కంబదూరు : ఎవరూ అధైర్య పడాల్సిన పనిలేదని త్వరలోనే మంచి రోజులు వస్తాయని బాధిత రైతు కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ నాయకులు తెలిపారు. ఈ నెల 21 నుంచి మూడు రోజుల పాటు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసా యాత్ర చేపడతారని నాయకులు చెప్పారు.
ఈ సందర్భంగా శుక్రవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, నియోజకవర్గ సమన్వయకర్త ఉషాశ్రీచరణ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ రఘునాథ్‌రెడ్డి, కళ్యాణదుర్గం మండల కన్వీనర్ దొణస్వామి, సింగిల్ విండో అధ్యక్షుడు బాబురెడ్డి, ములకనూరు తిమ్మరాయుడు, గోవిందరెడ్డి, ఎంపీటీసీ గుద్దెళ్ల నాగరాజు, సర్పంచ్ హరినాథ్ క లిసి జగన్ చేపట్టబోయే భరో సా యాత్ర రూట్ మ్యాప్‌ను పరిశీలించారు.
కంబదూరు మండలం తిమ్మాపురంలో ఆత్మహత్య చేసుకున్న వడ్డే నారాయణప్ప కుటుంబ సభ్యులైన ఆయన భార్య లక్ష్మీదేవి, కుమారుడు మారెన్నలను కలిసి ధైర్యం చెప్పారు. కంబదూరులో జగన్ బసచేసే ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి ఒంటారెడ్డిపల్లిలో ఆత్మహత్య చేసుకున్న కురుబ రామాంజనేయులు అనే రైతు భార్య గంగమ్మ ఇంటికి వెళ్లి పరామర్శించారు. కురాకులపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు రాజేష్ కుటుంబ సభ్యులైన తల్లి లక్ష్మీదేవి, తమ్ముడు శ్రీధర్‌లను ఓదార్చారు. బాధిత కుటుంబాలకు జగన్ అండగా ఉంటారన్నారు. పర్యటనలో వైఎస్‌ఆర్ సీపీకి చెందిన కళ్యాణదుర్గం పట్టణ కన్వీనర్ జయరాంపూజారి, ములకనూరు గోవిందు, గోళ్లసూరి, అంజిబాబు, దీమేష్, నీలి శంకరప్ప పాల్గొన్నారు.