
నిత్యానందరెడ్డితో ఫోన్ లో మాట్లాడిన వైఎస్ జగన్
తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డికి వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఫోన్ చేశారు.
హైదరాబాద్ : తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డికి వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఫోన్ చేశారు. ఆయన క్షేమ సమాచారంతో పాటు, సంఘటనా వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ...నిత్యానందరెడ్డిని పరామర్శించారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ ఘటనపై తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేస్తామని తెలిపారు. బుధవారం ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద ఆగంతకుడు ....నిత్యానందరెడ్డిపై కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే.