Aurobindo Pharma vice president
-
కాల్పుల నిందితుడికి సూపర్‌మార్కెట్ లింకు?
కేబీర్ పార్కులో కలకలం సృష్టించిన కాల్పుల కేసులో నిందితుడు మెహిదీపట్నం ప్రాంతంలోని ఓ సూపర్ మార్కెట్లో సరుకులు కొన్నట్లు పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలంలో అతడు వదిలి వెళ్లిన బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బ్యాగులో దొరికిన బిల్లు ఆధారంగా.. గతనెల 13వ తేదీన హైదరాబాద్‌లోని మెహిదీపట్నం ప్రాంతంలో గల ఓ సూపర్మార్కెట్లో అతడు సరుకులు కొన్నట్లు రుజువైంది. దాంతో అక్కడి సీసీటీవీ ఫుటేజిని పోలీసులు పరిశీలించారు. ఆ ఫుటేజిని అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డికి కూడా చూపించారు. నిందితుడిని ఆయన సమీపం నుంచి చూసినందున.. గుర్తించే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
'హైదరాబాద్ పోలీసుల వైఫల్యం వల్లే కాల్పులు'
అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పుల ఘటనకు హైదరాబాద్ పోలీసుల వైఫల్యమే కారణమని సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. అసలు గ్రేహౌండ్స్ బలగాల నుంచి ఒక ఏకే 47 తుపాకి అదృశ్యమైనా ఇంతవరకు ఎందుకు పట్టించుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూరుస్తున్నారన్నారు. కేంద్రంలో ఆర్ఎస్ఎస్ జోక్యం ఎక్కువవుతోందని, టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ ప్రయత్నిస్తోందని నారాయణ చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు నెరవేర్చడం లేదని ఆయన నిలదీశారు. -
ఇంతకీ ఆగంతకుడి టార్గెట్ ఏంటి?
అతడి వద్ద ఏకే 47 లాంటి అత్యంత శక్తిమంతమైన ఆయుధం ఉంది. దాంతో ఒకటి కాదు, రెండు కాదు.. 8 రౌండ్లు కాల్పులు జరిపాడు. అయితే అదృష్టవశాత్తు అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డికి ఏ ప్రమాదం జరగలేదు. ఏకే 47 అంటే చిన్నా చితకా తుపాకి కాదు.. దాన్ని కారులో పెట్టుకుని.. అవతలి వ్యక్తి మీద కాల్పులు జరపడం అంత సులభం కాదు. అలా కాల్చాలనుకుంటే రివాల్వర్ లాంటి చిన్న ఆయుధం తీసుకెళ్లేవాడు. కానీ.. చేతిలో ఏకే 47 పెట్టుకుని కారులో ఏం చేద్దామనుకున్నాడు? అసలు అతడి టార్గెట్ ఏంటి.. నిత్యానందరెడ్డిని అంతం చేయడమా.. అపహరించడమా.. లేక ఉత్తినే బెదిరించడమా? వివరాల్లోకి వెళితే ప్రశాంతమైన హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద ఈ ఉదయం కాల్పుల కలకలం రేగింది. మార్నింగ్ వాక్ ముగించుకుని, ఆడి కారులో కూర్చుని ఉన్న అరబిందో ఫార్మా వైస్‌చైర్మన్ నిత్యానందరెడ్డిపై ఆగంతకుడు 8 రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం వేడెక్కింది. ఈలోగా ... నిత్యానంతరెడ్డితో పాటే కారులో ఉన్న అతడి సోదరుడు ప్రసాద్‌రెడ్డి ఆగంతకుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కాసేపు ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. ఎలాగైనా తప్పించుకోవాలనుకున్న ఆగంతకుడు, ప్రసాద్‌రెడ్డి చెయ్యి కొరికి పారిపోయాడు. ఈ హడావుడిలో ఏకే 47ను, వెంట తెచ్చుకున్న బ్యాగును కారులోనే వదిలి పరారయ్యాడు. సంఘటన తర్వాత సాక్షితో మాట్లాడిన నిత్యానందరెడ్డి .. తనను చంపాల్సిన అవసరం ఎవ్వరికీ లేదని, తనకు ఎవ్వరిపై అనుమానం లేదని చెప్పారు. తాను కారు డ్రైవింగ్ సీట్లో కూర్చోగానే ఫ్రంట్ డోర్ తెరచి లోనికి వచ్చిన దుండగుడు గుండెపై గన్ పెట్టి కారును స్టార్ట్ చేయమని డిమాండ్ చేశాడని అన్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తుపడతానన్న ఆయన అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నట్లు తెలిపారు. ఈ కాల్పుల్లో ఎవ్వరికీ గాయాలు కాలేదు. ప్రశాంతమైన పార్క్ సమీపంలో కాల్పులు జరగడంతో .. మార్నింగ్ వాకర్స్ భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి, వెస్ట్ జోన్ డిసీపీ వెంకటేశ్వరరావు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. మరోవైపు నిత్యానందరెడ్డిపై కాల్పుల ఘటనలో ఆగంతకుడు వాడిన ఏకే 47 ఎక్కడిదో తెలిసిపోయింది. గ్రేహౌండ్స్ ఏఎస్ఐ రాజరాజు వద్ద నుంచి మిస్ అయిన గన్‌గా పోలీసులు గుర్తించారు. గత ఏడాది డిసెంబర్ 26న గ్రేహౌండ్స్‌లో కనిపించకుండా పోయిన ఏకే 47...కేబీఆర్ పార్క్‌లో నిత్యానందరెడ్డిపై కాల్పులకు వినియోగించినట్టు తేలింది. రామరాజు వైజాగ్ నుంచి గండిపేటకు వస్తుండగా.. గన్ మిస్సైనట్లు గ్రేహౌండ్స్ కమాండర్ శ్రీనివాసరావు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. అదే గన్‌తో ఆగంతకుడు కేబీఆర్ పార్కులో కాల్పులు జరపడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా కాల్పుల ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు 307, 363 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఈ సంఘటనపై తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ ప్రకటన చేశారు. నిందితుడిని పట్టుకోడానికి మూడు ప్రత్యేక బృందాలను నియమించామని, నగరంలో శాంతిభద్రతలను కాపాడేందుకు అనుక్షణం కృషి చేస్తామని ఆయన చెప్పారు. -
కాల్పుల ఘటనపై అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన
హైదరాబాద్ : కేబీఆర్ పార్క్ కాల్పుల ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం శాసనసభలో ప్రకటన చేశారు. 'మార్నింగ్ వాక్‌లో భాగంగా అరబిందో వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డి పార్కుకు వెళ్లారు. ఉదయం 7.15 గంటలకు నిత్యానందరెడ్డి కారు ఎక్కారు. అదే సమయంలో మరో డోరు నుంచి ఏకే 47 తుపాకీతో ఆగంతకుడు కారులోకి ప్రవేశించాడు. తుపాకీతో బెదిరించి డబ్బు డిమాండ్ చేశాడు. నిత్యానందరెడ్డి ఆగంతకుడిని ప్రతిఘటించారు. తుపాకీని చేతితో పక్కకు తోశారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. అప్పుడే ఏకే 47 పేలి కారు ముందు అద్దం నుంచి బుల్లెట్లు దూసుకెళ్లాయి. కారు బాడీలోకి కూడా ఓ బుల్లెట్ దూసుకెళ్లింది. ఇది నిత్యానందరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి గమనించారు. ఆగంతకుడిని పట్టుకోవడానికి ట్రై చేశారు. ఆగంతకుడు ప్రసాద్ రెడ్డి చేతిని కొరికి పారిపోయాడు. సంఘటనా స్థలంలోనే ఏకే 47, బ్యాగు వదిలి పరారయ్యాడు. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో 307,363 సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. కాల్పుల ఘటనలో ఎవ్వరికీ గాయాలు కాలేదు. కాల్పులకు వాడిన ఏకే 47 గ్రేహౌండ్స్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. గతేడాది డిసెంబర్ 26న తుపాకీని దొంగిలించినట్లుగా నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదయ్యింది. కేసు ఛేదించడానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.' అని కేసీఆర్ సభలో వెల్లడించారు. కాగా కేబీఆర్ పార్క్ వద్ద నిత్యానందరెడ్డిపై ఆగంతకుడు కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. -
AK 47 పార్క్
-
కేబీఆర్ పార్క్ కాల్పుల ఘటన దురదృష్టకరం: కేసీఆర్
-
నిత్యానందరెడ్డి నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు
-
కేబీఆర్ పార్క్ కాల్పుల ఘటన దురదృష్టకరం: కేసీఆర్
హైదరాబాద్ : బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద జరిగిన కాల్పుల ఘటనను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖండించారు. కాల్పుల ఘటన దురదృష్టకరమని ఆయన అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన బుధవారం మాట్లాడుతూ ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు జరుతున్నారన్నారు. రాష్ట్రంలో శాంతి,భద్రతలపై గురువారం సభలో చర్చ పెట్టాలని కేసీఆర్ అన్నారు. కాల్పుల ఘటనపై సభలో ప్రకటన చేస్తామని కేసీఆర్ తెలిపారు. అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై ఈరోజు ఉదయం ఆగంతకుడు ఏకే 47తో కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. -
నిత్యానందరెడ్డితో ఫోన్ లో మాట్లాడిన వైఎస్ జగన్
హైదరాబాద్ : తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డికి వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఫోన్ చేశారు. ఆయన క్షేమ సమాచారంతో పాటు, సంఘటనా వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ...నిత్యానందరెడ్డిని పరామర్శించారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ ఘటనపై తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేస్తామని తెలిపారు. బుధవారం ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద ఆగంతకుడు ....నిత్యానందరెడ్డిపై కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. -
నగరం నడిబొడ్డున కాల్పులు
-
నిత్యానందరెడ్డిపై కాల్పుల వ్యవహారంలో కొత్తకోణం
హైదరాబాద్ : అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డి కాల్పుల వ్యవహారంలో కొత్తకోణం వెలుగు చూసింది. ఆగంతకుడు కాల్పులు జరిపిన ఏకే 47 ...గత ఏడాది చోరీకి గురైనట్లు తెలుస్తోంది. కాగా హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి బుధవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దుండగుడు ఏకే 47 ఉపయోగించాడని... ఆ గన్... ఏడాది క్రితం గ్రేహౌండ్స్ పోలీసుల వద్ద చోరీకి గురైనట్లు తెలిపారు. సాయంత్రంలోగా కేసును ఛేదిస్తామని సీపీ వెల్లడించారు. కాగా ఏకె 47 చోరీకి గురైనట్లు గ్రేహౌండ్స్ కమాండర్ శ్రీనివాస్ గత ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. అదే గన్ను ఆగంతకుడు కాల్పులకు ఉపయోగించినట్లు తెలుస్తోంది. -
నిత్యానందరెడ్డి నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు
హైదరాబాద్ : అరబిందో ఫార్మా వైస్ ఛైర్మన్ నిత్యానందరెడ్డి నుంచి కాల్పుల ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు బుధవారం ఆయనను కలిసి వివరాలు తెలుసుకున్నారు. నిత్యానందరెడ్డి మాట్లాడుతూ 'నేను కారులో కూర్చోగానే ఫ్రంట్ డోర్ ద్వారా వచ్చిన ఆగంతకుడు నా గుండెపై గన్ గురి పెట్టి స్టార్ట్ ది కార్ అన్నాడు. నేను వెంటనే గన్ బారెల్ను పైకి లేపాను...అతను వెంటనే పైకి కాల్పులు జరిపాడు. అదే సమయంలో నా వద్ద ఉన్న పిస్టల్ తీసి కాల్పులకు ప్రయత్నించాను. కొద్దిదూరంలో ఉన్న నా సోదరుడు ప్రసాద్‌రెడ్డి వచ్చి ఆగంతకుడిని వెనకనుంచి పట్టుకున్నాడు. మా తమ్ముడి చెయ్యి కొరికి ఆగంతకుడు పరారయ్యాడు. సమీపంలో ఉన్న వాకర్స్ చేరుకోవడంతో ఆగంతకుడు ఏకే 47 గన్, బ్యాగు వదిలేసి వెళ్లాడు. నన్ను చంపాల్సిన అవసరం ఎవరికి లేదు...నాకు ఎవరిపైనా అనుమానం లేదు' అన్నారు. కాగా అంతకు ముందు డీసీపీ వెంకటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేబీఆర్ పార్క్ వద్ద నిత్యానందరెడ్డిపై గుర్తు తెలియని ఆగంతకుడు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. -
కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తుపడతా: నిత్యానందరెడ్డి
-
కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తుపడతా: నిత్యానందరెడ్డి
హైదరాబాద్ : తనపై కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తుపడతానని అరబిందో ఫార్మా వైస్ ప్రెసిడెంట్ నిత్యానందరెడ్డి తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తి 5.3 అడుగుల ఎత్తు ఉన్నాడని, తాను కారు వద్దకు వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చోగానే తనపై దుండగుడు కాల్పులకు యత్నించినట్లు ఆయన చెప్పారు.న ప్రాణాపాయం నుంచి తృటిలో బయటపడ్డానని నిత్యానందరెడ్డి తెలిపారు. తనకు ఎవరితో విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఆగంతకుడు ఎనిమిది రౌండ్ల కాల్పులు జరిపినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే బుధవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో మార్నింగ్ వాక్ ముగించుకుని ఆడి కారులో కూర్చుంటున్న సమయంలో ఆగంతకుడు కాల్పులకు యత్నించాడు. దాంతో అప్రమత్తమైన ఆయన తన వద్ద ఉన్న పిస్టల్‌ను బయటికి తీసేందుకు ప్రయత్నించారు. ఏకె 47ను గురిపెట్టి కారును స్టార్ట్ చేయాలని డిమాండ్ చేశాడు. ఈలోగా ... ఆయనతో పాటే ఉన్న నిత్యానందరెడ్డి సోదరుడు ప్రసాద్‌రెడ్డి ఆగంతకుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కాసేపు వారిమధ్య పెనుగులాట జరిగింది. అయితే ఎలాగైనా తప్పించుకోవాలనుకున్న ఆగంతకుడు, ప్రసాద్‌రెడ్డి చెయ్యిని కొరికి పారిపోయాడు. హడావుడిలో ఏకె 47ను, వెంట తెచ్చుకున్న బ్యాగును ఆగంతకుడు కారులోనే వదిలి పరారయ్యాడు. ఈ కాల్పుల్లో ఎవ్వరికీ గాయాలు కాలేదు. ప్రశాంతమైన పార్క్ సమీపంలో కాల్పులు జరగడంతో .. మార్నింగ్ వాకర్స్ భయాందోళనకు గురయ్యారు. సంఘటనాస్థలాన్ని వెస్ట్ జోన్ డిసిపి వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఘటనా స్థలంలో 8 బులెట్లను స్వాధీనం చేసుకున్నారు. -
అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులు
హైదరాబాద్ : బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద బుధవారం కాల్పుల ఘటన కలకలం రేపింది. అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై ఆగంతకుడు కాల్పులు జరిపాడు. మార్నింగ్ వాక్ పూర్తి చేసుకుని, కారు ఎక్కుతున్న ఆయనపై ఏకె 47తో దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. అయితే వెంటనే తేరుకున్ననిత్యానందరెడ్డి... అతనిపై ఎదురు కాల్పులు జరిపినట్లు సమాచారం. కాగా 15 రౌండ్ల మేర కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షుల సమాచారం. అనంతరం తుపాకీ వదిలేసి పరారైనట్లు తెలుస్తోంది. కాగా ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. ఒక్కసారిగా కాల్పులతో పార్క్‌కు వాకింగ్‌కు వచ్చిన వాకర్స్ ఈ ఘటనతో భయాందోళనలకు గురయ్యారు. కాల్పుల ఘటనపై ప్రత్యక్ష సాక్షులు ...పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు నిత్యానందరెడ్డిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.