అనంతపురానికి .... హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసుల రాకపై తమకు ఎలాంటి సమాచారం లేదని జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు తెలిపారు.
అనంతపురం : అనంతపురానికి .... హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసుల రాకపై తమకు ఎలాంటి సమాచారం లేదని జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు తెలిపారు. కేబీఆర్ పార్క్ వద్ద అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులకు పాల్పడిన ఓబులేసును టాస్క్ఫోర్స్ పోలీసులు అనంతపురంలో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఎస్పీ మాట్లాడుతూ ఓబులేసును అదుపులోకి తీసుకున్నారో లేదో తమకు తెలియదని అన్నారు. మరోవైపు ఓబులేసును టాస్క్ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ తరలించారు.