
అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులు
హైదరాబాద్ : బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద బుధవారం కాల్పుల ఘటన కలకలం రేపింది. అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై ఆగంతకుడు కాల్పులు జరిపాడు. మార్నింగ్ వాక్ పూర్తి చేసుకుని, కారు ఎక్కుతున్న ఆయనపై ఏకె 47తో దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. అయితే వెంటనే తేరుకున్ననిత్యానందరెడ్డి... అతనిపై ఎదురు కాల్పులు జరిపినట్లు సమాచారం. కాగా 15 రౌండ్ల మేర కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షుల సమాచారం. అనంతరం తుపాకీ వదిలేసి పరారైనట్లు తెలుస్తోంది.
కాగా ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. ఒక్కసారిగా కాల్పులతో పార్క్కు వాకింగ్కు వచ్చిన వాకర్స్ ఈ ఘటనతో భయాందోళనలకు గురయ్యారు. కాల్పుల ఘటనపై ప్రత్యక్ష సాక్షులు ...పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు నిత్యానందరెడ్డిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.