
సల్మాన్, సైఫ్‌లపై కేసు
ఒక మతానికి చెందిన ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా దుస్తులు ధరిం చారని ఫిర్యాదు మేరకు బాలీవుడ్ నటలు
హైదరాబాద్: ఒక మతానికి చెందిన ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా దుస్తులు ధరిం చారని ఫిర్యాదు మేరకు బాలీవుడ్ నటలు సల్మాన్‌ఖాన్, సైఫ్ అలీఖాన్‌లపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయిం ది. ముంబైలో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో ఈ ఇద్దరు నటులు ఒక మతం మనోభావాలు దెబ్బతీసేలా దుస్తులు ధరించారని, వీరిపై కేసు నమోదు చేయాల్సిందిగా మొఘల్‌పురాకు చెందిన ఫసియుద్దీన్ కోర్టును అభ్యర్ధించాడు.
ఈ మేరకు మూడవ అడిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సల్మాన్‌ఖాన్, సైఫ్ అలీఖాన్‌లపై ఐపీసీ సెక్షన్ 295(ఏ) కింద కేసు నమోదు చేయాల్సిందిగా బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించారు. పోలీసులు ఈ ఇద్దరు నటులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.