కర్నూలు(జిల్లా పరిషత్): ‘ఒకప్పుడు పిచ్చిపట్టిన వారు మాత్రమే మానసిక వైద్యుల వద్దకు వెళ్లేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ మానసిక వైద్యుని అవసరం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో మానసిక ఒత్తిళ్లపై పరిశోధనలు ఎంతైనా అవసరం.’ అని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఏపీ చాప్టర్ ఆధ్వర్యంలో 35వ రాష్ట్రస్థాయి సైకియాట్రిస్ట్‌ల సదస్సు(ఏపీ సైకాన్-2015) శనివారం స్థానిక మౌర్య ఇన్‌లో ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ కర్నూలులో మానసిక వైద్యాలయం ఏర్పాటు అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తానన్నారు.
కార్పొరేట్ సంస్థల్లోనూ సైకియాట్రిస్ట్‌లను నియమించి కౌన్సెలింగ్ ఇస్తున్నారని గుర్తు చేశారు. మానసిక ఒత్తిళ్లు నాడు, నేడు ఉన్నాయని.. కానీ ఒత్తిళ్లలో తేడా ఉందన్నారు. యువత సైతం నిరుద్యోగం, పేదరికం కారణంగా క్రిమినల్స్‌గా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఏపీ చాప్టర్ నూతన అధ్యక్షునిగా పూర్వ అధ్యక్షుడు డాక్టర్ కృపాకర్ కొరడా నుంచి బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ సురేష్‌కుమార్(వైజాగ్) మాట్లాడుతూ సైకియాట్రిస్టుల సేవలు పట్టణ ప్రాంతాలకే పరిమితమయ్యాయని, గ్రామీణ ప్రాంతాలకు చేరడం లేదన్నారు. ఆల్కహాల్, గంజాయి వంటి మత్తుపదార్థాల స్థానంలో నేడు ఇంటర్‌నెట్ వాడకం వ్యసనంగా మారిందని, సోషల్ మీడియా ప్రభావం యువతపై తీవ్రంగా పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మానసిక వైద్యుల సంఖ్య మరింతగా పెరగాల్సి ఉందన్నారు.
కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రాంప్రసాద్ మాట్లాడుతూ పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ నేడు మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. సమాజంలో సైకియాట్రిస్టు నిపుణుల కొరత ఉందని, ఆ కొరతను ప్రభుత్వం తీర్చాలన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరస్వామి మాట్లాడుతూ మానసిక ఒత్తిళ్ల కారణంగా ప్రజలు అనేక వ్యాధులకు గురవుతున్నారన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రీజనల్ సైకియాట్రిక్ ఇన్సిట్యూట్ ఏర్పాటు చేయాలని కోరారు.
అనంతరం సావనీర్‌ను ప్రిన్సిపాల్ డాక్టర్ రాంప్రసాద్, డాక్టర్ కరి రామారెడ్డి రచించిన మనసులో ఒకరు పుస్తకాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరాస్వామి ఆవిష్కరించారు. సదస్సుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి 12 మంది స్పీకర్లు(సైకియాట్రిస్ట్‌లు) హాజరై పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో ఐఎంఏ కర్నూలు శాఖ అధ్యక్షులు డాక్టర్ బి.శంకరశర్మ, కార్యక్రమం నిర్వాహక చైర్మన్ డాక్టర్ బి.రమేష్‌బాబు, కార్యదర్శి డాక్టర్ కె. నాగిరెడ్డి, కోశాధికారి డాక్టర్ రమేష్ చంద్రబాలాజి, ఎడిటర్ డాక్టర్ పి.లోకేష్‌రెడ్డి, అసోసియేషన్ సౌత్ జోన్ ప్రెసిడెంట్ డాక్టర్ అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.
ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఏపీ చాప్టర్ నూతన కార్యవర్గం ఎన్నిక
ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఏపీ చాప్టర్ నూతన కార్యవర్గం ఎన్నికైంది. శనివారం ఏపీ చాప్టర్ ఆధ్వర్యంలో కర్నూలులో ఏపీపీసైకాన్-2015 పేరిట మానసిక వైద్యుల రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిం చారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా డాక్టర్ జి.సురేష్‌కుమార్(వైజాగ్), సెక్రటరీగా డాక్టర్ బి.రమేష్‌బాబు(కర్నూలు), ఉపాధ్యక్షులుగా డాక్టర్ కె.నాగిరెడ్డి(కర్నూలు), కోశాధికారిగా డాక్టర్ రమేష్ చంద్రబాలాజి(నెల్ల్లూరు), ఎడిటర్‌గా డాక్టర్ పి.లోకే శ్వరరెడ్డి(తిరుపతి) ఎన్నికయ్యారు.
మానసిక ఒత్తిళ్లపై పరిశోధనలు అవసరం
Published Sun, Jul 12 2015 2:43 AM | Last Updated on Sat, Aug 18 2018 6:18 PM
Advertisement
Advertisement