marathwada region
-
నాన్చకండి.. నిర్ణయం తీసుకోండి: మాజీ బీజేపీ మంత్రి
ముంబై: మహారాష్ట్రలో మరాఠా సామాజిక వర్గానికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోరుతూ చేస్తోన్న పోరు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో బీజీపీ జాతీయ సెక్రెటరీ పంకజా ముండే ఈ అంశంపై మాట్లాడుతూ ప్రభుత్వం కంటితుడుపు హామీలివ్వడం కాకుండా కచ్చితమైన చర్యలు చేపట్టాలని నిరసనకారులతో చర్చలు జరిపి దీక్షను విరమింపజేయాలని కోరారు. కేంద్రానికి అప్పగించండి.. బీజేపీ మాజీ మంత్రి పంకజా ముండే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శివశక్తి పరాక్రమ యాత్రలో భాగంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆమె మరాఠా రిజర్వేషన్లపై ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరాఠాలకు రిజర్వేషన్లు ఎంతవరకు పెంచవచ్చన్న ప్రణాళిక ప్రభుత్వం వద్ద ప్రణాళిక ఉండే ఉంటుంది కాబట్టి నిరసనకారులతో ధైర్యంగా చర్చలు నిర్వహించాలని కోరారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి 50% కంటే రిజర్వేషన్ ఇవ్వలేమనిపిస్తే అప్పుడు కేంద్రం దృష్టికి సమస్యను తీసుకుని వెళ్తే వారు రాజ్యాంగబద్ధంగా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తారని అన్నారు. హామీలొద్దు.. మరాఠా సమాజం ఇప్పటికే విసిగిపోయిందని కచ్చితమైన కార్యాచరణ కావాలని అన్నారు. అనవసరంగా మరాఠాలు ఓబీసీలకు మధ్య తగువులు పెట్టవద్దని విన్నవించారు. అదే విధంగా నిరసనకారులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ... మీ పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆందోళనలను విరమించి ప్రభుత్వానికి సహకరించాలన్నారు. క్లాజ్‌ను తొలగించండి.. ఇటీవల జల్నా జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇప్పటికే 11 రోజులుగా దీక్షలో ఉన్న మనోజ్ జరాంగే పాటిల్ దీక్షను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరాఠ్వాడా ప్రాంతంలోని మరాఠాలకు కుంబీ కుల ధ్రువీకరణ పత్రం పొందుకుని ఓబీసీ రిజర్వేషన్ సాధించాలంటే వంశపారపర్యం ధ్రువీకరణ పత్రం తప్పదంటూ ప్రభుత్వ చేసిన తీర్మానం(జీఆర్) నుంచి ఆ క్లాజ్‌ను తొలగించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఆందోళనలు గడిచిన వారం రోజుల్లో మరింత ఉధృతం చేశారు నిరసనకారులు . అహ్మద్‌నగర్, , ధారాశివ్, నాందేడ్, జల్నా, హింగోలి, ఔరంగాబాద్, పర్భని జిల్లాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. బహిరంగ సభలు, ర్యాలీలు, బంద్‌లతో ఆయా జిల్లాలు అట్టుడుకుతున్నాయి. ఇది కూడా చదవండి: TS Election 2023: అమిత్‌షా సభ విజయవంతమైనా.. చేరికలు లేక డీలా..! -
మాకూ కావాలి.. మిషన్ భగీరథ
ప్రాజెక్టు పరిశీలనకోసం రాష్ట్రానికి వచ్చిన మహారాష్ట్ర మంత్రి లోనికర్ సాక్షి, హైదరాబాద్: తాగునీటి ఎద్దడి అధికంగా ఉండే తమ రాష్ట్రానికి మిషన్ భగీరథ తరహా ప్రాజెక్టు ఎంతో అవసరమని మహారాష్ట్ర తాగునీటి సరఫరా శాఖ మంత్రి బాబన్‌రావ్ లోనికర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ భగీరథ ప్రాజెక్టును పరిశీలించేందుకు ఆయన శనివారం రాష్ట్రానికి వచ్చారు. మంత్రితో పాటు వచ్చిన ఇంజనీర్ల బృందానికి మిషన్ భగీరథ ప్రాజె క్టు స్వరూపం, పనుల పురోగతిపై ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ భౌగోళిక స్వరూపం, నీటి ఎద్దడి ప్రాంతాలు.. తదితర అంశాలను వివరించారు. 90% నీటిని గ్రావిటీ ద్వారానే సరఫరా చేస్తున్నందున విద్యుత్ వినియోగం కూడా తక్కువగానే ఉంటుందన్నారు. భగీరథ ప్రాజెక్టు టెండర్లలో అనుసరించిన విధానాల కారణంగా ఆర్థిక పరిపుష్టి కలిగిన వర్క్ ఏజెన్సీలే పనులను చేస్తున్నాయని, నిర్వహణ బాధ్యతలను కూడా వాటికే అప్పగించినందున నాణ్యతలో రాజీపడే అవకాశం లేదని అన్నారు. మంత్రి లోనికర్ మాట్లాడుతూ.. మూడేళ్లుగా మరట్వాడా ప్రాంతంలో తాగునీటి ఎద్దడి అధికంగా ఉన్నందున, మిషన్ భగీరథ తరహా పథకాన్ని అమలు చేయాలని తమ ప్రభుత్వం యోచిస్తోందని చెప్పారు. ప్రాజెక్టుకు సంబంధించి అవసరమైన అనుమతులను కూడా తక్కువ సమయంలోనే పొందడం, మిషన్ భగీరథ ప్రాజెక్టును దేశానికి ఆదర్శంగా నిలపడంలో తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ల కృషి అభినందనీయమన్నారు. భగీరథ స్ఫూర్తితోనే త్వరలో తాము కూడా ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. -
కరువు కోరల్లో మరాఠ్వాడా
సాక్షి, ముంబై: మరాఠ్వాడా ప్రాంతాన్ని కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించాలని శివసేన విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గవర్నర్ సి.హెచ్.విద్యాసాగర్‌రావుతో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ప్రతిపక్షనాయకుడు ఏక్నాథ్ షిండే సహా ఆ పార్టీ ప్రతినిధుల బృందం గురువారం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా మరాఠ్వాడాలో కరువు పీడిత ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఆయనకు విన్నవించారు. ఉద్ధవ్ ఠాక్రే తమ పార్టీకి చెందిన 63 మంది ఎమ్మెల్యేలతో కలిసి రెండు రోజుల పాటు మరాఠ్వాడా ప్రాంతంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ బృందం మరాఠ్వాడాలోని బాధితులతో ప్రత్యక్షంగా భేటీ వారి బాధలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గురువారం ఉదయం గవర్నర్‌ను కలిసి మరాఠ్వాడా కరువు పరిస్థితిపై నివేదిక సమర్పించారు. ఆ ప్రాంతంలో కరువు రావడం వరుసగా ఇది మూడో సంవత్సరమని, అక్కడి ప్రజలు తాగేందుకు నీరు లేక అల్లాడుతున్నారని వివరించారు. వేసిన పంటలు నీరు లేక ఎండిపోతున్నాయన్నారు. బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించలేక అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వివరించారు. మరాఠ్వాడాలోని ఎనిమిది జిల్లాల్లో మొత్తం 8,536 గ్రామాలు ఉండగా అందులో 8004 గ్రామాల్లో కరువు తాండవిస్తోందని, వారందరికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని గవర్నర్‌కు విన్నవించారు. రైతులు తీవ్రంగా నష్టపోవడ ంవల్ల మరాఠ్వాడాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని కోరారు. విద్యార్థులందరి ఫీజులు, 10,12 తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజులు, రైతుల రుణాలు మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రైతులకు నిలిపివేసిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని, విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని, కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఆర్థిక సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి చేరే విధంగా ఏర్పాటు చేయాలని విన్నవించారు. నష్టపోయిన రైతులకు తక్షణం ఎకరానికి కనీసం రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేయాలన్నారు. మరాఠ్వాడా ప్రాంతానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న 183 నీటి ప్రాజెక్టుల పనులు వెంటనే ప్రారంభించాలని, ఆ ప్రాంతానికి చెందాల్సిన నీటిని వెంటనే ఉజనీ, జైక్వాడి డ్యాంల నుంచి విడుదల చేయాలని కోరారు. కాగా, శివసేన విజ్ఞప్తికి గవర్నర్ స్పందిస్తూ త్వరలో మరాఠ్వాడా ప్రాంతంలో పర్యటిస్తానని హామీ ఇచ్చారు. ప్రత్యక్షంగా రైతులతో భేటీ అయ్యి సమస్యలు అడిగి తెలుసుకుంటానని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలూ విభేదాలు పక్కనబెట్టి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రైతులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. -
ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఠాకూర్!
సాక్షి, ముంబై: బీజేపీ మహారాష్ట్ర ప్రదేశ్ అధ్యక్ష బాధ్యతలను మరఠ్వాడా రీజియన్‌కు చెందిన నాయకుడికి అప్పగించనున్నారు. ఈ మేరకు పార్టీలో ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సుజిత్‌సింగ్ ఠాకూర్‌కు ఈ పదవిని కట్టబెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా మహారాష్ట్ర ప్రదేశ్ అధ్యక్ష పదవిలో ఎవరిని నియమించాలో తెలియక నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆ పదవి దక్కించుకునేందుకు అనేక మంది పైరవీలు కూడా చేశారు. కాని ఒకరి కట్టబెడితే మరొక రు అసంతృప్తి చెందుతారని భావించి ‘ఒక వ్యక్తి- ఒక పదవి’ అనే సూత్రాన్ని అనుసరిస్తూ ఠాకూర్ పేరు ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ పదవికి ఠాకూర్‌తోపాటు ముంబై బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు ఆశీష్ శేలార్, సీనియర్ నాయకుడు రఘునాథ్ కులకర్ణి పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి. కాని సామాజిక, ప్రాదేశిక సమీకరణానుసారం ఠాకూర్ పేరు అగ్రస్థానంలో ఉంది. దీంతో ఆయనకే కట్టబెట్టాలనే నిర్ణయానికొచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. గత 25 సంవత్సరాల నుంచి ఆయన పార్టీలో కొనసాగుతూ స్థానిక స్థాయిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. బీజేపీలో కీలక నాయకులందరితో సత్సంబంధాలు ఉన్నాయి. దివంగత గోపినాథ్ ముండేకు అత్యంత సన్నిహితుడనే పేరుంది. మైనార్టీ సమాజానికి చెందిన ఠాకూర్ ఉస్మానాబాద్ జిల్లా పరాండా గ్రామానికి చెందిన వారు. ఇదివరకు ఆయన భారతీయ జనతాపార్టీ యువ మోర్చకు ప్రదేశ్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఉంది. ప్రదేశ్ కార్యవర్గంలో కార్యదర్శిగా, ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. -
మరఠ్వాడాలో కరువు
సాక్షి, ముంబై: వర్షాలు ముఖం చాటేయడంతో మహారాష్ట్రలో ముఖ్యంగా మరఠ్వాడా రీజియన్‌లో మళ్లీ కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. మూడేళ్లుగా ఇక్కడ కరువు కరాళ నృత్యం చేస్తుండటంతో ప్రభుత్వం ఇప్పుడు దీన్ని సీరియస్‌గా తీసుకుంది. మరఠ్వాడా రీజియన్‌లోని 123 తాలూకాలను కరువు ప్రాంతంగా ప్రకటించాలని నిర్ణయించింది. వర్షా కాలం ప్రారంభమై దాదాపు రెండున్నర నెలలు కావస్తున్నప్పటికీ ఈ రీజియన్‌లో ఇంతవరకు 50 శాతం వర్షాలు కూడా పడలేదు. దీంతో ఇక్కడ పరిస్థితి మరింత విషమించడంతో కరువు ప్రాంతంగా ప్రకటించాలని నిర్ణయం తీసుకుంది. ఆ ప్రకారం ఇక్కడి తాలూకాల్లో వ్యవసాయం పనులకు అమర్చుకున్న విద్యుత్ మోటార్ల బిల్లులో 33 శాతం మాఫీ, విద్యార్థుల పరీక్ష ఫీజు చేయాలని నిర్ణయించింది. కరువు ప్రాంతాలను ప్రకటించే ముందు జిల్లాలవారీగా కాకుండా తాలూకాల వారీగా అధ్యయనం చేశారు. ఇందులో 123 తాలూకాల్లో కరువు తీవ్రంగా ఉందని తేలింది. ఆగస్టులో సరాసరి 68.50 శాతం వర్షం కురిసింది. దీంతో జలాశయాల్లో నీటి మట్టం 61 శాతానికి చేరుకుంది. గత ఏడాది ఇదే సమయంలో 73 శాతం ఉండేది. మరఠ్వాడా రీజియన్‌లోని అన్ని డ్యాములు కలిపితే సరాసరి 19 శాతం మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయి. ఔరంగాబాద్, లాతూర్, జాల్నా, బీడ్, ఉస్మానాబాద్, నాందేడ్, పర్భణి, హింగోలి, బుల్డాణ, చంద్రాపూర్, యావత్మాల్ ఇలా 11 జిల్లాల్లో 50 శాతానికి కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో ఈ జిల్లాలోని తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తెలిపారు. ఇదిలాఉండగా ఔరంగాబాద్, జాల్నా, హింగోలి, పర్భణి, ఉస్మానాబాద్, బీడ్, బుల్డాణ, చంద్రాపూర్, యవత్మాల్, లాతూర్, నాందేడ్ జిల్లాల్లో కేవలం 26-50 శాతం పొలం పనులు మాత్రమే ప్రారంభమయ్యాయి. అదేవిధంగా రాయ్‌గఢ్, నాసిక్, షోలాపూర్, కొల్హాపూర్, అకోలా, వాషిం, నాందుర్బార్, భండారా, గడ్చిరోలి, అహ్మద్‌నగర్ జిల్లాల్లో రైతులు 51-75 శాతం పనులు మాత్రమే చేపట్టారు. రత్నగిరి, సింధుదుర్గ్, ధుళే, జల్గావ్, అమరావతి, వర్ధా, నాగపూర్, గోండియా జిల్లాల్లో 76-100 శాతం పనులు జరగ్గా పుణే, ఠాణే, సతారా, సాంగ్లీ జిలా ్లల్లో రైతులు వంద శాతానికి పైగా పనులు పూర్తిచేశా రు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కొంత మెరు గ్గా ఉన్నాయి. కాని మరఠ్వాడాలో మాత్రం మూడేళ్ల నుంచి కరవు తాండవిస్తోంది. గత ఏడాది పరిస్థితి మరీ దారుణంగా తయారవ్వడంతో స్థానికులు పనుల్లేక వలసలు వెళ్లిపోయారు. ఉన్న కొద్దిపాటి మంది తాగునీరు లేక విలవిల్లాడారు. ట్యాంకర్ల ద్వారా నీటిసరఫరా చేసినప్పటికీ అవి ఎటూ సరిపోలేదు.