సాక్షి, విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) బుధవారం చార్జిషీట్ దాఖలు చేసింది. ఎన్‌ఐఏ కోర్టు న్యాయమూర్తికి చార్జిషీట్‌ను సమర్పించింది. నిందితుడు శ్రీనివాసరావు జైలులో రాసుకున్న 22 పేజీల పుస్తకాన్ని చార్జిషీట్‌తో పాటు జత చేసింది. చార్జిషీట్ కాపీని ఎవరికీ అందకుండా చూడాలని, గోప్యంగా ఉంచాలని కోర్టు సిబ్బందిని ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆదేశించారు.
ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న జునుమిల్లి శ్రీనివాసరావును ఏ1 నిందితుడిగా పేర్కొన్నట్టు సమాచారం. కుట్రకోణంపై విచారణ కొనసాగిస్తామని కోర్టుకు ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. చార్జిషీట్‌లో ఏముందో ఈ నెల 25న తెలిసే అవకాశముంది. ఈ కేసులో పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉండగా అత్యవసరంగా చార్జిషీట్ దాఖలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిందితుడి తరఫున న్యాయవాది మట్టా జయకర్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment