Reservation Act
-
ఓబీసీల కోసం రాజ్యాంగ సవరణ తప్పదు..
బిహార్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 50 నుంచి 65 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని పట్నా హైకోర్టు కొట్టివేసింది. ఇది దేశంలోని బీసీ వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. బిహార్ నమునాగా ఇతర రాష్ట్రాలు కూడా కులగణన చేసి శాస్త్రీయంగా బీసీల జీవన స్థితిగతుల లెక్కలు తీసుకుని విద్యా–ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంపుదల చేసుకోవచ్చని ఆశగా ఎదురు చూసిన వారు విస్మయానికి గురైనారు. దీంతో రాజ్యాంగ సవరణ చేయకుండా ఓబీసీల విద్యా–ఉద్యోగ రిజర్వేషన్ల పెంపుదల జరుగదని విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రం 69 శాతానికి పెంచిన మొత్తం రిజర్వేషన్ శాతం ఇప్పటికీ కొనసాగుతున్న విషయం గమనార్హం. శాసన సభలో ఏకగ్రీవంగా ఆమోదించిన ఒక బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది రాష్ట్ర ప్రభుత్వం. పార్టీలకు అతీతంగా సీఎం జయలలిత ఆధ్వర్యంలో అన్ని పార్టీల ప్రతినిధి బృందం ఢిల్లీ వెళ్లి అప్పటి పీవీ నరసింçహారావు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి... తమ శాసన సభ చేసిన చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చేలా చేశారు. దీంతో తమిళనాడులో అమలు జరుగుతున్న 69 శాతం రిజర్వేషన్లపై ఏ కోర్టులోనూ ఛాలెంజ్ చేసే అవకాశం లేకుండాపోయింది.బిహార్ రాష్ట్రం కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఈ తరహాలో బీసీలకు అధిక రిజర్వేషన్లు అందేలా చూడాలి. బిహార్‌తో పాటుగా అన్ని రాష్ట్రాలూ ఇదే దారిలో ప్రయాణించవలసి ఉంది. ఇది జాతీయ ఉద్యమంగా రూపుదాల్చవలసి ఉన్నది. ఏ రాష్ట్రంలోనైనా బీసీల రిజర్వేషన్లు పెంచాలనే తలంపుతో ఏ విధాన నిర్ణయం తీసుకున్నప్పటికీ 1992లో ‘ఇందిరా సహానీ’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ‘మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాద’నే తీర్పును అడ్డుపెట్టుకుని ఆధిపత్య వర్గాలు కోర్టులకు వెళ్ళి అడ్డుపడుతున్నాయి. బిహార్‌లో మాదిరిగా మహారాష్ట్ర, రాజస్థాన్, హరియాణా ప్రభుత్వాలు 50 శాతం రిజర్వేషన్లు మించి ఇచ్చాయని సుప్రీంకోర్టులో పిల్స్ వేశారు. దీన్ని బట్టి చూస్తే విధిగా రాజ్యాంగసవరణ చేస్తే తప్ప బీసీలకు న్యాయం చేయడానికి వేరే మార్గం లేదని అర్థమవుతుంది.బిహార్ ప్రభుత్వ నిర్ణయాన్ని పట్నా హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 50 శాతానికి మించి ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ఎలా అంగీకరించిందని బీసీలు ప్రశ్నిస్తున్నారు.ఈ డబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు జనాభా గణన చేయలేదు. వారి జీవన స్థితిగతులను అధ్యయనం చేయకుండా అగ్రవర్ణాలలోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. దేశజనాభాలో అగ్రవర్ణాలు ఎంతమంది? వారిలో పేదరికం ఎంత శాతం? ఈ లెక్కలు లేకుండా 10 శాతం రిజర్వేషన్లు ఎలా ఇచ్చారో కేంద్రమే చెప్పాలి. అయినా సుప్రీంకోర్టు ధర్మాసనం 10 శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు అంగీకరించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన 85 శాతం మంది ఉంటే వీరిలో 56 శాతంగా ఉన్న బీసీలలో పేదలు ఎంతమందో ఎవరి దగ్గరా లెక్కలు లేవు. అందుకే ఓబీసీ రిజర్వేషన్లలో ఎలాంటి పరిమితి విధించకుండా అత్యవసరంగా రాజ్యాంగంలోని 15(4), 16(4) ఆర్టికల్స్‌ను సవరించాలి. అపుడే బీసీలకు విద్యా– ఉద్యోగ రంగాలలో న్యాయం జరుగుతుంది.పట్నా హైకోర్టు తీర్పు తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇపుడు దేశంలోని ఓబీసీలంతా స్పష్టంగా మహాత్మా జ్యోతిబా ఫూలే ఆలోచనలతో తమిళనాడులో రామస్వామి పెరియార్ కొనసాగించిన ఉద్యమ స్ఫూర్తితో ఓబీసీ ఉద్యమం కొనసాగించవలసి ఉంది. నితీష్ ప్రభుత్వం ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నందున తమిళనాడులాగా ఒక చట్టం చేసి 9వ షెడ్యూల్లో చేర్చుకుని బిహారు రాష్ట్రం వరకు రిజర్వేషన్ల పెంపును అమలు జరుపుకునే అవకాశముంది. ప్రస్తుతం ఎన్డీఏ మిత్రత్వం బిహారుకు కలిసివచ్చే విధంగా ఉంది.దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒక్క తాటిపైకి వచ్చి బడుగులందరి తరఫున నిలిచి కేంద్రంపై బీసీ రిజర్వేషన్లు పెంచడానికై రాజ్యాంగ సవరణ చేయాలని ఒత్తిడి పెంచాలి. ఓబీసీల హక్కుల సాధన కోసం జాతీయోద్యమం రూపుదాల్చే సమయం ఆసన్నమయ్యింది.దేశంలో రిజర్వేషన్ల రక్షణ కోసం పాటు పడిన బీఆర్ అంబేడ్కర్ తర్వాత అంతగా కృషి చేసినవారు తమిళనాడు సామాజిక, రాజకీయ రంగాల నాయకులనే చెప్పాలి. ముఖ్యంగా వెనుకబడిన తరగతులకు విద్యా–ఉద్యోగాలలో రిజర్వేషన్ల పెంపుదల కోసం తమిళనాడులో మహోద్యమాలు జరిగాయి. పెరియార్ రామస్వామి చేసిన కృషి మరువలేనిది. రిజర్వేషన్లను న్యాయస్థానం అడ్డుకోకుండా చేయడంలో పెరియార్ రామస్వామి జరిపిన పోరాటం మరిచిపోలేనిది. అంబేడ్కర్ రిజర్వేషన్ల రక్షణ కోసం చేసిన పోరాటానికి కొనసాగింపుగా తమిళనాడులో పెరియార్, ఉత్తర భారతంలో రామ్ మనోహర్ లోహియా, కర్పూరీ ఠాకూర్లు చేసిన ఉద్యమాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు దేశవ్యాపితంగా ఓబీసీ రిజర్వేషన్ల కోసం జాతీయ ఉద్యమం రూపుదాల్చవలసి ఉంది. నేటి ఓబీసీ యువతరం, విద్యావంతులు ఈ ఉద్యమంలో కీలకంగా పాల్గొనాలి. బడుగు వర్గాల నుంచి వచ్చిన యువతరం బీసీలకు జరిగిన అన్యాయాన్ని లోతుగా అధ్యయనం చేయాలి. బీసీలను ఐకమత్యం చేసే పనిలో పాలుపంచుకోవాలి. ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉద్యోగ, సామాజిక రంగాలలో బీసీలకు న్యాయం జరిగేదాకా ఉద్యమపథంలో ముందుకు సాగక తప్పదు. న్యాయస్థానాల్లో న్యాయపోరాటం విధిగా చేయాలి.– జూలూరు గౌరీశంకర్, వ్యాసకర్త తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ చైర్మన్ -
ఆ ఉద్యోగాల్లో రిజర్వేషన్ చెల్లదు : హర్యానా హై కోర్టు
న్యూఢిల్లీ : స్థానికులకు తక్కువ వేతనాలున్న ప్రయివేటు ఉద్యోగాల్లో 75శాతం రిజర్వేషన్ కల్పిస్తూ హర్యానా ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్నిపంజాబ్, హర్యానా హై కోర్టు కొట్టివేసింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు పేర్కొంది. మరో ఏడాదిలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఈ టైమ్‌లో హర్యానా స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ యాక్ట్‌ను హై కోర్టు కొట్టివేయడం అధికార బీజేపీకి పెద్ద దెబ్బ అనే ప్రచారం జరగుతోంది. రాష్ట్రంలోకి భారీగా వలస వచ్చిన వారిని స్థానికంగా ప్రయివేటు ఉద్యోగాల్లోకి రాకుండా నిలువరించేందుకే ఈ చట్టం తీసుకువచ్చినట్టు ప్రభుత్వం అప్పట్లో తెలిపింది.ముఖ్యంగా 30 వేల రూపాయలలోపు వేతనాలున్న ఉద్యోగాల్లోకి వలసవచ్చినవారు చేరడం వల్ల స్థానికుల్లో పేదరికం పెరిగిపోతుందని పేర్కొంది. ఈ చట్టాన్ని 2020లో అసెంబ్లీలో పాస్ చేశారు.రాషష్ట్రంలో కీలకంగా ఉన్న జాట్ల ఓట్లపై కన్నేసి ఈ చట్టాన్ని తీసుకువచ్చినట్లు ప్రచారం జరిగింది. నిజానికి ఈ చట్టం దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జననాయక్ జనతా పార్టీ 2019 ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. బీజేపీ ప్రభుత్వంతో జననాయక్ జనతా పార్టీ చేరడమే కాకుండా పార్టీ నేత దుష్యంత్ చౌతాలా డిప్యూటీ సీఎంగా కూడా పనిచేస్తున్నారు. ఇదీచదవండి..ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో ముగిసిన పోలింగ్ -
రిజర్వేషన్ పేరుతో మహిళలను మోసం చేస్తున్నారు
-
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారకర్తగా ట్రాన్స్ జెండర్ లైలా
సాక్షి, వరంగల్: ‘చట్టసభల్లో రిజర్వేషన్‌తో అవకాశం కల్పిస్తే మేము రాజకీయంగా నిరూపించుకుంటూ.. సమాజానికి సేవ చేస్తాం’ అంటున్నారు.. రాష్ట్ర ఎన్నికల ప్రచారకర్త, ట్రాన్స్‌జెండర్ లైలా. తొలిసారిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రచారకర్తగా ట్రాన్స్‌జెండర్ లైలా ఎంపికయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3,600 మందికిపైగా ఉన్న ట్రాన్స్జెండర్లకు లైలా నాయకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ట్రాన్స్ జెండర్ సంక్షేమ బోర్డు సభ్యురాలిగా కూడా ఉన్న లైలాతో ‘సాక్షి’ బుధవారం ముచ్చటించింది. వివరాలు ఆమె మాటల్లోనే.. సంఖ్య పెరిగితే ప్రత్యేక పథకాలు.. రాష్ట్రంలో ఉన్న మా కమ్యూనిటీ సమస్యలపై అవగాహన ఉంది. లక్ష వరకు మా సంఖ్య ఉన్నా.. ఓటరు జాబితాలో మాత్రం 2,033 మందే కనిపిస్తున్నారు. చాలామంది మేల్, ఫిమేల్గా నమోదు చేసుకున్నారు. అందుకే మా సంఖ్య తక్కువగా కనిపిస్తోంది. మా మీద ఉన్న వివక్షతో కొంత మంది ట్రాన్స్‌జెండర్‌గా ఓటర్‌గా నమోదు చేసుకోవడం లేదు. గుర్తింపు, విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో బయటకు చెప్పుకునేందుకు ఇష్టపడడం లేదు. 2014లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కొంతమంది ధైర్యంగా ముందుకొచ్చి అదర్స్.. థర్డ్ జెండర్.. అనే కాలమ్‌లో ఓటరుగా నమోదు చేసుకున్నారు. మేమంతా 18 ఏళ్లు నిండిన వాళ్లమే. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునేలా నా వంతు పాత్ర నిర్వర్తిస్తా. అప్పుడే ప్రభుత్వాలు మాకు ప్రత్యేక పథకాలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. బాధ్యతగా భావిస్తున్నా.. గొప్ప గొప్ప సెలబ్రిటీలు, హీరో హీరోయిన్లను ఎన్నికల ప్రచార కర్తలుగా తీసుకుంటున్న తరుణంలో ఓ ట్రాన్స్‌జెండర్ అయిన నన్ను ఓ ఐకాన్‌గా తీసుకోవడం అరుదైన అవకాశంగా.. గొప్ప బాధ్యతగా భావిస్తున్నా. ఇంత గుర్తింపునిచ్చిన ఎన్నికల కమిషన్‌కు ధన్యవాదాలు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పోరాటాలు చేసి చాలావరకు సాధించుకున్నాం.. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కాస్త గుర్తింపు పెరిగింది. అధికారులు.. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల్లో ట్రాన్స్‌జెండర్స్‌పై అవగాహన పెరిగింది. కానీ, మార్పు రావాలంటే ప్రభుత్వాలు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి. అవకాశాలు ఇవ్వాలి. ప్రత్యేక గుర్తింపును ఇచ్చినప్పుడు మాత్రమే మరింత ముందుకెళ్లే.. అవకాశం ఉంటుంది. రిజర్వేషన్ల వల్లనే ఎక్కువ అవకాశాలు దొరుకుతాయి. విద్య, ఉద్యోగం, వైద్యం, రాజకీయ రంగాల్లో కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేక రిజర్వేషన్ ఇచ్చి ప్రోత్సహించాలి.. అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా.. అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా నిరూపించుకుంటాం.. అవకాశం ఏ రాజకీయ పార్టీ ఇచ్చినా.. చట్టసభల్లో ఉండాలని కోరుకుంటాం. మాకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలి. ఎందుకంటే చట్టసభల్లో మాత్రమే మన పాలసీలు, జీఓలు వస్తుంటాయి. ఎక్కడైతే పాలసీలు తయారవుతున్నాయో అక్కడ మా వాయిస్ ఉండాలని కోరుకుంటాం. కాబట్టి ఏ రాజకీయ పార్టీ అవకాశం ఇచ్చినా.. మా కమ్యూనిటీ ఉపయోగించుకుంటుంది. మాకు అది అవసరం కూడా.. అదే సమయంలో ఎన్నికల ప్రచార కర్తగా ప్రతి ఒక్క అర్హులు ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పిస్తా.. ఓటును వినియోగించడం ద్వారా సరైన సేవ చేసే వ్యక్తిని ఎన్నుకునే అవకాశం ఉంటుందని విడమరిచి చెబుతా. ఓటు గొప్ప ఆయుధం కాబట్టి ఓట్లు వేసే రోజు పోలింగ్ బూత్‌కు వెళ్లాలి. అప్పుడే సరైన ప్రజాస్వామ్యాన్ని, నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. సరైన నాయకుడు వస్తేనే మన జీవితాల్లో మార్పు వస్తుంది. -
నాన్చకండి.. నిర్ణయం తీసుకోండి: మాజీ బీజేపీ మంత్రి
ముంబై: మహారాష్ట్రలో మరాఠా సామాజిక వర్గానికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోరుతూ చేస్తోన్న పోరు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో బీజీపీ జాతీయ సెక్రెటరీ పంకజా ముండే ఈ అంశంపై మాట్లాడుతూ ప్రభుత్వం కంటితుడుపు హామీలివ్వడం కాకుండా కచ్చితమైన చర్యలు చేపట్టాలని నిరసనకారులతో చర్చలు జరిపి దీక్షను విరమింపజేయాలని కోరారు. కేంద్రానికి అప్పగించండి.. బీజేపీ మాజీ మంత్రి పంకజా ముండే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శివశక్తి పరాక్రమ యాత్రలో భాగంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆమె మరాఠా రిజర్వేషన్లపై ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరాఠాలకు రిజర్వేషన్లు ఎంతవరకు పెంచవచ్చన్న ప్రణాళిక ప్రభుత్వం వద్ద ప్రణాళిక ఉండే ఉంటుంది కాబట్టి నిరసనకారులతో ధైర్యంగా చర్చలు నిర్వహించాలని కోరారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి 50% కంటే రిజర్వేషన్ ఇవ్వలేమనిపిస్తే అప్పుడు కేంద్రం దృష్టికి సమస్యను తీసుకుని వెళ్తే వారు రాజ్యాంగబద్ధంగా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తారని అన్నారు. హామీలొద్దు.. మరాఠా సమాజం ఇప్పటికే విసిగిపోయిందని కచ్చితమైన కార్యాచరణ కావాలని అన్నారు. అనవసరంగా మరాఠాలు ఓబీసీలకు మధ్య తగువులు పెట్టవద్దని విన్నవించారు. అదే విధంగా నిరసనకారులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ... మీ పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆందోళనలను విరమించి ప్రభుత్వానికి సహకరించాలన్నారు. క్లాజ్‌ను తొలగించండి.. ఇటీవల జల్నా జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇప్పటికే 11 రోజులుగా దీక్షలో ఉన్న మనోజ్ జరాంగే పాటిల్ దీక్షను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరాఠ్వాడా ప్రాంతంలోని మరాఠాలకు కుంబీ కుల ధ్రువీకరణ పత్రం పొందుకుని ఓబీసీ రిజర్వేషన్ సాధించాలంటే వంశపారపర్యం ధ్రువీకరణ పత్రం తప్పదంటూ ప్రభుత్వ చేసిన తీర్మానం(జీఆర్) నుంచి ఆ క్లాజ్‌ను తొలగించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఆందోళనలు గడిచిన వారం రోజుల్లో మరింత ఉధృతం చేశారు నిరసనకారులు . అహ్మద్‌నగర్, , ధారాశివ్, నాందేడ్, జల్నా, హింగోలి, ఔరంగాబాద్, పర్భని జిల్లాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. బహిరంగ సభలు, ర్యాలీలు, బంద్‌లతో ఆయా జిల్లాలు అట్టుడుకుతున్నాయి. ఇది కూడా చదవండి: TS Election 2023: అమిత్‌షా సభ విజయవంతమైనా.. చేరికలు లేక డీలా..! -
గ్రేటర్ ఎన్నికలు: ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేం..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్(జీహెచ్ఎంసీ) ఎన్నికలపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. గ్రేటర్ ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. మున్సిపల్యాక్ట్ ప్రకారం మేయర్, కార్పొరేటర్ల రిజర్వేషన్ల కేటాయింపు సక్రమంగా జరగలేదని వ్యాయవాది రచనారెడ్డి హైకోర్టుకు వివరించారు. వెంటనే బల్దియా ఎన్నికలను నిలిపివేయాలని హైకోర్టును కోరారు. దీనికి స్పందించిన హైకోర్టు గ్రెటర్ ఎన్నికలకు మరో వారం రోజులు ఉన్న ఈ సమయంలో తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. జీహెచ్ఎంసీ ఎన్నికలపై దాఖమైన పలు పిటిషన్లు, రిట్ పిటిషన్లను డిసంబర్ 23న విచారణ చేపడతామని తెలిపింది. తదుపరి విచారణను హైకోర్టు డిసెంబర్ 23కు వాయిదా వేసింది. -
రిజర్వేషన్ల ప్రాణంతీస్తున్న ప్రభుత్వాలు
బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాలను గండి కొట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడుతున్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే ఈ వర్గాల ప్రజలకు అన్ని రంగాల్లో జనాభా ప్రకారం కోటా ఇవ్వడాన్ని చట్టబద్ధం చేసింది. కాంట్రాక్టులలో, పారిశ్రామిక పాలసీలలో, నామినేటెడ్ పోస్టులలో జనాభా ప్రకారం కోటా ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అమ్మఒడి, రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ వంటి పథకాలతో పేదకులాల పిల్లలు ప్రతి ఒక్కరూ చదువుకునేటట్లు చేశారు. విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాల్లో దేశమంతటా జరుగుతున్న అన్యాయంపై ఐక్యంగా గళమెత్తకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీల బతుకు అంధకారంలో మునిగిపోతుంది. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పథకం ప్రకారం బీసీ రిజర్వేషన్లకు గండికొట్టే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బీసీ/ ఎస్సీ/ఎస్టీ వర్గాలకు అన్ని రంగాలలో జనాభా ప్రకారం కోటా ఇవ్వడాన్ని చట్టబద్ధం చేశారు. కాంట్రాక్టులలో, పారిశ్రామిక పాలసీలలో, నామినేటెడ్ పోస్టులలో జనాభా ప్రకారం కూడా ఇస్తూ చట్టబద్ధం చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అలాగే ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ చొప్పున 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, చైర్మన్‌తో సహా 13 మంది డైరెక్టర్లను నియమించి, ఆయా కులాల నాయకత్వాన్ని పెంచారు. బడ్జెట్ కేటాయించి ఆయా కులాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలని పాఠశాల స్థాయిలో అమ్మ ఒడి పథకం కింద ప్రతి ఒక్కరికీ 15 వేలు చొప్పున అలాగే ఇంజనీరింగ్, మెడిసిన్, ఇతర కోర్సులు చదివే విద్యార్థులకు పూర్తిగా ఫీజు రియింబర్స్‌మెంట్ మంజూరు, కాలేజీ స్థాయిలో 20 వేల స్కాలర్షిప్ మంజూరు చేస్తూ పేద కులాలను ప్రతి ఒక్కరూ చదువుకొనేటట్లు చేశారు. కానీ, ఇంకొకవైపు కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది. నీట్లో కేంద్ర ప్రభుత్వ కోటా కింద వచ్చే మెడికల్ అడ్మిషన్లలో బీసీ రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. లక్నోలోని అంబేడ్కర్ యూనివర్సిటీ విద్యాసంస్థల అడ్మిషన్లలో రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. అలాగే నల్సార్ యూనివర్సిటీ ‘లా’–అడ్మిషన్లలో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. దీనికి తోడు క్రీమీలేయర్ పరిధిలో మరి కొన్ని వర్గాలను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను జాతీయ బీసీ కమిషన్, అలాగే ఓబీసీ–పార్లమెంటరీ కమిటీ వ్యతిరేకించడంతో ఆ ప్రతిపాదన ఉపసంహరించుకుంది. అలాగే 2021లో చేపట్టబోయే జనాభా గణనలో బీసీ కులాల వారీగా జనాభా గణన చేయరాదని నిర్ణయించింది. 2018 ఆగస్టు 31న బీసీ కులాల జనాభా లెక్కలు తీయాలని కేంద్ర హోంశాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నిర్ణయించింది. ఆ తరువాత ఇటీవల ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. బీసీల జనాభా లెక్కలు లేకపోవడంతో పంచాయతీరాజ్ సంస్థలలో ఏయే స్థానాలు బీసీలకు కేటాయించాలో ఎంత శాతం నిర్ణయించాలో తెలియక ప్రభుత్వాలే ఇబ్బంది పడుతున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం బీసీ జాబితాను గ్రూపులుగా వర్గీకరణ చేయడానికి నియమించిన జస్టిస్ రోహిణి కమిటీకి బీసీల జనాభా లెక్కలు అందుబాటులో లేక వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఇక తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒక పథకం ప్రకారం రిజర్వేషన్లకు గండి కొడుతోంది. ఇటీవల ప్రారంభించిన 5 ప్రైవేటు యూనివర్సిటీలలో బీసీ/ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయరాదని నిర్ణయించారు. రాజ్యాంగం ప్రకారం ఇవ్వవలసిన రిజర్వేషన్లను ఈ యూనివర్సిటీలలో పెట్టబోమని దర్జాగా విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. గతంలో ఈ ఐదు వర్సిటీలకు ఒక్కొక్క యాజమాన్యం క్రింద 20 నుంచి 50 ఇంజనీరింగ్, తదితర కాలేజీలు ఉండేవి. రిజర్వేషన్లు ఎత్తివేయడానికే ఈ కాలేజీలను యూని వర్సిటీలుగా మార్చారా! ప్రైవేటు విద్యాసంస్థల్లో బీసీ/ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లు పెట్టాలని 2006లో పార్లమెంటులో చట్టం చేశారు. 1980లో అప్పటి ప్రభుత్వ ఉమ్మడి రాష్ట్రంలో ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ ప్రారంభించినపుడు బీసీ/ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లు పెట్టలేదు. అప్పుడు బీసీ విద్యార్థి సంఘం పెద్దఎత్తున ఆందోళన చేయగా ప్రభుత్వం దిగివచ్చి ప్రైవేటు విద్యాసంస్థలలో రిజర్వేషన్లు పెట్టాలని అసెంబ్లీలో చట్టం చేసింది. అప్పటి నుంచి ప్రైవేటు ఇంజనీరింగ్ పీజీ మెడికల్ కాలేజీలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రైవేటు యూనివర్సిటీలలో బీసీ/ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధం. అలాగే పంచాయతీరాజ్ ఎన్నికలలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డ్ మెంబర్ ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుండి 22 శాతంకు తగ్గించారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ కులాలవారు ఓట్లు వేసి అగ్ర కులాల వారిని గత 74 ఏళ్లలో 32 మందిని సీఎంలను చేశారు. వేలాది మందిని ఎంపీలు, ఎమ్మెల్యేలుగా, కేంద్ర మంత్రులు, ప్రధాన మంత్రులుగా చేశారు. కానీ బీసీలు కనీసం సర్పంచులయితే కూడా ఈ అగ్రకుల నాయకులు ఓర్వలేక పోతున్నారు. బీసీ సంక్షేమ సంఘం 1986లో పోరాడి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పెట్టిస్తే ఓర్వలేని అగ్రకుల ప్రభుత్వాలు వీటిని 34 శాతం నుండి 22 శాతంకు తగ్గించారు. బీసీ కులాల జనాభా గ్రామీణ ప్రాంతాలలో 64 శాతం ఉంటే 22 శాతంకు రిజర్వేషన్లను తగ్గించడంలో ఏమైనా న్యాయం ఉందా! మొత్తం గ్రామ పంచాయతీలు 12,751 కాగా 56 శాతం జనాభా గల బీసీలకు 6,822 గ్రామ పంచాయతీలు దక్కాలి. పోనీ గతంలో మాది రిగా 34 శాతం రిజర్వేషన్లు అమలు ప్రకారం 4,300 గ్రామపంచాయతీలు బీసీలకు దక్కాలి. కానీ బీసీ రిజర్వేషన్లు లెక్కించేటపుడు గిరిజనులకు కేటాయించిన రిజర్వేషన్లను కట్ చేసిన తర్వాత వచ్చే సంఖ్య ఆధారంగా లెక్కించి అన్యాయం చేశారు. దీనితో కేవలం 2,332 పంచాయితీలను మాత్రమే బీసీలకు కేటాయించారు. అంటే 18 శాతం కేటాయించి బీసీలకు అన్యాయం చేశారు. రిజర్వేషన్లు తగ్గించడం వలన రెండు వేల గ్రామ సర్పంచులు, 23 వేల వార్డు మెంబర్లు బీసీలకు రావలసినవి దక్కకుండా పోయాయి. అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్, మండల్ పరిషత్ చైర్మన్ పదవులను కూడా బీసీ రిజర్వేషన్లను తగ్గించి బీసీల నాయకత్వాన్ని ఉద్దేశపూర్వకంగా అణచివేశారు. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో ఉన్న కేసును సమర్థిస్తూ వాదించవలసిన రాష్ట్ర ప్రభుత్వం కేసును ఉపసంహరించుకుంది. బి.సి రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతంకు తగ్గించారు. మెడికల్ కౌన్సెలింగ్‌లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బి.సి రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయకుండా 550 జీవోకి గండి కొట్టారు. మెడికల్ కౌన్సెలింగ్ ఎంబీబీఎస్ అడ్మిషన్ల సందర్భంగా గత 20 ఏళ్లుగా పాటిస్తున్న జీవో నంబర్ 550 ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ జీవోకు సవరణ చేస్తూ 114 జీవో తెచ్చి రిజర్వేషన్ వర్గాలకు అన్యాయం చేశారు. రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయకుండా ఈ కులాలకు అన్యాయం చేస్తున్నారని, దీనిని సరిదిద్దాలని వైద్య శాఖ అధికారులను బీసీ సంఘాలు కోరగా, సీఎం కార్యాలయం వారు జోక్యం చేసుకొని బీసీలకు వ్యతిరేకంగా ఒత్తిడి తెచ్చి ఈ కులాలకు రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయకుండా అన్యాయం చేశారు. దీని మూలంగా గత ఏడాది 262 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎంబీబీఎస్ సీట్లు లభించకుండా అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో రిజర్వేషన్లలో జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని కోరగా వెంటనే సీఎం జగన్మోహన్రెడ్డి సరిదిద్దుతూ జీఓ నం. 56 జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా సరిదిద్దాలని కోరినా ఒక సంవత్సర కాలంగా గడిచిన రిజర్వేషన్ల అక్రమాలను సరిదిద్దడం లేదు. బీసీల విద్యా–ఉద్యోగ రిజర్వేషన్ల అమలుపై టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2014లోనే క్రీమీలేయర్ నిబంధన విధించి అన్యాయం చేశారు. గత ప్రభుత్వాలు 1993 నుంచి అంటే దాదాపు 22 ఏళ్ల నుంచి క్రీమీలేయర్ పెట్టలేదు. క్రీమీలేయర్ విధించరాదని బీసీ సంఘాలు గత ప్రభుత్వాలను కోరితే ఆపివేశారు. కానీ, టీఆర్ఎస్ అదికారంలోకి రాగానే బీసీ వ్యతిరేకతను వెళ్ళగక్కుతోంది. క్రీమీలేయర్ నిబంధన విధించి బీసీ రిజర్వేషన్లు బీసీలకు దక్కకుండా అన్యాయం చేశారు. అన్ని వర్గాలకు పారిశ్రామిక పాలసీ ప్రకటించారు. కానీ 52 శాతం జనాభా గల బీసీలకు పారిశ్రామిక పాలసీ ఇంతవరకు ప్రకటించలేదు, అంటే బీసీలు పరిశ్రమలు, కంపెనీలు పెట్టడం కూడా ఈ అగ్రకుల ప్రభుత్వాలు ఓర్వలేక పోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పారిశ్రామిక పాలసీలో, కాంట్రాక్టులలో, నామినేటెడ్ పోస్టులలో బీసీలకు 50 శాతం కోటా ఇచ్చారు. కాని తెలంగాణలో మాత్రం ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు. డబుల్ బెడ్రూం పథకంలో ఇతర వర్గాలకు జనాభాకు మించి కోటా కేటాయిస్తూ జీఓ జారీ చేశారు. కానీ బీసీల జనాభా 52 శాతం ఉంటే డబుల్ బెడ్రూం పథకంలో 15 శాతం కేటాయించడం చూస్తే ఎంత అన్యాయం చేస్తున్నారో తెలుస్తుంది. ప్రస్తుతం బీసీలకు విద్యా– ఉద్యోగాలలో 29 శాతం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. ఈ కోటా కూడా డబుల్ బెడ్ రూంలలో ఇవ్వకపోవడం చూస్తే పాలకుల బీసీ వ్యతిరేక వైఖరి స్పష్టంగా కన్పిస్తుంది. సంక్షేమ అభివృద్ధి పథకాలలో, పేదరిక నిర్మూలన పథకాలలో సామాజిక వర్గాలకు జనాభా ప్రకారం కోటా ఇవ్వడం సంప్రదాయం. కానీ, ఇందుకు భిన్నంగా తగ్గించి ఇవ్వడం న్యాయమా? ఒకవైపు ఈ కులాలలో చైతన్యం పెరుగుతోంది. విద్యా, ఉద్యోగాలతో పాటు అన్ని రంగాలలో తమ వాటా తమ జనాభా ప్రకారం కావాలని గొంతెత్తి పోరాడుతున్నారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లకు గండికొట్టే ఆలోచనలకు వ్యతిరేకంగా బీసీ/ ఎస్సీ/ఎస్టీ వర్గాలు పోరాడకపోతే భవిష్యత్ అంధకారమౌతుంది. వ్యాసకర్త ఆర్. కృష్ణయ్య అధ్యక్షులు, జాతీయ బి.సి. సంక్షేమ సంఘం మొబైల్ : 90000 09164 -
పదోన్నతుల్లో రిజర్వేషన్లు రద్దు
న్యూఢిల్లీ: పదోన్నతులకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన రిజర్వేషన్ చట్టాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ‘ప్రభుత్వ ఉద్యోగులకు రిజర్వేషన్ల ఆధారంగా ప్రమోషన్లు కల్పించే చట్టం – 2002’ ను రద్దు చేసిన అత్యున్నత న్యాయస్థానం.. ఈ చట్టం ‘కాచ్ అప్ రూల్’కు విరుద్ధమని పేర్కొంది. ప్రమోషన్లకు రిజర్వేషన్లు కల్పించే ముందు.. ప్రాతినిధ్య కొరత, వెనకబాటుతనం, పూర్తి సామర్థ్యం తదితరాలు ఉన్నాయో లేదో పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. ఈ చట్టంలోని అంశాలు ఆర్టికల్ 14 (సమానత్వపు హక్కు), ఆర్టికల్ 16 (ప్రభుత్వ సర్వీసుల అవకాశాల్లో సమానత్వం)ల పరిధి దాటి ఉన్నాయని న్యాయమూర్తులు జస్టిస్ ఏకే గోయల్, జస్టిస్ యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రాతినిధ్య కొరత, వెనకబాటుతనం తదితరాలు ఉన్నప్పుడే రిజర్వేషన్ల ద్వారా ప్రమోషన్లు ఇవ్వాలని వివరించింది.