![KL Rahul is Indias No. 1 keeper, Rishabh Pant will get his chance: Gautam Gambhir](/styles/webp/s3/article_images/2025/02/15/klrahulgambhir1.jpg.webp?itok=eyMRRqsY)
ఆస్ట్రేలియా పర్యటన లో ఘోర వైఫల్యం తర్వాత భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ లో కొన్ని కీలకమైన మార్పులు చేసాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కి ముందు ఇంగ్లండ్ తో జరిగిన సిరీస్ లో ఇందుకోసం తన ఫార్ములా ని పరీక్షించేందుకు ఉపయోగించుకున్నాడు.
భారత్ జట్టులోని కీలక బ్యాటర్ కూడా సొంత గడ్డపై మళ్ళీ తమ మునుపటి ఫామ్ ని అందుకున్నారు. ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ కి జట్టులోని ప్రధానబ్యాటర్లు అందరూ మానసికంగా సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్్ కోహ్లీ, ఓపెనర్ శుభమన్ గిల్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు పరుగులు సాధించి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.
రాహుల్ వైపే గంభీర్ మొగ్గు..
అయితే గంభీర్ తీసుకొచ్చిన మరో పెద్ద మార్పు. రిషబ్ పంత్ స్థానంలో భారత్ నెంబర్ 1 వికెట్ కీపర్ గా కె ఎల్ రాహుల్ ని ఎంచుకోవడం. రాహుల్ కి పంత్ కి చాలా వ్యత్యాసం ఉంది. ఇద్దరి బ్యాటింగ్ విధానంలో చాలా తేడా ఉంది. పంత్ భారీ షాట్లతో కొద్దిసేపటి లోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉన్నవాడు. రాహుల్ అందుకు భిన్నంగా ఆచి తూచి ఆడతాడు. క్రీజులో నిలదొక్కుకోవడానికి సమయం తీసుకుంటాడు. టెక్నికల్ గా రాహుల్ సమర్ధుడైన బ్యాటర్ అయినప్పటికీ, అతను స్వతహాగా ఆచి తూచి ఆడే స్వభావం గల బ్యాటర్.
ఇక్కడ మ్యాచ్ లో పరిస్థితులని బట్టి వీరిద్దరినీ ఉపయోగించుకోవాలి. టాప్ ఆర్డర్ బ్యాటర్ బాగా రాణించి స్కోర్ బాగా చేసినట్టయితే,అలాంటి పరిస్థితుల్లో శరవేగంగా మరిన్ని పరుగులు సాధించడానికి పంత్ సరిగ్గా సరిపోతాడు. అయితే పంత్ బ్యాటింగ్ శైలి వల్ల అతను నిలకడ రాణించగలడన్న గ్యారెంటీ లేదు.
కానీ రాహుల్ అందుకు భిన్నంగా, క్రీజులో నిలదొక్కుకుంటే తనదైన శైలిలో నేర్పుగా పరుగులు రాబట్టగలడు. ఇంత వైరుధ్యం గల ఇద్దరు వికెట్ కీపర్లలలో ఒకరిని ఎంచుకోవడం సామాన్య విషయం కాదు. ఎందుకంటే ఇద్దరూ వ్యక్తిగతంగా ఎంతో సామర్ధ్యం గల బ్యాట్స్మన్. ఇలాంటి క్లిష్టమైన విషయంలో కోచ్ గంభీర్ తన ప్రధాన వికెట్ కీపర్ గా రాహుల్ నే ఎంచుకోవడం. ఎందుకంటె రాహుల్ చాల నిలకడైన బ్యాటర్ కావడమే.
రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్అయితే ఈ నిర్ణయం చాల మందికి రుచించలేదు. ఇక్కడ మరో విషయం ఉంది. అది రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్. రాహుల్ సాధారణంగా టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ కి వస్తాడు. కానీ ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లోని తొలి రెండు వన్డేల్లో రాహుల్ ఆరో నెంబర్ బ్యాట్స్మన్ గా రంగంలోకి వచ్చాడు. “ప్రస్తుతానికి, కెఎల్ మాకు నంబర్ 1 వికెట్ కీపర్. ప్రస్తుతానికి అతను జట్టు తరపున అద్భుతంగా రాణిస్తున్నాడు" అని గంభీర్ అహ్మదాబాద్ మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు.
"జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లు ఉన్నప్పుడు, ఇద్దరు వికెట్ కీపర్లను ఆడించడం సాధ్యం కాదు. భారత్ జట్టులోని ఇతర బ్యాట్స్మన్ నైపుణ్యం, వారి అపార అనుభవం దృష్ట్యా చూస్తే, ఇది సాధ్యమయ్యే విషయం కాదు. ఇక పంత్ విషయానికి వస్తే అతను అవకాశం వచ్చిన్నప్పుడు ఆడటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ప్రస్తుతానికి నేను ఈ విషయం గురించి అంతే చెప్పగలను,," అని గంభీర్ తన నిర్ణయాన్ని తేటతెల్లం చేసాడు.
ఎడమచేతి వాటం బౌలర్ అక్షర్ పటేల్‌ను ఐదో స్థానంలో బ్యాటింగ్ కి బ్యాటింగ్ కి పంపించాలన్న గంభీర్ తీసుకున్న నిర్ణయం కూడా చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఫలితంగా, మొదటి రెండు మ్యాచ్‌లలో రాహుల్ ప్రదర్శన నిరాశపరిచింది - మొదటి రెండు మ్యాచ్‌లలో రాహుల్లో కేవలం రెండు, పది పరుగులు మాత్రమే చేసాడు.
చేసాడు. అయితే మూడో మ్యాచ్ లో రాహుల్ తనకి అనుకూలంగా ఉండే ఐదో స్థానంలో బ్యాటింగ్ కి వచ్చి 29 బంతుల్లో 40 పరుగులు చేశాడు.“రాహుల్‌ను ఆరో స్థానంలో బ్యాటింగ్ కి పంపించి అతనిని వృధా చేస్తున్నారు,” అని భారత మాజీ స్టంపర్ పార్థివ్ పటేల్ వ్యాఖ్యానించాడు. రికార్డులను చూడనని చెబుతూ గంభీర్ అలాంటి సూచనలను తోసిపుచ్చాడు. దుబాయ్‌లో రాహుల్ ఆరవ స్థానంలో కొనసాగాల్సి రావచ్చని కూడా గంభీర్ స్పష్టం చేశాడు. .
రాహుల్ ప్రపంచ కప్ రికార్డ్
2023 ప్రపంచ కప్ కి ముందు పంత్ గాయపడ్డాడు. ఆ దశలో రాహుల్ భారత్ జట్టు కి అండగా నిలిచి రాణించాడు. రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్ కి వచ్చి 75.33 సగటుతో 452 పరుగులు చేశాడు భారత్ ఫైనల్ కి చేర్చడంలో కీలక భూమిక పోషించాడు.
పైగా రాహుల్ భారత్ మిడిల్ ఆర్డర్‌ను పటిష్టంగా ఉంచాడు. ప్రస్తుతం కోచ్ గంభీర్ కూడా రాహుల్ నుంచి అదే ఆశిస్తున్నాడు. వికెట్ కీపింగ్ బాధ్యతలతో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ ని కూడా పటిష్టంగా ఉంచి జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ సాధించడంలో తోడ్పడుతాడని భావిస్తున్నాడు. మరి గంభీర్ వ్యూహం ఫలిస్తుందేమో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment