ముంబై: మహిళపై వేధింపుల కేసులో ముంబై మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు గతవారం కీలక తీర్పునిచ్చింది. 40 ఏళ్ల నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముంబైలో ఉదయం వేళ చాలా రద్దీగా ఉంటుందని, ఆ సమయంలో ఒకరిని మరొకరు ఫాలో కావడం అసాధ్యమని వ్యాఖ్యానించింది.
ఏం జరిగిందంటే..?
ముంబై చిరా బజార్‌లో నివసించే ఓ మహిళ.. ఓ వ్యక్తి తనను రోజు ఫాలో అవుతున్నాడని ఆరోపించింది. ఉదయం రైల్వే స్టేషన్‌కు వెళ్లే సమయంలో అతడు తనను బైక్‌పై అనుసరిస్తున్నాడని, తనవైపే చూస్తూ ఇబ్బంది పెడుతున్నాడని కేసు పెట్టింది. నిందితుడు కూడా అదే ప్రాంతంలో ఓ గ్యారేజీ నడుపుతున్నాడు. ఆమె వెళ్లేదారిలోనే ఆ షాపు కూడా ఉంది.
అయితే మహిళ చేసిన ఆరోపణలపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ముంబైలో ఉదయం వేళ చాలా రద్దీగా ఉంటుందని, ఆపీసులకు వెళ్లేవారితో రోడ్లు కిక్కిరిపోతాయని పేర్కొంది. అలాంటి సమయంలో ఒకరిని మరొకరు ఫాలో చేయడం అసలు సాధ్యం కాదని చెప్పింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి బెయిల్ ఇచ్చింది. ఈ కేసు 2017 ఆగస్టు 3న నమోదైంది.
చదవండి: ఇండియన్ కరెన్సీ నోట్లపై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment