
ఆర్‌ఎస్‌ఎల్ ఖార్కివ్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ యువ ఆటగాడు గారగ కృష్ణ ప్రసాద్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను గెల్చుకున్నాడు. ఉక్రెయిన్‌లో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో కృష్ణ ప్రసాద్–ధ్రువ్ కపిల (భారత్) ద్వయం 21–19, 21–16తో డానియల్ హెస్–జాన్స్ పిస్టోరియస్ (జర్మనీ) జోడీపై గెలిచింది.
మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో సౌరభ్–అనౌష్క జోడీ 18–21, 21–19, 22–20తో పావెల్ స్మిలోస్కి–మగ్దలీనా (పోలాండ్) జంటపై నెగ్గి టైటిల్ సొంతం చేసుకుంది.