Minister for Irrigation
-
'ఆర్డీఎస్‌పై చర్చించుకుందాం రండి'
హైదరాబాద్: రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) పై చర్చలకు రావాలని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును తెలంగాణ మంత్రి హరీష్ రావు కోరారు. మంగళవారం దేవినేనికి హరీష్ రావు ఫోన్ చేశారు. ఆర్డీఎస్ వద్ద తెలంగాణ సర్కారు చేపడుతున్న పనులను అడ్డుకోవాలంటూ కర్ణాటకలోని రాయచూరు కలెక్టర్‌కు కర్నూలు జిల్లా కలెక్టర్ రాసిన లేఖను ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా ఉమాకు హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై రోజుల్లో సానుకూల నిర్ణయం తీసుకోకుంటే ఇకపై తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి ఎలాంటి సహకారం అందదని హరీష్‌రావు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ వైఖరిపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేయనున్నట్లు హరీష్‌రావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. -
'కొత్తగూడెంలో ఎయిర్‌పోర్ట్‌కు అనుమతి కోరాం'
న్యూఢిల్లీ: తెలంగాణలోని కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేసేందుకు అనుమతి మంజూరు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజును కలసి విజ్ఞప్తి చేసినట్లు ఆ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు వెల్లడించారు. మంగళవారం న్యూఢిల్లీలో అశోక్ గజపతి రాజును టి.హరీష్ రావు కలిశారు. అనంతరం హరీష్ రావు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... త్వరలో సీఎం కేసీఆర్, అశోక్‌గజపతి రాజుతో అత్యున్నత స్థాయి సమావేశం ఉంటుందని చెప్పారు. కల్వకుర్తి, కొమురం భీం, ప్రాణహితకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి జవదేకర్‌ను కలసి కోరినట్లు తెలిపారు. నదుల అనుసంధానంపై కేంద్ర జలవనరుల శాఖ సమావేశానికి హాజరువుతున్నట్లు చెప్పారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదలకు సంబంధించి ఏర్పడిన వివాదాలను కేంద్ర మంత్రి ఉమాభారతి దృష్టికి తీసుకువెళ్తామని హరీష్‌రావు పేర్కొన్నారు. -
'కేసీఆర్‌ని ఆదర్శంగా తీసుకుంటేనే అభివృద్ధి'
మెదక్: తెలంగాణ అభివృద్ధి జరగాలంటే... రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రజా ప్రతినిధులకు సూచించారు. అలాగే ప్రభుత్వ అధికారులు ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్‌ను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. శుక్రవారం మెదక్‌లో హరీశ్‌రావు మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లను రెసిడెన్షీయల్గా మార్చబోతున్నారని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడిన తర్వాత తొలిగా ఏర్పాటైన కేసీఆర్ ప్రభుత్వం పాలనతో దూసుకుపోతుందని హరీశ్‌రావు వెల్లడించారు. ప్రభుత్వ రెసిడేన్షియల్ హాస్టళ్ల అభివృద్ధికి, విద్యార్థుల అభివృద్ధికి ఐపీఏస్ అధికారి ప్రవీణ్ కుమార్ అందిస్తున్న సేవలను హరీశ్‌రావు ఈ సందర్బంగా ప్రస్తుతించారు.