కేబీర్ పార్కులో కలకలం సృష్టించిన కాల్పుల కేసులో నిందితుడు మెహిదీపట్నం ప్రాంతంలోని ఓ సూపర్ మార్కెట్లో సరుకులు కొన్నట్లు పోలీసులు గుర్తించారు.
కేబీర్ పార్కులో కలకలం సృష్టించిన కాల్పుల కేసులో నిందితుడు మెహిదీపట్నం ప్రాంతంలోని ఓ సూపర్ మార్కెట్లో సరుకులు కొన్నట్లు పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలంలో అతడు వదిలి వెళ్లిన బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బ్యాగులో దొరికిన బిల్లు ఆధారంగా.. గతనెల 13వ తేదీన హైదరాబాద్లోని మెహిదీపట్నం ప్రాంతంలో గల ఓ సూపర్మార్కెట్లో అతడు సరుకులు కొన్నట్లు రుజువైంది.
దాంతో అక్కడి సీసీటీవీ ఫుటేజిని పోలీసులు పరిశీలించారు. ఆ ఫుటేజిని అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డికి కూడా చూపించారు. నిందితుడిని ఆయన సమీపం నుంచి చూసినందున.. గుర్తించే అవకాశం ఉందని భావిస్తున్నారు.