'కాల్పులు జరిపింది ఎవరో గుర్తించాం' | KBR Park firing case: police identifies shooter | Sakshi
Sakshi News home page

'కాల్పులు జరిపింది ఎవరో గుర్తించాం'

Published Thu, Nov 20 2014 1:46 PM | Last Updated on Tue, Oct 2 2018 2:30 PM

'కాల్పులు జరిపింది ఎవరో గుర్తించాం' - Sakshi

'కాల్పులు జరిపింది ఎవరో గుర్తించాం'

హైదరాబాద్ : కేబీఆర్ పార్క్ వద్ద కాల్పుల ఘటన కేసులో నిందితుడి అరెస్ట్ను పోలీసులు ఇప్పటివరకూ ధ్రువీకరించలేదు. అయితే దర్యాప్తు కొనసాగుతోందని, కాల్పులకు తెగబడింది ఎవరో గుర్తించినట్లు పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై నిన్న ఉదయం ఓ ఆగంతకుడు కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే.

కాగా ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న ఫొటోలు నిందితుడివి కావని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు కానిస్టేబుల్ ఓబులేసు కుటుంబ సభ్యులు డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. మీడియాలో తప్పుడు ఫొటోలను ప్రసారం చేస్తున్నారంటూ ఉన్నతాధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అసలు తన కొడుకుతో తనకు రెండేళ్లుగా సంబంధాలు లేవని ఓబులేసు తండ్రి మైఖేల్ ఇంతకుముందు చెప్పిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement