డచ్ ఓపెన్ అంతర్జాతీయ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ గారగ కృష్ణ ప్రసాద్ జంట రజత
హైదరాబాద్: డచ్ ఓపెన్ అంతర్జాతీయ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ గారగ కృష్ణ ప్రసాద్ జంట రజత పతకాన్ని సాధించింది. నెదర్లాండ్స్‌లోని హార్లీమ్ నగరంలో ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో కృష్ణ ప్రసాద్–ధ్రువ్ కపిల (భారత్) ద్వయం 13–21, 19–21తో సు లీ వీ–యో హోంగ్ వీ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో ఓడిపోయింది.
మరోవైపు పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ లక్ష్య సేన్ (భారత్) 19–21, 15–21తో చెన్ చీ టింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయి కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి ప్రాషి జోషి మూడో రౌండ్‌లో 26–28, 17–21తో ఐరా శర్మ (భారత్) చేతిలో ఓటమి చవిచూసింది.