బంజారాహిల్స్: నమ్మకంగా పని చేస్తున్నట్లు నటించి ఇంటి యజమాని కళ్లుగప్పి బంగారు ఆభరణాలు తస్కరించిన ఘట నలో నిందితురాలిని బంజారాహిల్స్ క్రైం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్ రోడ్ నెం.14 లోని ఇన్‌కమ్ ట్యాక్స్ క్వార్టర్స్ అపార్ట్‌మెంట్స్‌లో నివసించే ఉదయ్‌భాస్కర్ అనే అధికారి ఇంట్లో అదే ప్రాంతానికి చెందిన సరోజ అనే మహిళ కొంత కాలంగా పని చేస్తోంది.
ఈ నెల 15వ తేదీన ఆ ఇంట్లో బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలపై ఆమె కన్ను పడింది. యజమాని లేని సమయంలో తొమ్మి ది తులాల బంగారు ఆభరణాలు తస్కరించి ఆ రోజు నుంచి పనికి రావడం మానేసింది. విషయం తెలుసుకున్న ఉదయ్‌భాస్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన క్రైం పోలీసులు అనుమానితురాలు సరోజను తమదైన శైలిలో విచారించడంతో దొంగిలించిన సొమ్ము గురించి ఒప్పుకుంది. బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితురాలిని రిమాండ్‌కు తరలించారు. క్రైం ఎస్‌ఐ భరత్ భూషణ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి:
నా కోరిక తీర్చు.. లేదంటే నీ కొడుకు, భర్తను అంతం చేస్తా
హైదరాబాద్‌లో దారుణం: సోదరిపై అత్యాచారం
Comments
Please login to add a commentAdd a comment