సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్(జీహెచ్‌ఎంసీ) ఎన్నికలపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. గ్రేటర్ ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. మున్సిపల్‌యాక్ట్ ప్రకారం మేయర్, కార్పొరేటర్ల రిజర్వేషన్ల కేటాయింపు సక్రమంగా జరగలేదని వ్యాయవాది రచనారెడ్డి హైకోర్టుకు వివరించారు. వెంటనే బల్దియా ఎన్నికలను నిలిపివేయాలని హైకోర్టును కోరారు. దీనికి స్పందించిన హైకోర్టు గ్రెటర్ ఎన్నికలకు మరో వారం రోజులు ఉన్న ఈ సమయంలో తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై దాఖమైన పలు పిటిషన్లు, రిట్ పిటిషన్లను డిసంబర్ 23న విచారణ చేపడతామని తెలిపింది. తదుపరి విచారణను హైకోర్టు డిసెంబర్ 23కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment