'రెండేళ్లుగా నా కొడుకుతో సంబంధాలు లేవు' | I don't have a relationship with my son in two years, obulesh father Micheal | Sakshi
Sakshi News home page

'రెండేళ్లుగా నా కొడుకుతో సంబంధాలు లేవు'

Published Thu, Nov 20 2014 12:14 PM | Last Updated on Tue, Oct 2 2018 2:30 PM

I don't have a relationship with my son in two years, obulesh father  Micheal

పోరుమామిళ్ల : అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులకు పాల్పడినట్లు భావిస్తున్న కానిస్టేబుల్ ఓబులేసు తండ్రి మైకేల్ను గురువారం  పోరుమామిళ్ల పోలీసులు విచారించారు. పోలీసులు విచారణలో మైకేల్.... తన కుమారుడితో రెండు సంవత్సరాల నుంచి సంబంధాలు లేవని వెల్లడించినట్లు తెలుస్తోంది.

 

కాగా కాల్పుల కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న వ్యక్తి ...తన కుమారుడా కాదా అనేది తనకు తెలియదని మైకేల్ ...పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. ఓబులేసు స్వస్థలం వైఎస్ఆర్ జిల్లా జీ.పోరుమామిళ్ల మండలం తిరువెంగళాపురం. మరోవైపు ఓబులేసు గురించి మాట్లాడేందుకు గ్రామస్తులు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement