంతో కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. -
జ్యుడీషియల్ కస్టడీకి ఓబులేసు
హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త నిత్యానందరెడ్డిపై కాల్పులు జరిపిన ఏఆర్ కానిస్టేబుల్ పుల్లా ఓబులేసును అయిదు రోజుల కస్టడీ అనంతరం బంజారాహిల్స్ పోలీసులు శనివారం రిమాండ్‌కు తరలించారు. ఈ అయిదురోజుల్లో ఓబులేసును కర్నూలుతో పాటు వైఎస్సార్ జిల్లాలోని ఆయన స్వగ్రామం పోరుమామిళ్ల, గండిపేట సమీపంలోని గ్రేహౌండ్స్ కార్యాలయం, సంఘటన జరిగిన కేబీఆర్ పార్కు వద్ద విచారించారు. గతంలో చేసిన నేరాలపై కూడా ఆరాతీశారు. -
ఓబులేసును కర్నూలు తీసుకెళ్లిన పోలీసులు
హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామిక వేత్త నిత్యానందరెడ్డిపై కాల్పులు జరిపి పోలీసు కస్టడీలో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ ఓబులేసును బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం కర్నూలు తీసుకెళ్లారు. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ, ఎస్ఐ.సంతోషం నిందితుడు ఓబులేసును కర్నూలుకు తీసుకె ళ్లి ఆరోజు జరిగిన సంఘటనపై ఆరా తీశారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయన్న దానిపై దర్యా ప్తు చేస్తున్నారు. ఓబులేసు ఇంట్లో పలు రకాల ఆయుధాల తూటాలు దొరికిన నేపథ్యంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
కర్నూలుకు ఓబులేసు తరలింపు
హైదరాబాద్ : కేబీఆర్ పార్క్ కాల్పుల కేసులో నిందితుడు ఓబులేసును బంజారాహిల్స్ పోలీసులు కర్నూలు తరలించారు. న్యాయస్థానం అనుమతితో అతడిని అయిదు రోజులు కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. కాల్పులకు ఉపయోగించిన ఏకే-47ను దాచిన ప్రదేశమైన కర్నూలులోని ఓర్వకల్లుకు ఓబులేసును పోలీసులు తీసుకువెళ్లారు. కాల్పుల అనంతరం ఓబులేసును పోలీసులు కర్నూలులోనే అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఈనెల 19న అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై ఓబులేసు కాల్పులకు పాల్పడ్డాడు. కాగా నార్సింగిలోని ఓబులేసు ఇంటి నుంచి ఖాళీ తూటాలను పోలీసులు నిన్న స్వాధీనం చేసుకున్నారు. ఈ తూటాలు గ్రేహౌండ్స్‌లో చోరీ చేసిన ఏకే-47వేనా లేక ఇతర ఆయుధానివా అనే విషయాన్ని ఇంకా తేల్చాల్సి ఉంది. -
జీవితాన్ని ఎంజాయ్ చేయాలనే..
-
జీవితాన్ని ఎంజాయ్ చేయాలనే.. ఇలా చేశా: ఓబులేసు
ఓబులేసు రిమాండ్ రిపోర్టు 'సాక్షి' చేతికి చిక్కింది. తనకు ప్రాణాంతక వ్యాధి సోకిందని, చివరిక్షణాల్లో జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకున్నానని.. అందుకే డబ్బు సంపాదించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నానని ఓబులేసు అంగీకరించాడు. 12 ఏళ్ల పాటు గ్రేహౌండ్స్‌లో విధులు నిర్వర్తించానని చెప్పాడు. ప్రముఖులను కిడ్నాప్ చేసి పెద్దమొత్తంలో డబ్బు డిమాండ్ చేయాలనుకున్నానని, అందుకోసమే ఏకే 47ను చోరీ చేశానని ఓబులేసు పోలీసు విచారణలో అంగీకరించాడు. కేబీఆర్ పార్కుకు వాకింగ్ కోసం వచ్చే డబ్బున్నవాళ్లు, పెద్దపెద్ద కార్లలో వచ్చేవాళ్లను గమనించేవాడినన్నాడు. డ్రైవర్ లేని కార్లలో ఓనర్లు ఎక్కిన తర్వాత తాను వెంటనే దూరాలని పథకం వేశానన్నాడు. నిత్యానందరెడ్డి సీటుబెల్టు పెట్టుకుంటున్న సమయంలో తాను సీట్లోకి వెళ్లానని, ఏకే 47తో బెదిరించానని విచారణలో అంగీకరించాడు. అంతకుముందు 2014 ఫిబ్రవరి 19న ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడిని అపహరించానని, యువకుడి తల్లిదండ్రుల నుంచి 10 లక్షలు తీసుకున్నానని, తర్వాత అతడిని వదిలేసి నార్సింగిలోని తన ఇంటికి వచ్చానని చెప్పాడు. -
పరువు తీసేస్తున్నారు
క్రమశిక్షణకు మారు పేరు పోలీస్ శాఖ. అలాంటి శాఖలో ఇటీవల కాలంలో ఉన్నతాధికారులు, సిబ్బంది ప్రవర్తనతో ఆ శాఖ పరువు కాస్తా గంగలో కలుస్తోంది. అందుకు నగరంలో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలే ఉదాహరణ. గత వారం నగరంలోని ఓ లాడ్జీలో ఓ సీఐ, మహిళా ఎస్సై రాసలీలలు చోటు చేసుకున్నాయి. ఆ ఘటనపై సాక్షాత్తూ సదరు మహిళ ఎస్సై భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు ఉన్నతాధికారులు సీరియస్ అయి సదరు సీఐ, మహిళా ఎస్ఐలపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆ సంఘటన మరువక ముందే నగరంలో మరో ఘటన చోటు చేసుకుంది. బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద వాకింగ్‌కు వచ్చిన అరబిందో ఫార్మా కంపెనీ వైస్ ఛైర్మన్ నిత్యానందరెడ్డిని కిడ్నాప్ చేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించడం.... కాల్పులు జరపడం... ఆ క్రమంలో నిత్యానందరెడ్డి సోదరుడు కిడ్నాపరుపై దాడికి ఉపక్రమించడంతో అతగాడు ఉపయోగించిన ఏకే 47 తుపాకీ వదిలి పరారైయ్యాడు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభిస్తే... ఆ కిడ్నాపర్ ఎవరో కాదు.... పోలీసు శాఖకు చెందిన కానిస్టేబుల్ ఓబులేసు అని తేల్చారు. అంతేకాదు గతేడాది విశాఖ ఏజెన్సీలో మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహించి హైదరాబాద్ తిరిగి వస్తూ... గల్లంతైన ఏకే 47 ఇదే అని పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. ఇదిలా ఉంటే అబిడ్స్ పోలీసు స్టేషన్లోకి అర్థరాత్రి ఓ వ్యక్తి దర్జాగా వెళ్లి వైర్లెస్ సెట్‌ను దొంగిలించాడు. ఆ సమయంలో స్టేషన్ తలుపు తీసుకుని నిద్రపోతున్నారు. వైర్లెస్ సెట్ట్ కోసం పోలీసులు ఒకరు ఇద్దరిని కాదు దాదాపు 600 మందిని విచారించారు. అయినా పోలీసు స్టేషన్లోకి దర్జాగా వచ్చి... వెళ్లిన వ్యక్తి ఎవరో గుర్తించలేక పోయారు. ఇది మన పోలీసుల తీరు. నగరంలో ఎక్కడబడితే అక్కడ చైన్ స్నాచర్లు ఆగడాలు రోజురోజూకు పెరిగిపోతున్నాయి. ఆ కేసులను పరిష్కరించ లేక పోలీసులు నానావస్థలు పడుతున్నారు. ఓ వైపు సీఎం కేసీఆర్ మాత్రం పోలీసు వ్యవస్థను అంతర్జాతీయ స్థాయికీ తీసుకువెళ్తామని ఆయన మాటలు ఆకాశాన్ని తాకుతుంటే.. పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బందిలోని కొందరు ఆలోచనలు మాత్రం ఖాకీ వనంలో విత్తిన గంజాయి మొక్కల్లా ఏపుగా ఎదుగుతున్నాయి. -
