
నంద్యాల జిల్లాలో ఘటన
రుద్రవరం: చిన్న చిన్న విషయాలకు ఇతరులతో గొడవపడొద్దని సూచించిన తమ్ముడిని.. అన్న కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన గురువారం రాత్రి నంద్యాల జిల్లా రుద్రవరం మండలం బి.నాగిరెడ్డిపల్లెలో జరిగింది. శిరివెళ్ల సీఐ వంశీధర్, ఎస్‌ఐ వరప్రసాద్ తెలిపిన వివరాలు.. బి.నాగిరెడ్డిపల్లెలో గురువారం రాత్రి సురేంద్ర అనే వ్యక్తి మోటార్ సైకిల్‌పై వేగంగా వెళ్తుండగా పెద్ద ఓబులేసు అనే వ్యక్తి దాడి చేసి గాయపరిచాడు.
దాడి విషయం తెలుసుకున్న ఓబులేసు కుటుంబ సభ్యులు.. నువ్వు మద్యం మత్తులో రోజూ ఏదో ఒక సమస్య తెస్తున్నావు.. పద్ధతి మార్చుకోవాలి.. అని చెప్పారు. ఇందుకు కోపోద్రిక్తుడైన ఓబులేసు.. కత్తితో తమ్ముడు కర్రెన్న అలియాస్ ఇసాక్(40)ను పొడిచాడు. అడ్డు వచ్చిన తండ్రిపైనా దాడి చేశాడు.
క్షతగాత్రులిద్దరినీ నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. శుక్రవారం తెల్లవారు జామున ఇసాక్ మృతి చెందాడు. మృతుడి భార్య కుమారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్‌చేశారు.
Comments
Please login to add a commentAdd a comment