జగన్‌పై హత్యాయత్నం కేసు.. విజయవాడకు బదిలీ | Murder Attempt On YS Jagan Mohan Reddy is Transferred to Vizag Court | Sakshi
Sakshi News home page

జగన్‌పై హత్యాయత్నం కేసు.. విజయవాడకు బదిలీ

Published Wed, Jan 9 2019 4:59 PM | Last Updated on Thu, Jan 10 2019 2:26 AM

Murder Attempt On YS Jagan Mohan Reddy is Transferred to Vizag Court - Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మీద హత్యాయత్నం కేసును విశాఖపట్నం నుంచి విజయవాడకు బదిలీ చేయాలంటూ మెట్రోపాలిటన్‌ కోర్టు తీర్పునిచ్చింది. జగన్‌పై హత్యాయత్నం కేసులో ప్రభుత్వం తమకు సహకరించడం లేదని.. ఈ కేసును విజయవాడకు బదిలీ చేయాలంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి.. ఈ కేసును విశాఖపట్నం నుంచి విజయవాడకు బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను ఎన్‌ఐఏకు అప్పగించాలంటూ కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement