Rachana Reddy
-
అత్త, వారి బంధువుల వేధింపులు తాళలేక క్షోభ అనుభవిస్తున్నా
పంజగుట్ట: గత 10 నెలలుగా అత్త, అత్త తరపు బంధువులు పెట్టే వేధింపులను తట్టుకోలేకపోతున్నానని, తమ సమీపబంధువు గౌతంరెడ్డి, అత్త గుణపటి పార్వతి, భర్త ఆదాల దామోదర్ రెడ్డి నుంచి తనకు, తన కుటుంబానికి ఆపద ఉందని గ్రీన్‌పార్క్, మారీగోల్డ్, ఆవాసా హోటల్స్ డైరెక్టర్ ఆదాల దామోదర్ రెడ్డి సతీమణి రచనా రెడ్డి వాపోయారు. ఇంట్లో ఉన్న తనను ఈ నెల 6న 15మంది బౌన్సర్లు వచ్చి దాడిచేసి కిడ్నాప్ చేసేందుకు యతి్నంచారన్నారు.ఈ విషయమై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ చెయ్యలేదని ఆమె ఆరోపించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తన సోదరితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 2022 సంవత్సరంలో తనకు దామోదర్ రెడ్డికి వివాహం అయ్యిందని అప్పటినుండి కొద్దికాలం సజావుగానే తమ దాంపత్యం కొనసాగిందన్నారు. తన భర్త తన మాటవింటున్నాడు కానీ తన అత్త పార్వతి భర్తనుండి విడదీసేందుకు కుట్రలు పన్నిందన్నారు. తమ సమీపబంధువు గ్రీన్‌పార్క్, మారీగోల్డ్ హోటల్స్ సీఈఓ గౌతంరెడ్డి మా అత్త సాయంతో తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నారన్నారు. తన భర్తనుండి విడాకుల నోటీసు ఇప్పించడంతో గత కొంతకాలంగా తాను ఇల్లు వదిలి వెల్లిపోయానని తిరిగి కోర్టు ఆదేశాలతో గత నెల ఫిల్మ్‌నగర్ లోని తన భర్త ఇంటికి వచ్చినట్లు తెలిపారు. అప్పటినుండి తనను ఇంట్లోవేసి తాళం వెయ్యడం, గదిలో బంధించడం తీవ్రమానసిక వేదనకు గురిచేశారని తెలిపారు. తన అత్త పార్వతి, భర్త దామోదర్ రెడ్డి, గౌతమ్ రెడ్డి నుండి తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని రచనా రెడ్డి వాపోయారు. -
మెడికో రచనా కేసులో ఏం జరిగింది?
సంగారెడ్డి, సాక్షి: మెడికో రచనా రెడ్డి ఆత్మహత్య కేసులో కొత్త అనుమానాలు బయటకు వస్తున్నాయి. ఇటీవల ఆమె పెళ్లి నిశ్చయం కాగా.. ఆ వ్యవహారంలో ఏర్పడిన మనస్పర్థల వల్ల ఆమె డిప్రెషన్‌కు వెళ్లినట్టు.. దాని వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారని సన్నిహితులు భావిస్తున్నారు. అమీన్ పూర్ సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. "రచనారెడ్డి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని ప్రాథమికంగా అంచనాకు వచ్చాం. ఆమె కారులో కొన్ని ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నాం. ఆమెకు ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ మార్చిలో వివాహానికి పెద్దలు నిర్ణయించారు. ఎంగేజ్మెంట్ జరిగిన యువకుడితో ఆమెకు మనస్పర్థలు వచ్చినట్లు కొందరు చెబుతున్నారు. అయితే ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణం ఎఫ్ఎస్ఎల్(FSL)లోనే తేలుతుంది" అని చెప్పారు. మరోవైపు ఆమె సోదరుడు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా చెల్లి గత కొంతకాలంగా డిప్రెషన్లో ఉంది. చాలాసార్లు నచ్చజెప్పాం. మా పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఇచ్చారని" తెలిపారు. జరిగింది ఇది.. ఖమ్మం మమతా కాలేజీలో పీజీ చదువుతున్న రచనా రెడ్డి (25).. ప్రస్తుతం బాచుపల్లిలోని మమతా కాలేజీలో ఇంటర్న్‌షిప్ చేస్తోంది. ఆమె కుటుంబ సభ్యులు హైదరాబాద్ BHELలోని HIGలో ఉంటున్నారు. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిష్టారెడ్డిపేట్ ORR రింగ్ రోడ్డుపై కారులో రచనా అపస్మారక స్థితిలో ఉండటాన్ని సోమవారం స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.... ఘటనా స్థలికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మెడికో రచనా రెడ్డి తుది శ్వాస విడిచింది. పాయిజన్ ఇంజక్షన్ తీసుకొని ఆమె సూసైడ్‌కు పాల్పడిందని అక్కడ లభించిన ఆధారాలను బట్టి ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. -
డాక్టర్ రచనా రెడ్డి ఆత్మహత్య కేసులో కీలక పరిణామం
-
బీజేపీలోకి హైకోర్టు న్యాయవాది రచనారెడ్డి!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, హైకోర్టున్యాయవాది రచనారెడ్డి ఆదివారం బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో వీరు బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. విశ్రాంత ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ కూడా బీజేపీలో చేరేందుకు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. కాగా, ఆగస్టు 2 నుంచి బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర చేపట్టనున్నారు. యాదగిరిగుట్ట నుంచి ఆయన పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా బీజేపీలో చేరతారని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకోసమే ఆయన తన మద్దతుదారులతో మంతనాలు జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. మరోపక్క కాంగ్రెస్ కూడా ఆయనను బుజ్జగించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. (క్లిక్: డైలమా, వెనకడుగు నా రక్తంలోనే లేదు: కోమటిరెడ్డి) -
గ్రేటర్ ఎన్నికలు: ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేం..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్(జీహెచ్ఎంసీ) ఎన్నికలపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. గ్రేటర్ ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. మున్సిపల్యాక్ట్ ప్రకారం మేయర్, కార్పొరేటర్ల రిజర్వేషన్ల కేటాయింపు సక్రమంగా జరగలేదని వ్యాయవాది రచనారెడ్డి హైకోర్టుకు వివరించారు. వెంటనే బల్దియా ఎన్నికలను నిలిపివేయాలని హైకోర్టును కోరారు. దీనికి స్పందించిన హైకోర్టు గ్రెటర్ ఎన్నికలకు మరో వారం రోజులు ఉన్న ఈ సమయంలో తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. జీహెచ్ఎంసీ ఎన్నికలపై దాఖమైన పలు పిటిషన్లు, రిట్ పిటిషన్లను డిసంబర్ 23న విచారణ చేపడతామని తెలిపింది. తదుపరి విచారణను హైకోర్టు డిసెంబర్ 23కు వాయిదా వేసింది. -
తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్ : రాజకీయ దురుద్దేశ్యంతోనే కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు పిలుపునిచ్చారని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టులో వాదించారు. కోవిడ్-19 నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించారని ఏజీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. కాంగ్రెస్ నేతల అక్రమ అరెస్ట్ పిటీషన్లపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడితో పాటు పలువురు ఎంపీలు పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 12 పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో పిటీషనర్ల తరపు న్యాయవాది రచనా రెడ్డి హైకోర్టులో వాదనలు వినిపించారు. (సంతోష్ బాబు కుటుంబానికి భారీ సాయం: కేసీఆర్ ) జూన్ 1 నుంచి జూన్ 13 వరకు కాంగ్రెస్ నేతలను అరెస్టులతో పాటు గృహ నిర్బంధం చేస్తున్నారని పిటీషన్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులపై ప్రభుత్వం కక్ష పూర్వకంగా వ్యవహరిస్తోందని కోర్టుకు తెలిపారు. ఇప్పటి వరకు ఏలాంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు కూడా నాలుగు సార్లు అరెస్ట్ చేశారన్నారు. అరెస్ట్‌కు సంబంధించి ఎక్కడ రీకార్డ్ నమోదు చేయలేదని న్యాయవాది రచనా రెడ్డి తెలిపారు. కాగా ప్రస్తుతం కరోనా విజృభిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఏమైనా ఆందోళనలకు పిలుపునిచ్చారా అని హైకోర్టు పిటీషనర్ను ప్రశ్నించారు. అలాగే మినిస్టరీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేయిర్ గైడ్ లైన్స్ పాటిస్తున్నారా అని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి బదులుగా ఆందోళనలకు ఎలాంటి పిలుపు ఇవ్వలేదని, గైడ్ లెన్స్ ప్రకారం నడుచుకున్నామని రచనా రెడ్డి కోర్టుకు తెలిపారు. (వాడిలో నిన్ను చూసుకుంటాం.. వచ్చేయ్) పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీకి చేయడానికి వెళ్తున్న వారిని అడ్డుకున్నారా అని పిటీషనర్లను హైకోర్టు ప్రశ్నించింది. గిరిజనులకు సాయం చేసిన ములుగు ఎమ్మెల్యేను హైకోర్టు ప్రశంసించగా.. ములుగు ఎమ్మెల్యేను కూడా అరెస్ట్ చేసారని రచనా రెడ్డి పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ తరపు అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున కాంగ్రెస్ పార్టీ జల దీక్ష కు పిలుపునిచ్చారని కోర్టుకు తెలిపారు. జలదీక్ష వలన ప్రజలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తుగా వారిని ప్రొటెస్ట్ చేశామని పేర్కొన్నారు. జలదీక్షకు పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. అయితే ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాలా అని అడ్వొకేట్ జనరల్‌ను హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాలతో వచ్చే సోమవారంలోపు కౌంటర్ ధాఖలు చేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు రోజుల్లో కాంగ్రెస్ నేతల కదలికలను అనుసరించొద్దని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. (తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు నోటీసులు) -
కూటమి నేతలు రాజకీయ బ్రోకర్లు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ జన సమితి(టీజేఎస్)కి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ ఉపాధ్యక్షురాలు, అడ్వొకేట్ రచనారెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆమెతోపాటు మర్రి శశిధర్‌రెడ్డి తనయుడు ఆదిత్యారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ప్రకటించారు. ఈ సందర్భంగా టీజేఎస్ అధినేత కోదండరాంపై రచనారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా కూటమి కూర్పే లేదన్నారు. ఈ విషకూటమితో ప్రత్యామ్నాయం వచ్చే అవకాశం లేదన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. మరో రాష్ట్రానికి చెందిన సీఎం ఇక్కడ ప్రచారానికి రావడమే తప్పని, తెలంగాణ ప్రజలు ఎంతో అవగాహన కలిగిన వారని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారాన్ని ఇక్కడి ప్రజలు కచ్చితంగా తిరస్కరిస్తారని, ఆయన చేసే కుట్రలు వారికి బాగా తెలుసని చెప్పారు. కూటమిలో ఏ క్యాడర్ పనిచేస్తలేదని, కూటమి పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కూటమిలోని నేతలు రాజకీయ బ్రోకర్లుగా తయారయ్యారని, కూరగాయల మాదిరిగా అసెంబ్లీ సీట్లు అమ్ముకున్నారని తీవ్రంగా విమర్శించారు. టీజేఎస్ పెట్టడానికి కారణాలు ఏంటి? మీరు చేస్తున్నదేంటి? అని ప్రశ్నిస్తూ టీజేఎస్‌ను నమ్ముకున్న వారిని నిండా ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందే ప్రజాకూటమి ఫిక్స్ అయిందని, కూటమితో కోదండరాం అంతర్గత ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. కూటమిలో సామాజిక న్యాయంలేదు... ప్రజాకూటమి కూర్పులో సామాజిక న్యాయం జరగలేదని, కోదండరాంను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని రచనారెడ్డి ఎద్దేవా చేశారు. ఉద్యమకారులకు ప్రాధాన్యం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మైనారిటీలకు టీజేఎస్ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని, దీంతో మైనార్టీలకు ఏవిధంగా న్యాయం జరిగినట్లో చెప్పాలన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కూటమిలో టికెట్లు ఇచ్చారని, ఈ కుమ్మక్కులో కోదండరాం కూడా భాగస్వామిగా ఉన్నారన్నారు. కూటమిలో చాలామంది నేతలను బలిపశువులను చేశారని మండిపడ్డారు. కోదండరాం కాంగ్రెస్‌తో కలసి తనకు తానే ఓటమి చెందుతున్నారని, అసలు కూటమి ఏర్పడింది.. గెలువడానికా లేక ఓడిపోవడానికా అని ప్రశ్నించారు. కోదండరాం కూటమి కన్వీనర్ అంటే.. ఏ దేశానికి రాజు? అని ఎద్దేవా చేశారు. పార్టీకి కామన్ మినిమం ప్రోగ్రాం లాంటి పెద్ద, పెద్ద పదాలు పనికిరావన్నారు. టీజేఎస్ ఒక్క సీటు కూడా గెలవకపోతే రాజ్యసభ, ఎమ్మెల్సీ, బోర్డుమెంబర్ పదవి కూడా ఇవ్వరని, కనీసం వారి ఫోన్లను కూడా కాంగ్రెస్ వారు ఎత్తరని ఎద్దేవా చేశారు. తమ వెంట పడి టీజేఎస్‌లో చేరేవరకు వదిలిపెట్టలేదని, చేరాక పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశా రు. టీజేఎస్‌కు అడిగినన్ని టికెట్లు ఇవ్వనప్పుడు కోదండరాం కూటమి నుంచి ఎందుకు బయటకు రాలేదని, చర్చల పేరుతో హోటళ్లలో సమావేశాలు పెట్టి ఎందుకు టైంపాస్ చేశారని దుయ్యబట్టారు. రాహుల్ పారాచూట్లకు టికెట్లు ఇవ్వవద్దని, కుటుంబంలో ఒక్కటే టికెట్ ఇవ్వాలని, వరుసగా మూడుసార్లు ఓడిపోయిన వారికి టికెట్లు కేటాయించవద్దని చెప్పినా దాన్ని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ తుంగలో తొక్కారని ఆరోపించారు. ఎందుకూ పనికిరాని పొలిటికల్ బ్రోకర్లు కాంగ్రెస్‌లో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కోదండరాం.. మమ్మల్ని ఎందుకు పా ర్టీలోకి తెచ్చావు? నిన్ను నమ్ముకుని వచ్చిన వారిని మోసం చేశావు, వారి భవిష్యత్ ఇక్కడికే అంతమైంది. కాంగ్రెస్‌తో మీ డీలింగ్ ఏమిటి’ అని ప్రశ్నించారు. ‘16 నుంచి 18 పేర్ల తో జాబి తా తయారు చేసి, గంటకు ఒకరి పేరు జాబితాలో మార్చారు. నీవు అది తీసుకో, నేను ఇది తీసుకుంటానంటూ బఠానీలూ, పల్లీల్లా బేరసారాలు చేశారు’ అని ఆమె విమర్శించారు. రచనారెడ్డి సస్పెన్షన్.. టీజేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రచనా రెడ్డి, మర్రి ఆదిత్యరెడ్డిలను ప్రాథమిక సభ్య త్వం నుంచి సస్పెండ్ చేసినట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు, అధికార ప్రతినిధి జి.వెంకట్‌రెడ్డి విలేకరుల సమావే శంలో మాట్లాడుతూ పార్టీ వ్యతిరేక కార్యక లాపాలకు పాల్పడినందున వారిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. ప్రశ్నిస్తే నాపై దాడికి యత్నం... అన్నింటికీ డబ్బులేనని, అలాంటప్పుడు కూటమి ఎందుకని రచనారెడ్డి ప్రశ్నించారు. మర్రి కుటుంబాన్ని కూడా కూటమిలో బాధితులుగా చేశారన్నారు. తాను ఒక్కసారే సీటు అడిగానని, ఎవరో డబ్బులు ఇచ్చి తనతో స మావేశం పెట్టించారనే దాంట్లో వాస్తవంలేదని ఆమె అన్నారు. జనసమితి సమావేశాల్లో ప్రశ్నిస్తే తనపై దాడి చేసేందుకు యత్నించా రని ఆరోపించారు. కోదండరాం 2014 వరకు ఉద్యమం చేశారని, తరువాత ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం తప్ప చేసిందేమీ లేదన్నారు. గడిచిన నాలుగేళ్లలో కూటమిలోని సభ్యులు ఎవరూ ఏం చేయలేదని, వారు ఏం చేయలేకపోవడంవల్లే తాను న్యాయస్థానంలో కేసులు వేశానని తెలిపారు. మర్రి ఆదిత్యరెడ్డి మాట్లాడుతూ కూటమిలో టికెట్లు అమ్ముకున్నది వాస్తవమని, తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని, దీనిపై విచారణ చేపట్టాలన్నారు. ‘కోదండరాం ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసిన మాట వాస్తవం కాదా.. అమిత్ షా 40 సీట్లు ఇస్తామని ఒప్పుకోలేదా..’ అని ప్రశ్నించారు. కూటమి ఏర్పాటుకు ముందే ఉప్పల్ సీటును టీడీపీ నేత దేవేందర్‌గౌడ్ కుమారుడికి ఎలా కేటాయించారని ప్రశ్నించారు. కోదండరాం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, వర్ధన్నపేట సీటును అడగకున్నా టీజేఎస్‌కు ఎందుకు కేటాయించారని ప్రశ్నించారు. -
రచనారెడ్డి, ఆదిత్యారెడ్డిపై వేటు..!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్కు మహాకూటమి ప్రత్యామ్నాయం కాబోదని, మహాకూటమిలో రాజకీయ బ్రోకర్లు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ జనసమితి పార్టీ వైస్ ప్రెసిడెంట్ రచనారెడ్డి, మర్రి ఆదిత్యారెడ్డిలపై ఆ పార్టీ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు పార్టీ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఆ పార్టీ నేతలు ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ ఏకగ్రీవ తీర్మానం మేరకు టీజెఎస్ ప్రజాకూటమిలో భాగస్వామ్యం అయిందని ఆ పార్టీ నేతలు తెలిపారు. రచనా రెడ్డి, ఆదిత్యారెడ్డి ఎన్నికల్లో యెల్లారెడ్డి, తాండూరు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలనుకున్నారని, వారి సీట్ల విషయంలో పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేసిన విషయం వారికి బాగా తెలుసునని తెలిపారు. టీఆర్ఎస్కు ఎవరూ ప్రత్యామ్యాయం లేదని చెప్పడం వెనక వారు ఏ పార్టీతో అవగహన కుదుర్చుకుంటున్నారో స్పష్టమవుతోందని టీజేఎస్ ఆరోపించింది. సీట్లు అమ్ముకున్నట్టు పార్టీపై నిరాధార ఆరోపణలు చేసినందుకు ఈ మేరకు క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని తెలిపింది. పార్టీ సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన ఆ పార్టీ ఉపాధ్యక్షురాలు, న్యాయవాది రచనా రెడ్డి.. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంపై తీవ్ర విమర్శలు చేశారు. కోదండరాం మహాకూటమితో అంతర్గత ఒప్పందం కుదుర్చుకున్నారని, ఆయన మ్యాచ్‌ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. మహాకూటమిలో సామాజిక న్యాయం జరగలేదని, కోదండరాంను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆమె అన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కూటమిలో టికెట్లు ఇచ్చారని, ఈ కుమ్మక్కులో కోదండరాం కూడా భాగస్వామిగా ఉన్నారని పేర్కొన్నారు. కూటమిలో చాలామంది నేతలను బలిపశువులను చేశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు ఇంగితజ్ఞానం ఉందని, చంద్రబాబు ప్రచారాన్ని వారు తిరస్కరిస్తారని ఆమె పేర్కొన్నారు. -
టీజేఎస్‌కు షాకిచ్చిన రచనా రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ జన సమితి (టీజేఎస్)కు భారీ షాక్ తగిలింది. పార్టీ సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేసినట్లు ఆ పార్టీ ఉపాధ్యక్షురాలు, న్యాయవాది రచనా రెడ్డి ఆదివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీజేఎస్ ఛైర్మన్ కోదండరాంపై తీవ్ర విమర్శలతో మండిపడ్డారు. ఎన్నికలకు ముందే మహాకూటమి ఫిక్స్ అయ్యిందని, కోదండరాం కూటమితో అంతర్గత ఒప్పందం కుదుర్చుకున్నారని ఆమె ఆరోపించారు. మహాకూటమిలో సామాజిక న్యాయం జరగలేదని, కోదండరాంను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆమె అన్నారు. మైనార్టీలకు టీజేఎస్ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని.. ఇక మైనార్టీలకు ఏవిధంగా న్యాయం జరిగినట్లని ఆమె ప్రశ్నించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కూటమిలో టికెట్లు ఇచ్చారని, ఈ కుమ్మక్కులో కోదండరాం కూడా భాగస్వామిగా ఉన్నారని పేర్కొన్నారు. కూటమిలో చాలామంది నేతలను బలిపశువులను చేశారని మండిపడ్డారు. కోదండరాం కాంగ్రెస్‌తో కలిసి తనకు తానే ఓటమి చెందుతున్నారని, అసలు కూటమి గెలవడానికా లేక ఓడిపోవడానికా అని ఆమె ప్రశ్నించారు. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా కూటమి కూర్పు లేదని, దానిలో నేతలు రాజకీయ బ్రోకర్లుగా తయారయ్యారని ఆమె ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలకు ఇంగితజ్ఞానం ఉందని, చంద్రబాబు ప్రచారాన్ని తిరస్కరిస్తారని అన్నారు.