ముంబై: మహారాష్ట్రలో మరాఠా సామాజిక వర్గానికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోరుతూ చేస్తోన్న పోరు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో బీజీపీ జాతీయ సెక్రెటరీ పంకజా ముండే ఈ అంశంపై మాట్లాడుతూ ప్రభుత్వం కంటితుడుపు హామీలివ్వడం కాకుండా కచ్చితమైన చర్యలు చేపట్టాలని నిరసనకారులతో చర్చలు జరిపి దీక్షను విరమింపజేయాలని కోరారు.
కేంద్రానికి అప్పగించండి..
బీజేపీ మాజీ మంత్రి పంకజా ముండే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శివశక్తి పరాక్రమ యాత్రలో భాగంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆమె మరాఠా రిజర్వేషన్లపై ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరాఠాలకు రిజర్వేషన్లు ఎంతవరకు పెంచవచ్చన్న ప్రణాళిక ప్రభుత్వం వద్ద ప్రణాళిక ఉండే ఉంటుంది కాబట్టి నిరసనకారులతో ధైర్యంగా చర్చలు నిర్వహించాలని కోరారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి 50% కంటే రిజర్వేషన్ ఇవ్వలేమనిపిస్తే అప్పుడు కేంద్రం దృష్టికి సమస్యను తీసుకుని వెళ్తే వారు రాజ్యాంగబద్ధంగా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తారని అన్నారు.
హామీలొద్దు..
మరాఠా సమాజం ఇప్పటికే విసిగిపోయిందని కచ్చితమైన కార్యాచరణ కావాలని అన్నారు. అనవసరంగా మరాఠాలు ఓబీసీలకు మధ్య తగువులు పెట్టవద్దని విన్నవించారు. అదే విధంగా నిరసనకారులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ... మీ పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆందోళనలను విరమించి ప్రభుత్వానికి సహకరించాలన్నారు.
క్లాజ్‌ను తొలగించండి..
ఇటీవల జల్నా జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇప్పటికే 11 రోజులుగా దీక్షలో ఉన్న మనోజ్ జరాంగే పాటిల్ దీక్షను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరాఠ్వాడా ప్రాంతంలోని మరాఠాలకు కుంబీ కుల ధ్రువీకరణ పత్రం పొందుకుని ఓబీసీ రిజర్వేషన్ సాధించాలంటే వంశపారపర్యం ధ్రువీకరణ పత్రం తప్పదంటూ ప్రభుత్వ చేసిన తీర్మానం(జీఆర్) నుంచి ఆ క్లాజ్‌ను తొలగించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మహారాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఆందోళనలు గడిచిన వారం రోజుల్లో మరింత ఉధృతం చేశారు నిరసనకారులు . అహ్మద్‌నగర్, , ధారాశివ్, నాందేడ్, జల్నా, హింగోలి, ఔరంగాబాద్, పర్భని జిల్లాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. బహిరంగ సభలు, ర్యాలీలు, బంద్‌లతో ఆయా జిల్లాలు అట్టుడుకుతున్నాయి.
ఇది కూడా చదవండి: TS Election 2023: అమిత్‌షా సభ విజయవంతమైనా.. చేరికలు లేక డీలా..!
Comments
Please login to add a commentAdd a comment