
కేబీఆర్ పార్క్ కాల్పుల ఘటనను చేధించిన పోలీసులు
కేబీఆర్ పార్క్ వద్ద అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డి పై జరిగిన కాల్పుల కేసును పోలీసులు ఛేదించారు.
అనంతపురం: కేబీఆర్ పార్క్ వద్ద అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డి పై జరిగిన కాల్పుల కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘనటనకు సంబంధించిన కానిస్టేబుల్ ఓబులేసును పోలీసులు అనంతపురంలో అదుపులోకి తీసుకున్నారు. ఓబులేసుతో పాటు మరో ముగ్గురి పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు . నిందితుడు ఓబులేసును ఇవాళ మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నారు. కాగా ఓబులేసు ప్రస్తుతం నాంపల్లి ఎక్సైజ్ శాఖలో విధులు నిర్వహిస్తున్నాడు. అతడు 15 రోజుల పాటు సెలవులో ఉన్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ అంబర్ పేటలోని సీపీఎస్ గ్రౌండ్ లో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఓబులేష్... మొదట కర్నూలు ఏపీఎస్పీ ఏఆర్ కానిస్టేబుల్ గా డిపార్ట్ మెంట్ లో చేరాడు. నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్ గ్రేహౌండ్స్ కు బదిలీ అయ్యాడు. గ్రేహౌండ్స్ విధుల్లో భాగంగా విశాఖ ఏజన్సీలో మావోయిస్టుల ఏరివేత కోసం కూంబింగ్ కు వెళ్లాడు.
కూంబింగ్ పూర్తయిన తర్వాత హైదరాబాద్ తిరిగి వస్తున్న సమయంలో ఓబులేష్ కు చెందిన ఏకే47 తుపాకీ విజయవాడలో మాయమైంది. అయితే ఈ విషయాన్ని ఓబులేష్ ఉన్నతాధికారులకు తెలపలేదు. ఆ తర్వాత ఏకే47 మిస్ అయినట్టు అధికారుల తనిఖీల్లో తేలింది. ఈ విషయం బయటకు పొక్కితే రచ్చరచ్చ అవుతుందని భావించిన పోలీస్ ఉన్నతాధికారులు... చడీచప్పుడు చేయకుండా, ఓబులేష్ ను అంబర్ పేట్ సీపీఎల్ కు బదిలీ చేశారు. అనంతరం అతడిని ఎక్సైజ్ శాఖకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది.