అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పుల ఘటనకు హైదరాబాద్ పోలీసుల వైఫల్యమే కారణమని సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు.
అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పుల ఘటనకు హైదరాబాద్ పోలీసుల వైఫల్యమే కారణమని సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. అసలు గ్రేహౌండ్స్ బలగాల నుంచి ఒక ఏకే 47 తుపాకి అదృశ్యమైనా ఇంతవరకు ఎందుకు పట్టించుకోలేదని ఆయన ప్రశ్నించారు.
ఇక ప్రధాని నరేంద్ర మోదీ కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూరుస్తున్నారన్నారు. కేంద్రంలో ఆర్ఎస్ఎస్ జోక్యం ఎక్కువవుతోందని, టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ ప్రయత్నిస్తోందని నారాయణ చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు నెరవేర్చడం లేదని ఆయన నిలదీశారు.