ఓబులేసును కస్టడీకి కోరునున్న పోలీసులు
-
ఓబులేసును కస్టడీకి కోరనున్న పోలీసులు
హైదరాబాద్ : అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డి కిడ్నాప్‌కు యత్నించి, కాల్పులకు పాల్పడిన నిందితుడు ఓబులేసును... పో్లీసులు శనివారం మధ్యాహ్నం నాంపల్లి కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. అతడిని ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఉంచారు. మరికొద్దిసేపట్లో ఓబులేసును వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియాకు తరలించనున్నారు. అనంతరం కోర్టులో హాజరు పరచనున్నారు. మరోవైపు ఓబులేసును తిరిగి పోలీసు కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అతడి వెనకాల మరెవరైనా ఉన్నారా అనే విషయంపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. -
ఓబులేసు ఒక్కడినే అరెస్ట్ చేశాం: పోలీసులు
హైదరాబాద్ : అరబిందో ఫార్మ వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులకు పాల్పడిన నిందితుడు ఓబులేసును శుక్రవారం సాయంత్రం అయిదు గంటలకు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. ఓబులేసుని ఒక్కడినే అరెస్ట్ చేశామని, అతన్ని తప్ప ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని వారు స్పష్టం చేశారు. మరోవైపు ఓబులేసును పోలీసులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. గతంలో ఓ పారిశ్రామికవేత్తను ఓబులేసు అపహరించినా... వారు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవటంతో కిడ్నాప్ వ్యవహారం బయటకు రాలేదు. -
కాల్పుల నిందితుడు.. చిక్కాడీ కెమేరాకు..!
-
'కాల్పులు జరిపింది ఎవరో గుర్తించాం'
హైదరాబాద్ : కేబీఆర్ పార్క్ వద్ద కాల్పుల ఘటన కేసులో నిందితుడి అరెస్ట్‌ను పోలీసులు ఇప్పటివరకూ ధ్రువీకరించలేదు. అయితే దర్యాప్తు కొనసాగుతోందని, కాల్పులకు తెగబడింది ఎవరో గుర్తించినట్లు పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై నిన్న ఉదయం ఓ ఆగంతకుడు కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న ఫొటోలు నిందితుడివి కావని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు కానిస్టేబుల్ ఓబులేసు కుటుంబ సభ్యులు డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. మీడియాలో తప్పుడు ఫొటోలను ప్రసారం చేస్తున్నారంటూ ఉన్నతాధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అసలు తన కొడుకుతో తనకు రెండేళ్లుగా సంబంధాలు లేవని ఓబులేసు తండ్రి మైఖేల్ ఇంతకుముందు చెప్పిన విషయం తెలిసిందే. -
'రెండేళ్లుగా నా కొడుకుతో సంబంధాలు లేవు'
పోరుమామిళ్ల : అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులకు పాల్పడినట్లు భావిస్తున్న కానిస్టేబుల్ ఓబులేసు తండ్రి మైకేల్‌ను గురువారం పోరుమామిళ్ల పోలీసులు విచారించారు. పోలీసులు విచారణలో మైకేల్.... తన కుమారుడితో రెండు సంవత్సరాల నుంచి సంబంధాలు లేవని వెల్లడించినట్లు తెలుస్తోంది. కాగా కాల్పుల కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న వ్యక్తి ...తన కుమారుడా కాదా అనేది తనకు తెలియదని మైకేల్ ...పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. ఓబులేసు స్వస్థలం వైఎస్ఆర్ జిల్లా జీ.పోరుమామిళ్ల మండలం తిరువెంగళాపురం. మరోవైపు ఓబులేసు గురించి మాట్లాడేందుకు గ్రామస్తులు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఓబులేసు సర్వీస్ బుక్ ను పరిశీలిస్తున్న పోలీసులు
హైదరాబాద్:అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులకు పాల్పడిన ఏఆర్ కానిస్టేబుల్ ఓబులేసు సర్వీస్ బుక్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. కేబీఆర్ పార్కులో బుధవారం ఉదయం జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ఓబులేసును అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 1998 ఏపీఎస్పీ 11 బెటాలియన్ బ్యాచ్ కు చెందిన ఓబులేసు బుధవారం నిత్యానందరెడ్డిపై కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఓబులేసును అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని సర్వీస్ బుక్ ను పరిశీలించే పనిలో పడ్డారు. గత 15 రోజులుగా సెలవులో ఉన్న ఓబులేసును అనంతపురంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్ల మండలం తిరువెంగళాపురంకు చెందిన ఓబులేసు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు పారిపోయే క్రమంలో పోలీసులకు చిక్కినట్లు సమాచారం. -
కానిస్టేబుల్ అరెస్ట్ వార్తను ఖండించిన సీపీ మహేందర్‌రెడ్డి
హైదరాబాద్ : కేబీఆర్ పార్క్ కాల్పుల ఘటన కేసులో కానిస్టేబుల్ ఓబులేసు అరెస్ట్ వార్తను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి ఖండించారు. కాగా అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులకు పాల్పడింది ఓబులేసుగా పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే దీనిపై పోలీసులు మాత్రం పెదవి విప్పటం లేదు. ఓబులేసును నిన్న సాయంత్రం అనంతపురం-కర్నూలు సరిహద్దు ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అతడిని హైదరాబాద్ తరలించి రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. కాగా ఓబులేసు స్వస్థలం వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్ల. -
సెలవు పెట్టి మరీ స్కెచ్ గీశాడు....!
హైదరాబాద్ : అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులకు పాల్పడిన ఏఆర్ కానిస్టేబుల్ ఓబులేసు.... విధులకు సెలవు పెట్టి స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాంపల్లి ఎక్సైజ్ శాఖలో విధులు నిర్వహిస్తున్న అతను...15 రోజులుగా సెలవులో ఉన్నాడు. అనంతపురంలో ఓబులేసును అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతడిని హైదరాబాద్ తరలించారు. కాగా కాల్పులకు పాల్పడిన ఓబులేసు ....ప్లాన్ ఫెయిల్ కావటంతో నేరుగా ఎస్ ఆర్ నగర్ చేరుకున్న అక్కడ నుంచి బెంగళూరు బస్సు ఎక్కాడు. అనంతపురం వెళుతున్న అతడిని.... సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించిన పోలీసులు అనంతపురం-కర్నూలు జిల్లా సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అతడిని హైదరాబాద్‌లో రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం ఓబులేసు అరెస్ట్ వార్తపై ధ్రువీకరించలేదు. కాగా నిందితుడు ఓబులేష్ వెనుక పెద్ద చరిత్రే ఉంది. హైదరాబాద్ అంబర్ పేటలోని సీపీఎస్ గ్రౌండ్ లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఓబులేసు... 1998లో మొదట కర్నూలు ఏపీఎస్పీ ఏఆర్ కానిస్టేబుల్ గా డిపార్ట్ మెంట్లో చేరాడు. నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్ గ్రేహౌండ్స్ కు బదిలీ అయ్యాడు. విధుల్లో భాగంగా విశాఖ ఏజన్సీలో మావోయిస్టుల ఏరివేత కోసం కూంబింగ్ కు వెళ్లాడు. కూంబింగ్ పూర్తయిన తర్వాత హైదరాబాద్ తిరిగి వస్తున్న సమయంలో ఓబులేసుకు చెందిన ఏకే47 తుపాకీ విజయవాడలో మాయమైంది. అయితే అతను గన్ మిస్సయిన విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టాడు. అయితే ఆ తర్వాత ఏకే47 మిస్ అయినట్టు అధికారుల తనిఖీల్లో తేలింది. దాంతో ఈ విషయం బయటకు తెలిస్తే రచ్చరచ్చ అవుతుందని భావించిన పోలీస్ ఉన్నతాధికారులు... చడీచప్పుడు చేయకుండా ఓబులేసును అంబర్ పేట్ సీపీఎల్ కు బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు. అయితే అప్పటి నుంచే పక్కా పథకం వేసుకున్న ఓబులేసు ...బడా బాబులను కిడ్నాప్ చేసి కోట్ల రూపాయలు దండుకునేందుకు ప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగానే అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిని అపహరించేందుకు యత్నించి విఫలమై అడ్డంగా దొరికిపోయాడు. గతంలోనూ ఓబులేసు ...ఓ ఉన్నతాధికారిని కిడ్నాప్ చేసి రూ.10 లక్షలు వసూలు చేసి, విషయం బయటకు చెబితే ...హతమార్చుతానని ఆ అధికారిని బెదిరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులు రెండు కేసులపైనా విచారణ జరుపుతున్నారు. -
కేబీఆర్ పార్క్ కాల్పులు: నేడు మీడియా ముందుకు ఓబులేసు
-
కేబీఆర్ పార్క్ కాల్పుల ఘటనను చేధించిన పోలీసులు
అనంతపురం: కేబీఆర్ పార్క్ వద్ద అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డి పై జరిగిన కాల్పుల కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘనటనకు సంబంధించిన కానిస్టేబుల్ ఓబులేసును పోలీసులు అనంతపురంలో అదుపులోకి తీసుకున్నారు. ఓబులేసుతో పాటు మరో ముగ్గురి పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు . నిందితుడు ఓబులేసును ఇవాళ మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నారు. కాగా ఓబులేసు ప్రస్తుతం నాంపల్లి ఎక్సైజ్ శాఖలో విధులు నిర్వహిస్తున్నాడు. అతడు 15 రోజుల పాటు సెలవులో ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ అంబర్ పేటలోని సీపీఎస్ గ్రౌండ్ లో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఓబులేష్... మొదట కర్నూలు ఏపీఎస్పీ ఏఆర్ కానిస్టేబుల్ గా డిపార్ట్ మెంట్ లో చేరాడు. నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్ గ్రేహౌండ్స్ కు బదిలీ అయ్యాడు. గ్రేహౌండ్స్ విధుల్లో భాగంగా విశాఖ ఏజన్సీలో మావోయిస్టుల ఏరివేత కోసం కూంబింగ్ కు వెళ్లాడు. కూంబింగ్ పూర్తయిన తర్వాత హైదరాబాద్ తిరిగి వస్తున్న సమయంలో ఓబులేష్ కు చెందిన ఏకే47 తుపాకీ విజయవాడలో మాయమైంది. అయితే ఈ విషయాన్ని ఓబులేష్ ఉన్నతాధికారులకు తెలపలేదు. ఆ తర్వాత ఏకే47 మిస్ అయినట్టు అధికారుల తనిఖీల్లో తేలింది. ఈ విషయం బయటకు పొక్కితే రచ్చరచ్చ అవుతుందని భావించిన పోలీస్ ఉన్నతాధికారులు... చడీచప్పుడు చేయకుండా, ఓబులేష్ ను అంబర్ పేట్ సీపీఎల్ కు బదిలీ చేశారు. అనంతరం అతడిని ఎక్సైజ్ శాఖకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. -
'టాస్క్‌ఫోర్స్ పోలీసుల రాకపై సమాచారం లేదు'
అనంతపురం : అనంతపురానికి .... హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల రాకపై తమకు ఎలాంటి సమాచారం లేదని జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు తెలిపారు. కేబీఆర్ పార్క్ వద్ద అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులకు పాల్పడిన ఓబులేసును టాస్క్‌ఫోర్స్ పోలీసులు అనంతపురంలో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఎస్పీ మాట్లాడుతూ ఓబులేసును అదుపులోకి తీసుకున్నారో లేదో తమకు తెలియదని అన్నారు. మరోవైపు ఓబులేసును టాస్క్‌ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ తరలించారు. -
పార్కులో పేలిన తూటా
-
పార్కులో పేలిన తూటా
అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డి కిడ్నాప్‌నకు యత్నం కేబీఆర్ పార్కులో కలకలం కారులోకి దూరి ఏకే 47 తుపాకీతో బెదిరింపు ఘాతుకానికి పాల్పడింది ఏఆర్ కానిస్టేబుల్ ఓబులేసు నిత్యానందరెడ్డి సోదరుడు వచ్చి ప్రతిఘటించడంతో విచక్షణరహితంగా కాల్పులు.. కారు అద్దాల్లోకి 3, పైకప్పులోంచి 2 బుల్లెట్లు దూసుకెళ్లిన వైనం దొరికిపోతానని భావించి ఆయుధం, బ్యాగ్‌లను వదిలి పారిపోయిన కానిస్టేబుల్ 12 గంటల్లోనే నిందితుడిని గుర్తించిన పోలీసులు నిత్యానందరెడ్డికి పలువురు ప్రముఖుల పరామర్శ ఘటనపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన సాక్షి, హైదరాబాద్: బుధవారం ఉదయం 7.15.. బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు.. వాకింగ్‌కు వచ్చిన వారితో పార్కు సందడిగా ఉంది.. ఇంతలో ఒక్కసారిగా ధన్..ధన్..ధన్.. మంటూ కాల్పుల శబ్దం..! ఏం జరిగిందో తెలుసుకునేలోపే ఆ ప్రాంతమంతా తూటాల మోతతో దద్దరిల్లింది!! ఈ కాల్పులకు తెగబడింది ఓ కానిస్టేబుల్. అరబిందో ఫార్మా సంస్థ వైస్ చైర్మన్ కంభం నిత్యానందరెడ్డిని కిడ్నాప్ చేసేందుకు విఫలయత్నం చేసి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. సమయానికి నిత్యానందరెడ్డి సోదరుడు ప్రసాద్‌రెడ్డి వచ్చి ప్రతిఘటించడంతో.. ఆయన చేయి కొరికి, తుపాకీని అక్కడే వదిలేసి పారిపోయాడు. సంచలనం సృష్టించిన ఈ ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు సాగించారు. 12 గంట ల్లోనే నిందితుడిని గుర్తించారు. అతడు అంబర్‌పేటలోని స్టేట్ ఆర్మ్డ్ రిజర్వ్ సెంట్రల్ పోలీస్ లైన్(ఎస్ఏఆర్సీపీఎల్)లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఓబులేసుగా తేలింది. కాల్పులకు వాడిన ఏకే-47 రైఫిల్‌ను గతేడాదే ఇతడు అపహరించినట్లు వెల్లడైంది. అసలేం జరిగింది..? సరిగ్గా ఉదయం 6.15 గంటలకు అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ కంభం నిత్యానంద రెడ్డి కేబీఆర్ పార్క్‌కు వాకింగ్‌కు వచ్చారు. గంటపాటు వాకింగ్ చేసిన తర్వాత ఆయన పార్కు ప్రధాన గేటుకు 400 మీటర్ల దూరంలో పార్క్ చేసిన తన ఆడి కారు (ఏపీ 09సీఎం 2367) వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఫుట్‌పాత్‌పై ఓబులేసు ఆయన కోసం మాటువేశాడు. నిత్యానంద రెడ్డి కారు డోర్ తీసి డ్రైవర్ సీటులో కూర్చుని సీటు బెల్టు పెట్టుకుంటున్నారు. ఇంతలో కారు ఎడమ వైపు డోర్‌ను తీసుకొని భుజానికి పెద్ద బ్యాగు తగిలించుకున్న ఓబులేసు కారులోకి ప్రవేశించాడు. బ్యాగు నుంచి ఏకే 47 తీసి నిత్యానందరెడ్డికి గురిపెట్టాడు. ‘కారు ముందుకు పోనీ..’ అంటూ గద్దించాడు. ఒక్కసారిగా షాక్‌కు గురైన నిత్యానందరెడ్డి.. ‘ఎవరు నువ్వు.. డబ్బులు ఎంత కావాలన్నా ఇస్తా వెళ్లిపో..’ అని అన్నారు. అయినా అతడు కారును ముందుకు పోనీమంటూ రెట్టించాడు. ఈ సందర్భంగా నిత్యానందరెడ్డి ఓబులేష్‌ను గట్టిగా పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఇద్దరి పెనుగులాటలో కారు అటూఇటూ ఊగడాన్ని అప్పుడే వాకింగ్ ముగించుకొని వస్తున్న నిత్యానంద రెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి గమనించారు. వెంటనే ఎడమవైపున్న వెనక డోరు తీసుకొని కారులోకి ప్రవేశించాడు. ఓబులేష్ మెడను గట్టిగా పట్టుకున్నారు. ఈ పరిణామంతో బెదిరిపోయిన అతడు కాల్పులకు తెగబడ్డాడు. నిత్యానందరెడ్డి సోదరుడు తుపాకీ బ్యారల్‌ను పైకి లేపడంతో 3 తూటాలు కారు ముందున్న అద్దాలలోకి దూసుకుపోయాయి. మరో 2 బుల్లెట్లు కారు పైకప్పు లోంచి దూసుకుపోయాయి. కదలడానికి వీలు లేక పోడంతో ఇక దొరికి పోవడం ఖాయమని ఓబులేష్ భయపడ్డాడు. ప్రసాద్‌రెడ్డి రెండు చేతులను కొరికి విదిలించుకొని కారు డోర్ తీసుకొని అక్కడ్నుంచి పరారయ్యాడు. ఏకే 47 తుపాకీ, రెండు బ్యాగులను అక్కడే వదిలివేసి, అన్నపూర స్డూడియో రోడ్డు వైపు పారిపోయాడు. పట్టించిన రశీదు.. కాల్పుల సమాచారం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు 15 నిమిషాల తర్వాత ఘటనా స్థలికి చేరుకున్నారు. పోలీసు జాగిలాలు, క్లూస్ టీంలతో అణువణువూ గాలించి ఆధారాలు సేకరించారు. ఫోరెన్సిక్ నిపుణులు ఏకే 47 తుపాకీపై, కారు డోర్‌పైన వేలిముద్రలను సేకరించారు. ఓబులేష్‌కు చెందిన రెండు బ్యాగ్‌లను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కారు పరిసరాల్లో 8 బుల్లెట్ షెల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఓబులేష్ బ్యాగ్‌లో కొత్త బట్టలు, వాటిని కొనుగోలు చేసిన రశీదు, కూల్‌డ్రింక్స్ బాటిల్, లుంగీ తదితర వస్తువులు లభ్యమయ్యాయి. ఈ రశీదు ఆధారంగా రెండ్రోజుల క్రితం ఓబులేష్ మెహదీపట్నంలోని చందనా బ్రదర్స్‌లో బట్టలు ఖరీదు చేసినట్లు తేలింది. దీంతో పోలీసులు చందనాబ్రదర్స్కు వెళ్లి అతడు బట్టలు కొన్న రోజు నాటి సీసీటీవీ ఫుటేజ్‌లను నిశితంగా పరిశీలించారు. ఈ ఫుటేజ్‌లో అతని కదలికలు స్పష్టంగా కనిపించాయి. బట్టలు సెలెక్ట్ చేసుకోవడం, బిల్ కట్టడం, బయటికి వెళ్లే సమయంలో ఇలా మూడు సార్లు టీవీ కెమెరాల్లో అతడి దృశ్యాలు పోలీసులకు లభించాయి. ఈ దృశ్యాల్లో ఉన్న వ్యక్తి.. కాల్పులకు పాల్పడిన వ్యక్తి ఒకరేనని పోలీసులు నిర్ధారించుకున్నారు. చివరికి అతడు కానిస్టేబుల్ ఓబులేషే అని తేలింది. దీంతో అతడి ఇంటిపై బుధవారం అర్ధరాత్రి సోదాలు నిర్వహించారు. ఇంట్లో పలు కీలక పత్రాలు, వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఓబులేష్ తన స్వస్థలం అనంతపురానికి పారిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఓ ప్రత్యేక పోలీసు బృందం హుటాహుటినా అక్కడికి వెళ్లింది. అనంతపురంలో అతను పోలీసులకు చిక్కినట్లు సమాచారం. డబ్బు కోసమే... కిడ్నాప్ వ్యూహం ఓబులేష్ ఇంతకుముందు కూడా కేబీఆర్ పార్క్‌కు వచ్చె వీఐపీలపై గురిపెట్టాడు. ఇటీవలే ఇక్కడ్నుంచి ఓ ఉన్నతాధికారికి ఏకే-47 చూపించి కారులో కిడ్నాప్ చేశాడు. తర్వాత ఆయన నుంచి రూ.10 లక్షలు వసూలు కూడా చేశాడు. ఆ తర్వాత వదిలిపెట్టాడు. ఫిర్యాదు చేస్తే చంపేస్తామని ఆ అధికారిని బెదిరించాడు. ఈ ఘటనపై సదరు అధికారి ఫిర్యాదు చేయలేదు. ఈ నేపథ్యంలోనే బుధవారం నిత్యానంద రెడ్డి కిడ్నాప్‌నకు యత్నించాడు. అది వైజాగ్‌లో చోరీ చేసిన ఆయుధమే.. అనంతపురానికి చెందిన ఓబులేషు.. మొదట కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్‌లో రిజర్వ్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు. అక్కడ నాలుగేళ్లు పనిచేసిన తర్వాత గ్రేహౌండ్స్‌కు బదిలీ అయ్యాడు. గ్రేహౌండ్స్‌లో ఉన్న సమయంలో వైజాగ్‌కు నక్సల్స్ ఏరివేతకు వెళ్లిన బృందంలో ఇతను కూడా ఉన్నాడు. ఆ సమయంలోనే ఏఎస్ఐ రామారావుకు చెందిన ఏకే-47 ఆయుధం అదృశ్యమైంది. ఆ ఆయుధాన్ని ఓబులేషే దొంగిలించాడు. ఆయుధం మిస్ కావడంపై కేసు కూడా నమోదైంది. ఇది ఇంకా దర్యాప్తులోనే ఉంది. బుధవారం నాటి ఘటనలో లభించిన ఏకే-47, వైజాగ్ మిస్ అయిన ఆయుధం ఒకటేనని పోలీసులు నిర్ధారించారు. ఓబులేష్ గ్రేహౌండ్స్ నుంచి ఇటీవలే సీఏఆర్సీపీఎల్కు బదిలీ అయ్యాడు. ఇక్కడ విధులు నిర్వహిస్తునే తన వద్ద ఉన్న ఆయుధంతో నేరాలకు పథకం పన్నాడు. ఘటనపై అసెంబ్లీలో సీఎం ప్రకటన కేబీఆర్ పార్కులో కాల్పుల ఉదంతం అసెంబ్లీలో కూడా ప్రస్తావనకు వచ్చింది. దీనిపై ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి ప్రశ్నించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్రకటన చేశారు. ‘‘పార్కులో వాకింగ్ ముగించుకొని వస్తున్న అరబిందో ఉపాధ్యక్షుడు నిత్యానందరెడ్డిని డబ్బు కోసం అగంతకుడు రైఫిల్‌తో బెదిరించగా, జరిగిన పెనుగులాటలో అగంతకుని చేతిలో ఉన్న ఏకే 47 రైఫిల్ పేలి బుల్లెట్లు కారు అద్దంలోంచి దూసుకు పోయాయి’’ సభకు తెలిపారు. దుండగుడు వదిలి వెళ్లిన ఏకే-47 రైఫిల్ గతేడాది డిసెంబరులో గ్రేహాండ్స్ విభాగంలో చోరి అయినట్లుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. అంతకుముందు కాల్పులపై సీఎం ప్రకటన చేయాలని ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి సభలో డిమాండ్ చేశారు. ప్రముఖుల పరామర్శ.. కాల్పుల ఘటన తెలియగానే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. నిత్యానందరెడ్డిని ఫోన్లో పరామర్శించారు. సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నిత్యానందరెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి కూడా ఆయన నివాసానికి వెళ్లారు. నాకు ఎవరితో శత్రుత్వం లేదు: నిత్యానందరెడ్డి 30-35 ఏళ్ల మధ్య ఉన్న వ్యక్తి నాపై కాల్పులు జరిపాడు. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానని చెప్పాను. అయినా వినిపించుకోలేదు. నాకు ఎవరిపైనా శత్రుత్వం లేదు. ఈ ఆయుధం అదే..: కమిషనర్ ఓబులేషు ఉపయోగించిన ఏకే 47 గతేడాది డిసెంబర్లో గ్రేహౌండ్స్ విభాగం నుంచి మిస్సైనదేనని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి తెలిపారు. దీనిపై గ్రేహౌండ్స్ అసిస్టెంట్ కమాండెంట్ శ్రీనివాస్ ఈ ఏడాది ఫిబ్రవరి 3న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు వివరించారు. -
నిందితుడి ఊహాచిత్రం విడుదల
హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద బుధవారం ఉదయం అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులు జరిపిన నిందితుడి ఊహా చిత్రాన్ని వెస్ట్ జోన్ పోలీసులు విడుదల చేశారు. నిందితుడు వదిలి వెళ్లిన బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మెహిదీపట్నంలోని ఓ సూపర్ మార్కెట్లో సరుకులు కొన్నాడు. బ్యాగులో దొరికిన బిల్లు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత నెల 13న సూపర్ మార్కెట్లో అగంతకుడు వస్తువులు కొన్నాడు. అక్కడి సిసి కెమెరాల పుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ పుటేజ్‌లను పోలీసులు నిత్యానందరెడ్డికి చూపించారు. ** -
కాల్పుల ఘటన నిందితుని ఉహాచిత్రం విడుదల
-
కాల్పుల నిందితుడికి సూపర్‌మార్కెట్ లింకు?
కేబీర్ పార్కులో కలకలం సృష్టించిన కాల్పుల కేసులో నిందితుడు మెహిదీపట్నం ప్రాంతంలోని ఓ సూపర్ మార్కెట్లో సరుకులు కొన్నట్లు పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలంలో అతడు వదిలి వెళ్లిన బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బ్యాగులో దొరికిన బిల్లు ఆధారంగా.. గతనెల 13వ తేదీన హైదరాబాద్‌లోని మెహిదీపట్నం ప్రాంతంలో గల ఓ సూపర్మార్కెట్లో అతడు సరుకులు కొన్నట్లు రుజువైంది. దాంతో అక్కడి సీసీటీవీ ఫుటేజిని పోలీసులు పరిశీలించారు. ఆ ఫుటేజిని అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డికి కూడా చూపించారు. నిందితుడిని ఆయన సమీపం నుంచి చూసినందున.. గుర్తించే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
'హైదరాబాద్ పోలీసుల వైఫల్యం వల్లే కాల్పులు'
అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పుల ఘటనకు హైదరాబాద్ పోలీసుల వైఫల్యమే కారణమని సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. అసలు గ్రేహౌండ్స్ బలగాల నుంచి ఒక ఏకే 47 తుపాకి అదృశ్యమైనా ఇంతవరకు ఎందుకు పట్టించుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూరుస్తున్నారన్నారు. కేంద్రంలో ఆర్ఎస్ఎస్ జోక్యం ఎక్కువవుతోందని, టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ ప్రయత్నిస్తోందని నారాయణ చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు నెరవేర్చడం లేదని ఆయన నిలదీశారు. -
ఇంతకీ ఆగంతకుడి టార్గెట్ ఏంటి?
అతడి వద్ద ఏకే 47 లాంటి అత్యంత శక్తిమంతమైన ఆయుధం ఉంది. దాంతో ఒకటి కాదు, రెండు కాదు.. 8 రౌండ్లు కాల్పులు జరిపాడు. అయితే అదృష్టవశాత్తు అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డికి ఏ ప్రమాదం జరగలేదు. ఏకే 47 అంటే చిన్నా చితకా తుపాకి కాదు.. దాన్ని కారులో పెట్టుకుని.. అవతలి వ్యక్తి మీద కాల్పులు జరపడం అంత సులభం కాదు. అలా కాల్చాలనుకుంటే రివాల్వర్ లాంటి చిన్న ఆయుధం తీసుకెళ్లేవాడు. కానీ.. చేతిలో ఏకే 47 పెట్టుకుని కారులో ఏం చేద్దామనుకున్నాడు? అసలు అతడి టార్గెట్ ఏంటి.. నిత్యానందరెడ్డిని అంతం చేయడమా.. అపహరించడమా.. లేక ఉత్తినే బెదిరించడమా? వివరాల్లోకి వెళితే ప్రశాంతమైన హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద ఈ ఉదయం కాల్పుల కలకలం రేగింది. మార్నింగ్ వాక్ ముగించుకుని, ఆడి కారులో కూర్చుని ఉన్న అరబిందో ఫార్మా వైస్‌చైర్మన్ నిత్యానందరెడ్డిపై ఆగంతకుడు 8 రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం వేడెక్కింది. ఈలోగా ... నిత్యానంతరెడ్డితో పాటే కారులో ఉన్న అతడి సోదరుడు ప్రసాద్‌రెడ్డి ఆగంతకుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కాసేపు ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. ఎలాగైనా తప్పించుకోవాలనుకున్న ఆగంతకుడు, ప్రసాద్‌రెడ్డి చెయ్యి కొరికి పారిపోయాడు. ఈ హడావుడిలో ఏకే 47ను, వెంట తెచ్చుకున్న బ్యాగును కారులోనే వదిలి పరారయ్యాడు. సంఘటన తర్వాత సాక్షితో మాట్లాడిన నిత్యానందరెడ్డి .. తనను చంపాల్సిన అవసరం ఎవ్వరికీ లేదని, తనకు ఎవ్వరిపై అనుమానం లేదని చెప్పారు. తాను కారు డ్రైవింగ్ సీట్లో కూర్చోగానే ఫ్రంట్ డోర్ తెరచి లోనికి వచ్చిన దుండగుడు గుండెపై గన్ పెట్టి కారును స్టార్ట్ చేయమని డిమాండ్ చేశాడని అన్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తుపడతానన్న ఆయన అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నట్లు తెలిపారు. ఈ కాల్పుల్లో ఎవ్వరికీ గాయాలు కాలేదు. ప్రశాంతమైన పార్క్ సమీపంలో కాల్పులు జరగడంతో .. మార్నింగ్ వాకర్స్ భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి, వెస్ట్ జోన్ డిసీపీ వెంకటేశ్వరరావు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. మరోవైపు నిత్యానందరెడ్డిపై కాల్పుల ఘటనలో ఆగంతకుడు వాడిన ఏకే 47 ఎక్కడిదో తెలిసిపోయింది. గ్రేహౌండ్స్ ఏఎస్ఐ రాజరాజు వద్ద నుంచి మిస్ అయిన గన్‌గా పోలీసులు గుర్తించారు. గత ఏడాది డిసెంబర్ 26న గ్రేహౌండ్స్‌లో కనిపించకుండా పోయిన ఏకే 47...