
నంద్యాల జిల్లా: నంద్యాలలో దారుణం చోటుచేసుకుంది. హిజ్రాలే ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. బిక్షాటన విషయంలో.. హిజ్రాల వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాలలో బిక్షాటన విషయంలో రూరల్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ముందే.. హిజ్రాలు తన్నుకున్నారు. రాళ్లు అలాగే కారంపొడి చల్లుకొని మరి... రెచ్చిపోయారు హిజ్రాలు. ఒకరిపై ఒకరు దాడి చేసుకొని వీరంగం సృష్టించారు.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బిక్షాటన విషయంలో పాణ్యం , అలాగే నంద్యాలకు చెందిన రెండు హిజ్రాల వర్గాల మధ్య కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతోంది. నంద్యాలలో భిక్షాటన చేయడానికి పాణ్యం వర్గం ప్రయత్నిస్తోంది. అయితే దీన్ని నంద్యాల వర్గం అడ్డుకుంటుంది.
ఈ నేపథ్యంలోనే రెండు వర్గాల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఇవాళ రూరల్ పోలీస్ స్టేషన్ ముందు రెండు వర్గాలు ఎదురుపడ్డాయి. ఇంకేముంది.. వివాదం కాస్త గొడవ దాకా వెళ్ళింది. ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకొని కొట్టుకున్నారు . దీంతో టూ టౌన్ రూరల్ పోలీసులు పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు
బిక్షాటన విషయంలో పాణ్యం, నంద్యాలకు చెందిన హిజ్రాల వర్గాల మధ్య… pic.twitter.com/VoEanzJjFY— Telugu Scribe (@TeluguScribe) March 28, 2025