హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త నిత్యానందరెడ్డిపై కాల్పులు జరిపిన ఏఆర్ కానిస్టేబుల్ పుల్లా ఓబులేసును అయిదు రోజుల కస్టడీ అనంతరం బంజారాహిల్స్ పోలీసులు శనివారం రిమాండ్‌కు తరలించారు. ఈ అయిదురోజుల్లో ఓబులేసును కర్నూలుతో పాటు వైఎస్సార్ జిల్లాలోని ఆయన స్వగ్రామం పోరుమామిళ్ల, గండిపేట సమీపంలోని గ్రేహౌండ్స్ కార్యాలయం, సంఘటన జరిగిన కేబీఆర్ పార్కు వద్ద విచారించారు. గతంలో చేసిన నేరాలపై కూడా ఆరాతీశారు.