కేబీఆర్ పార్క్‌లో నిత్యానందరెడ్డిపై కాల్పులకు వినియోగించినట్టు తేలింది. రామరాజు వైజాగ్ నుంచి గండిపేటకు వస్తుండగా.. గన్ మిస్సైనట్లు గ్రేహౌండ్స్ కమాండర్ శ్రీనివాసరావు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. అదే గన్‌తో ఆగంతకుడు కేబీఆర్ పార్కులో కాల్పులు జరపడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా కాల్పుల ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు 307, 363 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఈ సంఘటనపై తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ ప్రకటన చేశారు. నిందితుడిని పట్టుకోడానికి మూడు ప్రత్యేక బృందాలను నియమించామని, నగరంలో శాంతిభద్రతలను కాపాడేందుకు అనుక్షణం కృషి చేస్తామని ఆయన చెప్పారు. -
కాల్పుల ఘటనపై అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన
హైదరాబాద్ : కేబీఆర్ పార్క్ కాల్పుల ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం శాసనసభలో ప్రకటన చేశారు. 'మార్నింగ్ వాక్‌లో భాగంగా అరబిందో వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డి పార్కుకు వెళ్లారు. ఉదయం 7.15 గంటలకు నిత్యానందరెడ్డి కారు ఎక్కారు. అదే సమయంలో మరో డోరు నుంచి ఏకే 47 తుపాకీతో ఆగంతకుడు కారులోకి ప్రవేశించాడు. తుపాకీతో బెదిరించి డబ్బు డిమాండ్ చేశాడు. నిత్యానందరెడ్డి ఆగంతకుడిని ప్రతిఘటించారు. తుపాకీని చేతితో పక్కకు తోశారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. అప్పుడే ఏకే 47 పేలి కారు ముందు అద్దం నుంచి బుల్లెట్లు దూసుకెళ్లాయి. కారు బాడీలోకి కూడా ఓ బుల్లెట్ దూసుకెళ్లింది. ఇది నిత్యానందరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి గమనించారు. ఆగంతకుడిని పట్టుకోవడానికి ట్రై చేశారు. ఆగంతకుడు ప్రసాద్ రెడ్డి చేతిని కొరికి పారిపోయాడు. సంఘటనా స్థలంలోనే ఏకే 47, బ్యాగు వదిలి పరారయ్యాడు. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో 307,363 సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. కాల్పుల ఘటనలో ఎవ్వరికీ గాయాలు కాలేదు. కాల్పులకు వాడిన ఏకే 47 గ్రేహౌండ్స్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. గతేడాది డిసెంబర్ 26న తుపాకీని దొంగిలించినట్లుగా నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదయ్యింది. కేసు ఛేదించడానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.' అని కేసీఆర్ సభలో వెల్లడించారు. కాగా కేబీఆర్ పార్క్ వద్ద నిత్యానందరెడ్డిపై ఆగంతకుడు కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. -
AK 47 పార్క్
-
కేబీఆర్ పార్క్ కాల్పుల ఘటన దురదృష్టకరం: కేసీఆర్
-
నిత్యానందరెడ్డి నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు
-
కేబీఆర్ పార్క్ కాల్పుల ఘటన దురదృష్టకరం: కేసీఆర్
హైదరాబాద్ : బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద జరిగిన కాల్పుల ఘటనను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖండించారు. కాల్పుల ఘటన దురదృష్టకరమని ఆయన అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన బుధవారం మాట్లాడుతూ ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు జరుతున్నారన్నారు. రాష్ట్రంలో శాంతి,భద్రతలపై గురువారం సభలో చర్చ పెట్టాలని కేసీఆర్ అన్నారు. కాల్పుల ఘటనపై సభలో ప్రకటన చేస్తామని కేసీఆర్ తెలిపారు. అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై ఈరోజు ఉదయం ఆగంతకుడు ఏకే 47తో కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. -
నిత్యానందరెడ్డితో ఫోన్ లో మాట్లాడిన వైఎస్ జగన్
హైదరాబాద్ : తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డికి వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఫోన్ చేశారు. ఆయన క్షేమ సమాచారంతో పాటు, సంఘటనా వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ...నిత్యానందరెడ్డిని పరామర్శించారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ ఘటనపై తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేస్తామని తెలిపారు. బుధవారం ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద ఆగంతకుడు ....నిత్యానందరెడ్డిపై కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. -
నగరం నడిబొడ్డున కాల్పులు
-
నిత్యానందరెడ్డిపై కాల్పుల వ్యవహారంలో కొత్తకోణం
హైదరాబాద్ : అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డి కాల్పుల వ్యవహారంలో కొత్తకోణం వెలుగు చూసింది. ఆగంతకుడు కాల్పులు జరిపిన ఏకే 47 ...గత ఏడాది చోరీకి గురైనట్లు తెలుస్తోంది. కాగా హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి బుధవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దుండగుడు ఏకే 47 ఉపయోగించాడని... ఆ గన్... ఏడాది క్రితం గ్రేహౌండ్స్ పోలీసుల వద్ద చోరీకి గురైనట్లు తెలిపారు. సాయంత్రంలోగా కేసును ఛేదిస్తామని సీపీ వెల్లడించారు. కాగా ఏకె 47 చోరీకి గురైనట్లు గ్రేహౌండ్స్ కమాండర్ శ్రీనివాస్ గత ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. అదే గన్ను ఆగంతకుడు కాల్పులకు ఉపయోగించినట్లు తెలుస్తోంది. -
నిత్యానందరెడ్డి నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు
హైదరాబాద్ : అరబిందో ఫార్మా వైస్ ఛైర్మన్ నిత్యానందరెడ్డి నుంచి కాల్పుల ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు బుధవారం ఆయనను కలిసి వివరాలు తెలుసుకున్నారు. నిత్యానందరెడ్డి మాట్లాడుతూ 'నేను కారులో కూర్చోగానే ఫ్రంట్ డోర్ ద్వారా వచ్చిన ఆగంతకుడు నా గుండెపై గన్ గురి పెట్టి స్టార్ట్ ది కార్ అన్నాడు. నేను వెంటనే గన్ బారెల్ను పైకి లేపాను...అతను వెంటనే పైకి కాల్పులు జరిపాడు. అదే సమయంలో నా వద్ద ఉన్న పిస్టల్ తీసి కాల్పులకు ప్రయత్నించాను. కొద్దిదూరంలో ఉన్న నా సోదరుడు ప్రసాద్‌రెడ్డి వచ్చి ఆగంతకుడిని వెనకనుంచి పట్టుకున్నాడు. మా తమ్ముడి చెయ్యి కొరికి ఆగంతకుడు పరారయ్యాడు. సమీపంలో ఉన్న వాకర్స్ చేరుకోవడంతో ఆగంతకుడు ఏకే 47 గన్, బ్యాగు వదిలేసి వెళ్లాడు. నన్ను చంపాల్సిన అవసరం ఎవరికి లేదు...నాకు ఎవరిపైనా అనుమానం లేదు' అన్నారు. కాగా అంతకు ముందు డీసీపీ వెంకటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేబీఆర్ పార్క్ వద్ద నిత్యానందరెడ్డిపై గుర్తు తెలియని ఆగంతకుడు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. -
కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తుపడతా: నిత్యానందరెడ్డి
-
కేబీఆర్ పార్క్ లో కాల్పుల కలకలం
-
కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తుపడతా: నిత్యానందరెడ్డి
హైదరాబాద్ : తనపై కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తుపడతానని అరబిందో ఫార్మా వైస్ ప్రెసిడెంట్ నిత్యానందరెడ్డి తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తి 5.3 అడుగుల ఎత్తు ఉన్నాడని, తాను కారు వద్దకు వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చోగానే తనపై దుండగుడు కాల్పులకు యత్నించినట్లు ఆయన చెప్పారు.న ప్రాణాపాయం నుంచి తృటిలో బయటపడ్డానని నిత్యానందరెడ్డి తెలిపారు. తనకు ఎవరితో విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఆగంతకుడు ఎనిమిది రౌండ్ల కాల్పులు జరిపినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే బుధవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో మార్నింగ్ వాక్ ముగించుకుని ఆడి కారులో కూర్చుంటున్న సమయంలో ఆగంతకుడు కాల్పులకు యత్నించాడు. దాంతో అప్రమత్తమైన ఆయన తన వద్ద ఉన్న పిస్టల్‌ను బయటికి తీసేందుకు ప్రయత్నించారు. ఏకె 47ను గురిపెట్టి కారును స్టార్ట్ చేయాలని డిమాండ్ చేశాడు. ఈలోగా ... ఆయనతో పాటే ఉన్న నిత్యానందరెడ్డి సోదరుడు ప్రసాద్‌రెడ్డి ఆగంతకుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కాసేపు వారిమధ్య పెనుగులాట జరిగింది. అయితే ఎలాగైనా తప్పించుకోవాలనుకున్న ఆగంతకుడు, ప్రసాద్‌రెడ్డి చెయ్యిని కొరికి పారిపోయాడు. హడావుడిలో ఏకె 47ను, వెంట తెచ్చుకున్న బ్యాగును ఆగంతకుడు కారులోనే వదిలి పరారయ్యాడు. ఈ కాల్పుల్లో ఎవ్వరికీ గాయాలు కాలేదు. ప్రశాంతమైన పార్క్ సమీపంలో కాల్పులు జరగడంతో .. మార్నింగ్ వాకర్స్ భయాందోళనకు గురయ్యారు. సంఘటనాస్థలాన్ని వెస్ట్ జోన్ డిసిపి వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఘటనా స్థలంలో 8 బులెట్లను స్వాధీనం చేసుకున్నారు. -
అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులు
హైదరాబాద్ : బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద బుధవారం కాల్పుల ఘటన కలకలం రేపింది. అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై ఆగంతకుడు కాల్పులు జరిపాడు. మార్నింగ్ వాక్ పూర్తి చేసుకుని, కారు ఎక్కుతున్న ఆయనపై ఏకె 47తో దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. అయితే వెంటనే తేరుకున్ననిత్యానందరెడ్డి... అతనిపై ఎదురు కాల్పులు జరిపినట్లు సమాచారం. కాగా 15 రౌండ్ల మేర కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షుల సమాచారం. అనంతరం తుపాకీ వదిలేసి పరారైనట్లు తెలుస్తోంది. కాగా ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. ఒక్కసారిగా కాల్పులతో పార్క్‌కు వాకింగ్‌కు వచ్చిన వాకర్స్ ఈ ఘటనతో భయాందోళనలకు గురయ్యారు. కాల్పుల ఘటనపై ప్రత్యక్ష సాక్షులు ...పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు నిత్యానందరెడ్డిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.