'ఆర్డీఎస్‌పై చర్చించుకుందాం రండి' | Harish rao phone to devineni uma | Sakshi
Sakshi News home page

'ఆర్డీఎస్‌పై చర్చించుకుందాం రండి'

Published Tue, May 17 2016 4:41 PM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM

Harish rao phone to devineni uma

హైదరాబాద్: రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) పై చర్చలకు రావాలని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును తెలంగాణ మంత్రి హరీష్ రావు కోరారు. మంగళవారం  దేవినేనికి హరీష్ రావు ఫోన్ చేశారు. ఆర్డీఎస్ వద్ద తెలంగాణ సర్కారు చేపడుతున్న పనులను అడ్డుకోవాలంటూ కర్ణాటకలోని రాయచూరు కలెక్టర్‌కు కర్నూలు జిల్లా కలెక్టర్ రాసిన లేఖను ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా ఉమాకు హరీష్రావు విజ్ఞప్తి చేశారు.

ఈ అంశంపై రోజుల్లో సానుకూల నిర్ణయం తీసుకోకుంటే ఇకపై తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి సహకారం అందదని హరీష్రావు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ వైఖరిపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేయనున్నట్లు హరీష్రావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement